పటిష్టస్థితిలో ఇంగ్లండ్ | England has South Africa on ropes, leads 1st test by 261 | Sakshi
Sakshi News home page

పటిష్టస్థితిలో ఇంగ్లండ్

Published Tue, Dec 29 2015 2:24 AM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM

పటిష్టస్థితిలో ఇంగ్లండ్

పటిష్టస్థితిలో ఇంగ్లండ్

డర్బన్: బౌలర్లతోపాటు బ్యాట్స్‌మెన్ కూడా రాణించడంతో... దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ పటిష్టస్థితికి చేరుకుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లకు 172 పరుగులు చేసింది. జో రూట్ (60 బ్యాటింగ్; 4 ఫోర్లు, ఒక సిక్స్), జేమ్స్ టేలర్ (24 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. దాంతో కుక్ బృందం ఓవరాల్ ఆధిక్యం 261 పరుగులకు చేరింది.

అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 137/4తో తొలి ఇన్నింగ్స్ ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 81.4 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటవ్వడంతో ఇంగ్లండ్‌కు 89 పరుగుల ఆధిక్యం దక్కింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ (118 నాటౌట్; 8 ఫోర్లు, ఒక సిక్స్) అజేయ సెంచరీ సాధించడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్ (4/25), స్పిన్నర్ మొయిన్ అలీ (4/69) రాణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement