సందిగ్ధంలో నరైన్ | Narine's dilemma: IPL final or West Indies camp? | Sakshi
Sakshi News home page

సందిగ్ధంలో నరైన్

Published Sat, May 31 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM

సందిగ్ధంలో నరైన్

సందిగ్ధంలో నరైన్

ఐపీఎల్ ఫైనలా... వెస్టిండీస్ టెస్టా?
 న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో కోల్‌కతా ఫైనల్‌కు చేరడంలో సునీల్ నరైన్ మ్యాజిక్ బౌలింగ్ కీలక పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు టైటిల్ పోరుకు అతను కోల్‌కతా జట్టుతో అందుబాటులో ఉంటాడా లేదా అనేది సందేహంగా మారింది. జూన్ 8 నుంచి వెస్టిండీస్, న్యూజిలాండ్‌ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.
 
 అంతకు ముందు విండీస్‌కు క్యాంప్ నిర్వహించనున్నారు. ఆటగాళ్లు జట్టుతో చేరేందుకు జూన్ 1ను తుది గడువుగా నిర్ణయించారు. అయితే అదే రోజు ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో నరైన్ లేకపోతే అది నైట్‌రైడర్స్ అవకాశాలను దెబ్బ తీస్తుంది. అయితే క్యాంపులో చేరకపోతే తొలి టెస్టులో ఆడే అవకాశం దక్కదని విండీస్ క్రికెట్ బోర్డు సీఈఓ మైకేల్ మూర్‌హెడ్ స్పష్టం చేశారు. మరోవైపు నైట్‌రైడర్స్ యాజమాన్యం మాత్రం నరైన్‌ను వదులుకోవడానికి ఇష్ట పడటం లేదు. ఫైనల్ ముగియగానే అందు బాటులో ఉన్న తొలి ఫ్లయిట్‌కు నరైన్ పంపిస్తామని కోల్‌కతా సీఈఓ వెంకీ మైసూర్ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement