ఇన్‌ స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫీచర్‌ | Instagram Introduces New Feature Called Notes In Direct Message Area | Sakshi
Sakshi News home page

ఇన్‌ స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫీచర్‌

Published Mon, Oct 3 2022 9:05 AM | Last Updated on Mon, Oct 3 2022 9:05 AM

Instagram Introduces New Feature Called Notes In Direct Message Area - Sakshi

ఇన్‌ స్టాగ్రామ్‌ యూజర్లకు అదిరిపోయే శుభవార్త. మార్కెట్‌లో పోటీని తట్టుకునేలా మాతృ సంస్థ మెటా ఇన్‌ స్ట్రాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తుంది. తాజాగా ‘నోట్స్‌’ పేరుతో ఫీచర్‌ను విడుదల చేసింది.  

ఈ ఫీచర్‌ సాయంతో ఇన్‌ స్టా అకౌంట్‌ డైరెక్ట్‌ మెసేజ్‌ (డీఎం) ఏరియాలో ఏదైనా ఒక అంశంపై 60 క్యారక్టర్స్‌తో టెక్ట్స్‌ అప్‌డేట్‌ చేయొచ్చు. ఆ టెక్ట్స్‌ను యూజర్లు వీక్షించే సౌలభ్యం కలగనుండగా..24 గంటల తర్వాత డీఎంలో ఉన్న టెక్ట్స్‌ డిజ్‌ అప్పియర్‌ అవుతుంది 

ఇన్‌స్టాగ్రామ్‌లో నోట్‌ను ఎలా యాక్సెస్‌ చేయాలంటే  

స్టెప్‌ 1 : మీ ఐఓఎస్‌ లేదా ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌ స్టాగ్రామ్‌ను ఓపెన్‌ చేయండి 

స్టెప్‌ 2 : చాట్ పేజీని యాక్సెస్ చేయడానికి, ఎడమవైపుకు స్వైప్ చేయండి. లేదంటే రైట్‌ సైడ్‌ కార్నర్‌లో చాట్‌ బటన్‌పై ట్యాప్‌ చేయండి.

స్టెప్‌3 : చాట్‌ బటన్‌పై ట్యాప్‌ చేస్తే మీకు సెర్చ్‌ ట్యాబ్‌లో రకరకాల ఆప్షన్‌లకు మీకు కనిపిస్తాయి. అందులో ‘యువర్‌ నోట్‌’ ఆప్షన్‌ను క్లిక్‌ చేసి అందులో మీరు ఏ అంశం గురించి రాయాలనుకుంటున్నారో టైప్‌ చేసి సేవ్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement