Rohit sustained a left hamstring injury: ఆస్ట్రేలియాలో రెండు వరుస టెస్టు సిరీస్ విజయాలు, ఇంగ్లండ్ గడ్డపై సిరీస్‌లో ఆధిక్యం తర్వాత అద్భుత ఫామ్‌లో ఉన్న ప్రస్తుత జట్టుతో దక్షిణాఫ్రికానూ గెలవాలని భావించిన టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఆదివారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ చేతికి స్వల్ప గాయం కావడంతో అదే కారణమని ముందుగా భావించారు. అయితే సమస్య అది కాదని, గతంలో ఇబ్బంది పెట్టిన తొడ కండరాల గాయం తిరగబెట్టినట్లు తర్వాత తెలిసింది.
రోహిత్ తప్పుకున్న విషయాన్ని సోమవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. 2020 ఐపీఎల్‌లో ఇదే గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన రోహిత్... ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో మొత్తం నాలుగు టెస్టుల్లో చివరి రెండు మాత్రమే ఆడగలిగాడు. ఇప్పుడు అతని కెరీర్ కీలక దశలో అదే తొడ కండరాల గాయం మళ్లీ రోహిత్‌ను ఇబ్బంది పెట్టింది. రోహిత్ శర్మ స్థానంలో ఇటీవలి ‘ఎ’ జట్టు పర్యటనలో భారత కెప్టెన్‌గా ఉన్న గుజరాత్ ఓపెనర్ ప్రియాంక్ పాంచల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ టూర్‌కు వెళ్లాల్సిన భారత జట్టు సభ్యులంతా సోమవారం ముంబైలో ప్రత్యేక ‘బయో బబుల్’లో చేరారు.
చదవండి: India Tour Of South Africa: దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ.. టెస్ట్‌లకు స్టార్ ప్లేయర్ దూరం
More details here - https://t.co/XXH3H8MXuM#TeamIndia #SAvIND https://t.co/jppnewzVpG
— BCCI (@BCCI) December 13, 2021
Comments
Please login to add a commentAdd a comment