ఇంగ్లండ్‌ లయన్స్‌ 303/5 | In the first Test England Lions performed well | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ లయన్స్‌ 303/5

Published Fri, Feb 8 2019 2:34 AM | Last Updated on Fri, Feb 8 2019 2:34 AM

In the first Test England Lions performed well - Sakshi

వాయనాడ్‌: భారత్‌ ‘ఎ’తో గురువారం ప్రారం భమైన తొలి అనధికారిక టెస్టులో ఇంగ్లండ్‌ లయన్స్‌ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. బెన్‌ డకెట్‌ (80), స్యామ్‌ హెయిన్‌ (61) అర్ధ సెంచరీలు సాధించగా... విలియం జాక్స్‌ (40 బ్యాటింగ్‌), స్టీవెన్‌ ములానీ (39 బ్యాటింగ్‌) రాణించారు. భారత ‘ఎ’ బౌలర్లలో నితిన్‌ సైని 2 వికెట్లు పడగొట్టాడు. మరో వైపు ఇరు జట్ల మధ్య ఈ నెల 13నుంచి మైసూరులో జరిగే రెండో అనధికారిక టెస్టులో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ జట్టుకు లోకేశ్‌ రాహుల్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో కూడా రాహుల్‌ జట్టులో ఉన్నా... అంకిత్‌ బావ్నే నాయకత్వంలో జట్టు బరిలోకి దిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement