
జోహెన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించడం ద్వారా 2021 ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికింది. జోహెన్నెస్‌బర్గ్ వేదికగా జనవరి 3 నుంచి రెండో టెస్టు ఆడనుంది. ఈ విషయం పక్కనపెడితే జోహన్నెస్‌బర్గ్ హోటల్ రూంలో టీమిండియా ఆటగాళ్లు కొత్త సంవత్సర వేడుకలను ధూంధాంగా నిర్వహించుకున్నారు.
రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, దీపక్ చహర్, ప్రియాంక్ పాంచల్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. కోహ్లి చివర్లో వచ్చి తనదైన శైలిలో క్రికెట్ ఫ్యాన్స్‌కు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాడు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ప్రియాంక్ పాంచల్, అశ్విన్‌లు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన టీమిండియా జోహెన్నెస్‌బర్గ్‌లో గెలిచి ప్రొటీస్ గడ్డపై సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment