కీరన్ పొలార్డ్
Ind Vs Wi: ‘‘ఫిల్, పొలార్డ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెటేతర కారణాల వల్లే ఇలా జరుగుతోంది. అంతేతప్ప ఆట పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఏదేమైనా ఇప్పట్లో కోచ్, కెప్టెన్‌ను మార్చే యోచనే లేదు’’ అని క్రికెట్ వెస్టిండీస్ అధ్యక్షుడు రికీ స్కెరిట్ స్పష్టం చేశాడు. కాగా టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్, కోచ్ ఫిల్ సిమన్స్‌పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
టీ20 ప్రపంచకప్-2021లో వెస్టిండీస్ జట్టు ఘోర వైఫల్యం, ఇటీవల స్వదేశంలో ఐర్లాండ్ చేతిలో వన్డే సిరీస్ ఓటమి తర్వాత ఇవి మరింత ఎక్కువయ్యాయి. ముఖ్యంగా జట్టులోని కొందరు ఆటగాళ్ల పట్ల పొలార్డ్ వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి స్థానిక మీడియాలో కథనాలు వెలువడగా... విండీస్ బోర్డు వాటిని ఖండించింది. ఈ క్రమంలో సీడబ్ల్యూఐ అధ్యక్షుడు రికీ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... ‘‘ఒకవేళ వాళ్లు(ఫిల్, పొలార్డ్) తమ బాధ్యతను సరిగా నెరవేర్చలేదని నిరూపితమైతే అప్పుడు కచ్చితంగా పునరాలోచన చేస్తాం.
అంతేతప్ప ఇప్పటికిప్పుడు వారిని పంపే ప్రసక్తే లేదు. కొంతమంది అకారణంగా వారిపై నిందలు వేస్తున్నారు. వారిని తక్కువ చేసి చూపించాలనుకుంటున్నారు’’ అని కెప్టెన్, కోచ్‌కు మద్దతుగా నిలిచాడు. కాగా ఐర్లాండ్ చేతిలో ఘోర ఓటమి పాలైన విండీస్.. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్(3-2 తేడాతో)ను కైవసం చేసుకుని తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. ఫిబ్రవరి 6న టీమిండియాతో ఆరంభం కానున్న వన్డే సిరీస్‌కు పొలార్డ్ బృందం సన్నద్ధమవుతోంది.
చదవండి: IPL 2022 Mega Auction: అతడు వేలంలోకి వస్తే.. జట్లు పోటీ పడాల్సిందే: అశ్విన్
IND vs WI: ఇప్పుడు ఇంగ్లండ్ పని అయిపోయింది.. తరువాత టీమిండియానే: పొలార్డ్
Comments
Please login to add a commentAdd a comment