బంగ్లాదేశ్‌ 233 ఆలౌట్‌ | Bangladesh All Out For 233 In First Test Against Pakistan | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌ 233 ఆలౌట్‌

Published Sat, Feb 8 2020 2:28 AM | Last Updated on Sat, Feb 8 2020 2:28 AM

Bangladesh All Out For 233 In First Test Against Pakistan - Sakshi

రావల్పిండి: పాకిస్తాన్‌తో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ పేలవ ప్రదర్శన కనబర్చింది. పాక్‌ బౌలింగ్‌ ధాటికి బంగ్లా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 82.5 ఓవర్లలో 233 పరుగులకే కుప్పకూలింది. మొహమ్మద్‌ మిథున్‌ (140 బంతుల్లో 63; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీతో రాణించగా... నజ్ముల్‌ హుస్సేన్‌ (44), లిటన్‌ దాస్‌ (33), కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌ (30) కొద్దిగా ప్రతిఘటించగలిగారు. పేసర్‌ షాహిన్‌ అఫ్రిది (4/53) మెరుపు బౌలింగ్‌తో చెలరేగాడు. హారిస్‌ సొహైల్, అబ్బాస్‌ చెరో 2 వికెట్లు తీశారు. వెలుతురులేమి కారణంగా అంపైర్లు ఆటను ముందుగానే నిలిపివేయడంతో పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌ సాధ్యం కాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement