దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ స్ధానంలో ప్రియాంక్ పాంచల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ప్రియాంక్ పాంచల్ ప్రస్తుతం భారత-ఏ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం భారత జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాని పాంచల్ తెలిపాడు. 2019లో భారత-ఏ జట్టకు కెప్టెన్‌గా తానుని నియమించినప్పుడు చాలా సంతోష పడ్డాను,కానీ అంతే భయంగా ఉండేది అని అతడు తెలిపాడు. ఆ సమయంలో ద్రవిడ్ సర్ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారని పాంచల్ తెలిపాడు.
"నేను భారత-ఏ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యనప్పుడు చాలా సంతోషపడ్డాను. అదే విధంగా అంతే భయపడ్డాను. ఆ సయయంలో రాహుల్ సర్ నా దగ్గరకు వచ్చి నీవు ఏమి భయపడకు, మామాలుగా ఉండు. నీలో సహజంగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అందుకే కెప్టెన్సీ బాధ్యతలు నీకు ఇచ్చారు. నీవు నీ ఆలోచనల్లో మార్పుచేయవలసిన అవసరంలేదు. ఇన్నాళ్లూ దేశవాళీ క్రికెట్‌లో నీవు కెప్టెన్‌గా రాణించడానికి ఏ మార్గాలను అనుసరించావో అవే ఇక్కడ కూడా అనుసరించు అని ద్రవిడ్ సర్ నాకు సలహా ఇచ్చారు. అండర్-15 క్రికెట్ ఆడుతున్నప్పడు రాహుల్ సర్‌ని తొలిసారిగా నేషనల్ క్రికెట్ అకాడమీలో చూశాను. నా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి నేను అతనిని అనుసరిస్తున్నాను. భారత-ఏ జట్టుకు అతనితో కలిసి పనిచేయడం నా అదృష్టం. అతను ఏదైనా చెప్పినప్పుడు, నేను దానిని ఒక క్రికెటర్‌గా తక్షణమే ఫాలో అయ్యాను. భారత టెస్ట్ జట్టులో చోటు దక్కడం ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను" అని పంచల్ పేర్కొన్నాడు.
చదవండి: IND Vs SA: టీమిండియాకు మరో షాక్.. వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనని చెప్పిన కోహ్లి! ఎందుకంటే!
Comments
Please login to add a commentAdd a comment