india A
-
దక్షిణాఫ్రికాపై నిలకడగా ఆడుతున్న భారత్..
బ్లూమ్ఫొంటీన్: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 125 పరుగులు చేసింది. పృథ్వీ షా (48) అవుట్ కాగా... ప్రియాంక్ పాంచల్ (45), అభిమన్యు ఈశ్వరన్ (27) క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 343/3తో ఆట కొనసాగించిన సఫారీ జట్టు 509/7 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ పీటర్ మాలన్(163), టోని డి జోర్జి (117) సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో నవ్‌దీప్ సైనీ, అర్జాన్ నాగ్వాస్వాల్లా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: WI Vs SL: పరాజయం దిశగా విండీస్... విజయానికి నాలుగు వికెట్ల దూరంలో శ్రీలంక.. -
భారత్ ‘ఎ’కు చేజారిన విజయం
ట్రినిడాడ్ అండ్ టొబాగో : వెస్టిండీస్ ‘ఎ’తో తొలి రెండు అనధికారిక టెస్టులు గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ ‘ఎ’ క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని మాత్రం చేజార్చుకుంది. మూడో టెస్టులో చివరి రోజు విండీస్ బ్యాట్స్‌మెన్ చక్కటి పోరాటపటిమ కనబర్చడంతో ఆ జట్టు ‘డ్రా’తో గట్టెక్కింది. 373 పరుగుల విజయలక్ష్యంతో ఆడుతూ విండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో చివరకు 6 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. షాబాజ్ నదీమ్ (5/103) మరోసారి రాణించినా... ఇతర బౌలర్ల వైఫల్యంతో భారత్ తమ ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోయింది. శుక్రవారం మొత్తం 94 ఓవర్లు ఆడిన విండీస్ 6 వికెట్లు మాత్రమే కోల్పోయింది. జెరెమీ సొలొజానో (250 బంతుల్లో 92; 8 ఫోర్లు), బ్రెండన్ కింగ్ (83 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), సునీల్ ఆంబ్రిస్ (142 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో జట్టును ఓటమి నుంచి రక్షించారు. భారత్ ‘ఎ’ కెప్టెన్, ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. నదీమ్ ఈ సిరీస్ నాలుగు ఇన్నింగ్స్‌లలో మూడుసార్లు ఐదేసి వికెట్ల చొప్పున మొత్తం 15 వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ పర్యటనలో 4–1తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ ‘ఎ’, టెస్టు సిరీస్‌ను 2–0తో గెలుచుకుంది. -
ఇంగ్లండ్ లయన్స్ 303/5
వాయనాడ్: భారత్ ‘ఎ’తో గురువారం ప్రారం భమైన తొలి అనధికారిక టెస్టులో ఇంగ్లండ్ లయన్స్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. బెన్ డకెట్ (80), స్యామ్ హెయిన్ (61) అర్ధ సెంచరీలు సాధించగా... విలియం జాక్స్ (40 బ్యాటింగ్), స్టీవెన్ ములానీ (39 బ్యాటింగ్) రాణించారు. భారత ‘ఎ’ బౌలర్లలో నితిన్ సైని 2 వికెట్లు పడగొట్టాడు. మరో వైపు ఇరు జట్ల మధ్య ఈ నెల 13నుంచి మైసూరులో జరిగే రెండో అనధికారిక టెస్టులో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ జట్టుకు లోకేశ్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో కూడా రాహుల్ జట్టులో ఉన్నా... అంకిత్ బావ్నే నాయకత్వంలో జట్టు బరిలోకి దిగింది. -
భారత్ ‘ఎ’ 304/6
ఆస్ట్రేలియా ‘ఎ’తో మ్యాచ్ బ్రిస్బేన్: ఆస్ట్రేలియా పర్యటనలో భారత ‘ఎ’ జట్టుకు మెరుగైన ఆరంభం లభించింది. ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో ఆదివారం ప్రారంభమైన తొలి అనధికారిక నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. కెప్టెన్ మనోజ్ తివారి (118 బంతుల్లో 83; 12 ఫోర్లు, 1 సిక్స్), కీపర్ నమన్ ఓజా (115 బంతుల్లో 82 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జీవన్‌జోత్ సింగ్ (56) కూడా అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ మార్ష్, కటింగ్, బోయ్స్ తలా 2 వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభంలోనే కేఎల్ రాహుల్ (15) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే రాబిన్ ఉతప్ప (23)తో పాటు అంబటి రాయుడు (0) కూడా వెనుదిరిగారు. అయితే ఈ దశలో జీవన్‌జోత్, తివారి కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 134 పరుగులు జోడించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి నమన్ ఓజాతో పాటు ధావల్ కులకర్ణి (12) క్రీజ్‌లో ఉన్నాడు.