Priyank Panchal
-
ప్రియాంక్ పాంచల్ సుడిగాలి ఇన్నింగ్స్.. సిక్సర్ల మోత, 99 నాటౌట్
దియోదర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇవాళ (జులై 24) జరిగిన రెండో మ్యాచ్‌లో వెస్ట్ జోన్ ఓపెనర్, ఆ జట్టు కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ (69 బంతుల్లో 99 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతనికి మరో ఓపెనర్, వికెట్‌కీపర్ హార్విక్ దేశాయి (71 బంతుల్లో 85; 14 ఫోర్లు) సహకరించడంతో నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్ట్ జోన్ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. నార్త్ ఈస్ట్ జోన్ నిర్ధేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని వెస్ట్ జోన్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మరో 149 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఫలితంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంచల్, రాహుల్ త్రిపాఠి (11 బంతుల్లో 13 నాటౌట్; 2 ఫోర్లు) వెస్ట్ జోన్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ ఈస్ట్ జోన్.. సగ్వస్వల్లా (3/31), షమ్స్ ములానీ (2/37), శివమ్ దూబే (2/36), చింతన్ గజా (1/25), సేథ్ (1/38), పార్థ్ భట్ (1/34) ధాటికి 47 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. నార్త్ ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్‌లో తొమ్మిదో నంబర్ ఆటగాడు టాప్ స్కోరర్‌గా (38) నిలవడం విశేషం. పాంచల్ సుడిగాలి ఇన్నింగ్స్ తన సహజసిద్ధమైన ఆటకు భిన్నంగా ఆడిన ప్రియాంక్ పాంచల్.. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. కేవలం 69 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేశాడు. పాంచల్‌కు లిస్ట్-ఏ క్రికెట్లో ఇది 20వ అర్ధశతకం. లిస్ట్-ఏ క్రికెట్లో ఇప్పటివరకు 87 మ్యాచ్‌లు ఆడిన పంచల్.. 40కి పైగా సగటుతో 3378 పరుగులు చేశాడు. ఇందులో 20 ఫిఫ్టీలు, 7 శతకాలు ఉన్నాయి. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్‌పై 95 పరుగులు చేసిన పాంచల్ తన ఫామ్‌ను కొనసాగించాడు. -
పుజారా, సూర్య విఫలం.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన ప్రియాంక్.. ఇంకా..
Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: సౌత్ జోన్‌తో నువ్వా- నేనా అన్నట్లుగా సాగుతున్న దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్లో వెస్ట్ జోన్ గెలుపు అవకాశాలను సజీవంగా ఉంచాడు కెప్టెన్ ప్రియాంక్ పాంచల్. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును గట్టెక్కించాడు. టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారా(15), సూర్యకుమార్ యాదవ్ (4) విఫలమైన వేళ తానున్నానంటూ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. బెంగళూరు వేదికగా సాగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఓపెనింగ్ బ్యాటర్ ప్రియాంక్ 92 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సౌత్ జోన్‌ను ఓడించి టైటిల్ గెలవాలంటే వెస్ట్ జోన్ 116 పరుగులు చేయాలి. ఇంకా ఒకరోజు ఆట మిగిలి ఉండటం, చేతిలో ఐదు వికెట్లు ఉండటంతో వెస్ట్ జోన్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే, ప్రియాంక్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపిస్తే మాత్రం హనుమ విహారి సారథ్యంలోని సౌత్ జోన్ పైచేయి సాధించే అవకాశం ఉంది. వెస్ట్ జోన్ కీలక బ్యాటర్లంతా ఇప్పటికే పెవిలియన్ చేరడం ప్రత్యర్థికి కలిసి వచ్చే అంశం. కాగా వెస్ట్ జోన్- సౌత్ జోన్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్ బుధవారం ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్ట్ జోన్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌత్ జోన్ తిలక్ వర్మ(40), హనుమ విహారి(63) ఆదుకోవడంతో 213 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇక వెస్ట్ జోన్ తరఫున ఓపెనర్ పృథ్వీ షా(65) ఒక్కడే రాణించడం.. పుజారా(9), సూర్య(8) సహా ఇతర బ్యాటర్లు చేతులెత్తేయడంతో 146 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మెరుగైన ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌత్ జోన్ 230 పరుగులకు కథ ముగించింది. ఈ క్రమంలో వెస్ట్ జోన్ టాప్ బ్యాటర్లు మరోసారి విఫలం కావడం ప్రభావం చూపింది. అయితే, కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ 92 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. ఆఖరి రోజు 116 పరుగులు సాధిస్తేనే టైటిల్ గెలుస్తుంది. లేదంటే సౌత్ జోన్ ఈసారి చాంపియన్‌గా అవతరిస్తుంది. చదవండి: రహానేను కించపరిచిన ఇషాన్! ఇవే తగ్గించుకుంటే మంచిది.. మొన్న కోహ్లికే.. అతడిని టెస్టుల్లోకి తీసుకురావాలి.. ఎందుకంటే: కుంబ్లే కీలక వ్యాఖ్యలు 𝐒𝐭𝐮𝐦𝐩𝐬 𝐨𝐧 𝐃𝐚𝐲 𝟒 The match is nicely poised 👍 Priyank Panchal's fighting 92* has taken West Zone to 182/5 💪. They need 116 more to win. South Zone need 5 wickets.#WZvSZ | #DuleepTrophy | #Final 💻 Ball by ball updates - https://t.co/ZqQaMA6B6M pic.twitter.com/eGRmdrpQVh — BCCI Domestic (@BCCIdomestic) July 15, 2023 -
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌తో అదరగొట్టిన టీమిండియా
జోహెన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించడం ద్వారా 2021 ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికింది. జోహెన్నెస్‌బర్గ్ వేదికగా జనవరి 3 నుంచి రెండో టెస్టు ఆడనుంది. ఈ విషయం పక్కనపెడితే జోహన్నెస్‌బర్గ్ హోటల్ రూంలో టీమిండియా ఆటగాళ్లు కొత్త సంవత్సర వేడుకలను ధూంధాంగా నిర్వహించుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, దీపక్ చహర్, ప్రియాంక్ పాంచల్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. కోహ్లి చివర్లో వచ్చి తనదైన శైలిలో క్రికెట్ ఫ్యాన్స్‌కు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాడు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ప్రియాంక్ పాంచల్, అశ్విన్‌లు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన టీమిండియా జోహెన్నెస్‌బర్గ్‌లో గెలిచి ప్రొటీస్ గడ్డపై సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉంది. -
"ద్రవిడ్ సర్ నుంచి చాలా నేర్చుకున్నా... ఆయనే నా గురువు"
దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ స్ధానంలో ప్రియాంక్ పాంచల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ప్రియాంక్ పాంచల్ ప్రస్తుతం భారత-ఏ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం భారత జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాని పాంచల్ తెలిపాడు. 2019లో భారత-ఏ జట్టకు కెప్టెన్‌గా తానుని నియమించినప్పుడు చాలా సంతోష పడ్డాను,కానీ అంతే భయంగా ఉండేది అని అతడు తెలిపాడు. ఆ సమయంలో ద్రవిడ్ సర్ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారని పాంచల్ తెలిపాడు. "నేను భారత-ఏ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యనప్పుడు చాలా సంతోషపడ్డాను. అదే విధంగా అంతే భయపడ్డాను. ఆ సయయంలో రాహుల్ సర్ నా దగ్గరకు వచ్చి నీవు ఏమి భయపడకు, మామాలుగా ఉండు. నీలో సహజంగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అందుకే కెప్టెన్సీ బాధ్యతలు నీకు ఇచ్చారు. నీవు నీ ఆలోచనల్లో మార్పుచేయవలసిన అవసరంలేదు. ఇన్నాళ్లూ దేశవాళీ క్రికెట్లో నీవు కెప్టెన్‌గా రాణించడానికి ఏ మార్గాలను అనుసరించావో అవే ఇక్కడ కూడా అనుసరించు అని ద్రవిడ్ సర్ నాకు సలహా ఇచ్చారు. అండర్-15 క్రికెట్ ఆడుతున్నప్పడు రాహుల్ సర్ని తొలిసారిగా నేషనల్ క్రికెట్ అకాడమీలో చూశాను. నా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి నేను అతనిని అనుసరిస్తున్నాను. భారత-ఏ జట్టుకు అతనితో కలిసి పనిచేయడం నా అదృష్టం. అతను ఏదైనా చెప్పినప్పుడు, నేను దానిని ఒక క్రికెటర్‌గా తక్షణమే ఫాలో అయ్యాను. భారత టెస్ట్ జట్టులో చోటు దక్కడం ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను" అని పంచల్ పేర్కొన్నాడు. చదవండి: IND Vs SA: టీమిండియాకు మరో షాక్.. వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనని చెప్పిన కోహ్లి! ఎందుకంటే! -
Ind Vs SA: రోహిత్ శర్మ స్థానంలో ప్రియాంక్ పాంచల్.. 314 నాటౌట్!
Who Is Priyank Panchal : దక్షిణాఫ్రికా పర్యటనకు సన్నద్ధమవుతున్న సమయంలో టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. తొడ కండరాల గాయం కారణంగా టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ స్థానంలో సౌరాష్ట్ర ఆటగాడు ప్రియాంక్ పాంచల్‌ను టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసింది బీసీసీఐ. కాగా ప్రియాంక్ పాంచల్.. ఇటీవలి ‘ఎ’ జట్టు సౌతాఫ్రికా పర్యటనలో భారత కెప్టెన్‌గా వ్యవహరించాడు. గుజరాత్ ఓపెనర్‌గా సొంత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ప్రియాంక్.. అనధికారిక టెస్టు డ్రాగా ముగియడంలో తన వంతు పాత్ర పోషించాడు. తొలి టెస్టులో 96, రెండో టెస్టులో 24, 0 పరుగులు సాధించాడు. 100 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల అనుభవం... అహ్మదాబాద్‌కు చెందిన 31 ఏళ్ల ప్రియాంక్ పాంచల్ దేశవాళీ క్రికెట్లో గుజరాత్ తరఫున సుదీర్ఘ కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. 2008లో అరంగేట్రం చేసిన ప్రియాంక్ ఇప్పటివరకు 100 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 45.52 సగటుతో 7,011 పరుగులు చేశాడు. ప్రియాంక్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 24 సెంచరీలు, 25 అర్ధ సెంచరీలు సాధించాడు. 314 నాటౌట్ అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా... ఇటీవల దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన సిరీస్‌లో అతడు వరుసగా 96, 24, 0 పరుగులు సాధించాడు. 2016–17 సీజన్లో 1,310 పరుగులు చేసిన ప్రియాంక్... ఆ ఏడాది గుజరాత్ తొలిసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: Trolls On Rohit Sharma: వైస్ కెప్టెన్ కాదు.. ముందు ఫిట్‌గా ఉండు.. కోహ్లితో పెట్టుకున్నావు.. ఇదో గుణపాఠం! అయినా ఆ స్కోర్లేంటి బాబూ! View this post on Instagram A post shared by Priyank Panchal (@panchalpriyank) View this post on Instagram A post shared by Priyank Panchal (@panchalpriyank) -
రో‘హిట్ వికెట్’.. టెస్టు సిరీస్‌కు దూరం... బీసీసీఐ ప్రకటన
Rohit sustained a left hamstring injury: ఆస్ట్రేలియాలో రెండు వరుస టెస్టు సిరీస్ విజయాలు, ఇంగ్లండ్ గడ్డపై సిరీస్‌లో ఆధిక్యం తర్వాత అద్భుత ఫామ్‌లో ఉన్న ప్రస్తుత జట్టుతో దక్షిణాఫ్రికానూ గెలవాలని భావించిన టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఆదివారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ చేతికి స్వల్ప గాయం కావడంతో అదే కారణమని ముందుగా భావించారు. అయితే సమస్య అది కాదని, గతంలో ఇబ్బంది పెట్టిన తొడ కండరాల గాయం తిరగబెట్టినట్లు తర్వాత తెలిసింది. రోహిత్ తప్పుకున్న విషయాన్ని సోమవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. 2020 ఐపీఎల్లో ఇదే గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన రోహిత్... ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో మొత్తం నాలుగు టెస్టుల్లో చివరి రెండు మాత్రమే ఆడగలిగాడు. ఇప్పుడు అతని కెరీర్ కీలక దశలో అదే తొడ కండరాల గాయం మళ్లీ రోహిత్‌ను ఇబ్బంది పెట్టింది. రోహిత్ శర్మ స్థానంలో ఇటీవలి ‘ఎ’ జట్టు పర్యటనలో భారత కెప్టెన్‌గా ఉన్న గుజరాత్ ఓపెనర్ ప్రియాంక్ పాంచల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ టూర్‌కు వెళ్లాల్సిన భారత జట్టు సభ్యులంతా సోమవారం ముంబైలో ప్రత్యేక ‘బయో బబుల్’లో చేరారు. చదవండి: India Tour Of South Africa: దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ.. టెస్ట్‌లకు స్టార్ ప్లేయర్ దూరం More details here - https://t.co/XXH3H8MXuM#TeamIndia #SAvIND https://t.co/jppnewzVpG — BCCI (@BCCI) December 13, 2021 -
దక్షిణాఫ్రికాపై చెలరేగి ఆడుతున్న భారత్..
Update: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆట వర్షం కారణంగా ప్రారంభం కాలేదు. కాగా భారత్ ఇంకా 201 పరుగుల వెనుకంజలో ఉంది. India A Rich 308-4 On Day 3 In Reply To South Africa A: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 308 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ (103) సెంచరీ సాధించగా, ప్రియాంక్ పాంచల్ (96) త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకున్నాడు. హైదరాబాద్ ఆటగాడు హనుమ విహారి (25) విఫలమయ్యాడు. వర్షం కారణంగా గురువారం 60.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. చదవండి: Shreyas Gopal: ప్రేయసిని పెళ్లాడిన శ్రేయస్.. ఫొటోలు వైరల్ -
దక్షిణాఫ్రికాపై నిలకడగా ఆడుతున్న భారత్..
బ్లూమ్ఫొంటీన్: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 125 పరుగులు చేసింది. పృథ్వీ షా (48) అవుట్ కాగా... ప్రియాంక్ పాంచల్ (45), అభిమన్యు ఈశ్వరన్ (27) క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 343/3తో ఆట కొనసాగించిన సఫారీ జట్టు 509/7 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ పీటర్ మాలన్(163), టోని డి జోర్జి (117) సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో నవ్‌దీప్ సైనీ, అర్జాన్ నాగ్వాస్వాల్లా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: WI Vs SL: పరాజయం దిశగా విండీస్... విజయానికి నాలుగు వికెట్ల దూరంలో శ్రీలంక.. -
ఇండియా గ్రీన్ లక్ష్యం 474
లక్నో: దులీప్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా గ్రీన్ ముందు ఇండియా రెడ్ జట్టు 474 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు శనివారం ఆటలో ప్రియాంక్ పాంచల్ (133 నాటౌట్), దినేశ్ కార్తీక్ (100 నాటౌట్) అజేయ సెంచరీలు సాధించడంతో రెడ్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌ను 75 ఓవర్లలో రెండు వికెట్లకు 307 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో గ్రీన్‌పై 473 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత భారీ లక్ష్యం కోసం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన గ్రీన్ 30 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. -
వీవీఎస్ రికార్డును బద్ధలు కొడతాడా?
ముంబై: ప్రియాంక్ పాంచల్.. ఈ రంజీ సీజన్లో మార్మోగుతున్న పేరు. పంజాబ్‌పై అజేయ ట్రిపుల్ కొట్టి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో గుజరాత్ తరపున ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దాంతో పాటు జార్ఖండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో పాంచల్(149) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే క్రమంలో గుజరాత్ చిరస్మణీయ విజయంలో పాలు పంచుకున్నాడు. ఈ రంజీ సీజన్ ఆరంభం నుంచి తనదైన మార్కును చాటుకుంటూ చెలరేగిపోతున్నాడు. ఈ సీజన్లో 1270 పరుగుల సాధించి అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే ఇప్పుడు పాంచల్‌ను మరో రికార్డు కూడా ఊరిస్తోంది. మరో 146 పరుగులను పాంచల్ సాధిస్తే, మాజీ క్రికెటర్, స్టైలిష్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ గతంలో నెలకొల్పిన రికార్డు బద్ధలవుతుంది. రంజీల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటివరకూ వీవీఎస్ పేరిటే ఉంది. 1999 సీజన్లో లక్ష్మణ్ 1415 పరుగుల్ని సాధించాడు. ఇదే నేటి వరకూ రంజీ సీజన్లో అత్యధిక పరుగుల రికార్డుగా ఉంది. ఇప్పుడు ఆ అవకాశం పాంచల్ ముంగిట ఉంది. మంగళవారం నుంచి ముంబైతో జరిగే రంజీ ఫైనల్లో పాంచల్ రాణించిన పక్షంలో లక్ష్మణ్ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.