మాంచెస్టర్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన చివరిదైన ఐదో టెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య షెడ్యూల్ సమయానికి మూడు గంటల ముందు రద్దైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై బీసీసీఐ, ఈసీబీల మధ్య చర్చలు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌ను వచ్చే ఏడాది భారత పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు నిర్వహించాలని ఇరు బోర్డులు పరస్పర అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.
మరోవైపు సిరీస్ ఫలితంపై ఐసీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోగా ఈసీబీ మాత్రం ఓ విషయాన్ని స్పష్టం చేసింది. ఒకవేళ మ్యాచ్ రీ షెడ్యూల్ అయినా.. ఆ మ్యాచ్‌తో ప్రస్తుత సిరీస్‌కు సంబంధం ఉండదని, అది స్టాండ్ అలోన్ మ్యాచ్ అవుతుందని(సెపరేట్ మ్యాచ్) ఈసీబీ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ సిరీస్‌ను టీమిండియా(2-1) అనధికారికంగా కైవసం చేసుకున్నట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే, టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు నిన్న కరోనా నిర్దారణ కావడంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే నేటి మ్యాచ్ బరిలోకి దిగేందుకు టీమిండియా ఆటగాళ్లు విముఖత వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయాన్ని ఈసీబీ మరో విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కరోనా కేసుల కారణంగా టీమిండియా మ్యాచ్‌ను వదులుకోవడానికి(forfeit the match) సిద్ధమైందంటూ ప్రకటన విడుదల చేసింది. ఆ వెంటనే ఈ పదాన్ని తొలగిస్తూ మరో ప్రకటనను తన ట్విటర్‌లో ఉంచింది.
చదవండి: 'టీమిండియా ఓడిపోయింది'.. మాట మార్చిన ఈసీబీ
Comments
Please login to add a commentAdd a comment