Who Is Priyank Panchal : దక్షిణాఫ్రికా పర్యటనకు సన్నద్ధమవుతున్న సమయంలో టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. తొడ కండరాల గాయం కారణంగా టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ స్థానంలో సౌరాష్ట్ర ఆటగాడు ప్రియాంక్ పాంచల్‌ను టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసింది బీసీసీఐ. కాగా ప్రియాంక్ పాంచల్.. ఇటీవలి ‘ఎ’ జట్టు సౌతాఫ్రికా పర్యటనలో భారత కెప్టెన్‌గా వ్యవహరించాడు. గుజరాత్ ఓపెనర్‌గా సొంత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ప్రియాంక్.. అనధికారిక టెస్టు డ్రాగా ముగియడంలో తన వంతు పాత్ర పోషించాడు. తొలి టెస్టులో 96, రెండో టెస్టులో 24, 0 పరుగులు సాధించాడు.
100 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల అనుభవం...
అహ్మదాబాద్‌కు చెందిన 31 ఏళ్ల ప్రియాంక్ పాంచల్ దేశవాళీ క్రికెట్‌లో గుజరాత్ తరఫున సుదీర్ఘ కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. 2008లో అరంగేట్రం చేసిన ప్రియాంక్ ఇప్పటివరకు 100 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 45.52 సగటుతో 7,011 పరుగులు చేశాడు. ప్రియాంక్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 24 సెంచరీలు, 25 అర్ధ సెంచరీలు సాధించాడు. 314 నాటౌట్ అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా... ఇటీవల దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన సిరీస్‌లో అతడు వరుసగా 96, 24, 0 పరుగులు సాధించాడు. 2016–17 సీజన్‌లో 1,310 పరుగులు చేసిన ప్రియాంక్... ఆ ఏడాది గుజరాత్ తొలిసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment