పాకిస్తాన్‌తో టెస్ట్‌ సిరీస్‌.. బంగ్లాదేశ్‌ జట్టు ప్రకటన | Bangladesh Squad Announced For Pakistan Test Series, Check Names And Schedule Details Inside | Sakshi
Sakshi News home page

BAN Vs PAK: పాకిస్తాన్‌తో టెస్ట్‌ సిరీస్‌.. బంగ్లాదేశ్‌ జట్టు ప్రకటన

Published Sun, Aug 11 2024 9:07 PM | Last Updated on Mon, Aug 12 2024 12:43 PM

Bangladesh Squad Announced For Pakistan Test Series

ఈ నెల 21 నుంచి పాకిస్తాన్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం 15 మంది సభ్యుల బంగ్లాదేశ్‌ జట్టును ఇవాళ (ఆగస్ట్‌ 11) ప్రకటించారు. ఈ జట్టులో సీనియర్లు షకీబ్‌ అల్‌ హసన్‌, తస్కిన్‌ అహ్మద్‌, ముష్ఫికర్‌ రహీం, షోరిఫుల్‌ ఇస్లాం, మొమినుల్‌ హాక్‌ చోటు దక్కించుకోగా.. నజ్ముల్‌ హసన్‌ షాంటో జట్టుకు సారధిగా వ్యవహరించనున్నాడు.

బంగ్లాదేశ్‌ జట్టు..
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్‌), మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, షద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ కుమార్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహిద్ రానా, షోరీఫుల్‌ ఇస్లాం, హసన్ మహమూద్‌, తస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖలీద్ అహ్మద్

పాకిస్తాన్‌ జట్టు..
షాన్‌ మసూద్‌ (కెప్టెన్‌), సైమ్‌ అయూబ్‌, మహ్మద్‌ హురైరా, బాబర్‌ ఆజమ్‌, అబ్దుల్లా షఫీక్‌, అఘా సల్మాన్‌, సౌద్‌ షకీల్‌, కమ్రాన్‌ గులామ్‌, ఆమెర్‌ జమాల్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌, మీర్‌ హమ్జా, మహ్మద​్‌ అలీ, నసీం షా, అబ్రార్‌ అహ్మద్‌, ఖుర్రమ్‌ షెహజాద్‌, షాహీన్‌ అఫ్రిది

షెడ్యూల్‌..

తొలి టెస్ట్‌: ఆగస్ట్‌ 21-25 (రావల్పిండి)
రెండో టెస్ట్‌: ఆగస్ట్‌ 30-సెప్టెంబర్‌ 3 (కరాచీ)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement