
బ్లూమ్‌ఫొంటీన్: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 125 పరుగులు చేసింది. పృథ్వీ షా (48) అవుట్ కాగా... ప్రియాంక్ పాంచల్ (45), అభిమన్యు ఈశ్వరన్ (27) క్రీజ్‌లో ఉన్నారు.
అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 343/3తో ఆట కొనసాగించిన సఫారీ జట్టు 509/7 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ పీటర్ మాలన్(163), టోని డి జోర్జి (117) సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో నవ్‌దీప్ సైనీ, అర్జాన్ నాగ్వాస్వాల్లా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
చదవండి: WI Vs SL: పరాజయం దిశగా విండీస్... విజయానికి నాలుగు వికెట్ల దూరంలో శ్రీలంక..
Comments
Please login to add a commentAdd a comment