కరోనా కారణంగా రద్దైన 'ఆ' టెస్ట్‌ మ్యాచ్‌ షెడ్యూల్‌ ఖరారు | India Vs England 5th Test Schedule Announced | Sakshi
Sakshi News home page

India Vs England: రద్దైన 'ఆ' టెస్ట్‌ మ్యాచ్‌ షెడ్యూల్‌ ఖరారు

Published Fri, Oct 22 2021 8:23 PM | Last Updated on Fri, Oct 22 2021 8:23 PM

India Vs England 5th Test Schedule Announced - Sakshi

India Vs England 5th Test To Be Held In July 2022: ఐపీఎల్‌-2021 రెండో దశకు ముందు ఇంగ్లండ్‌ పర్యటనలో రద్దైన ఐదో టెస్ట్‌(మాంచెస్టర్‌) మ్యాచ్‌పై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ), ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ)లు క్లారిటీ ఇచ్చాయి. భారత శిబిరంలో కరోనా కేసు వెలుగు చూడడంతో  రద్దైన ఆ మ్యాచ్‌ను వచ్చే ఏడాది ఇంగ్లండ్‌ పర్యటనలో నిర్వహించేందుకు ఇరు దేశాల క్రికెట్‌ బోర్డులు అంగీకరించాయి.

పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం టీమిండియా వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో పర్యటించనుండగా.. అందులో భాగంగా జులై 1 నుంచి 5వ తేదీ వరకు ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా రద్దైన టెస్ట్‌ జరుగుతుందని ఇరు దేశాల బోర్డులు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.  ఈ మ్యాచ్‌ అనంతరం టీమిండియా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య 3 టీ20లు (జులై 7, 9, 10), 3 వన్డేలు(జులై 12, 14, 17) జరగనున్నాయి. కాగా, భారత్‌- ఇంగ్లండ్‌ల మధ్య ఈ ఏడాది సెప్టెంబర్‌ 10న జరగాల్సిన ఐదో టెస్ట్‌ మ్యాచ్‌.. టీమిండియా జూనియర్‌ ఫిజియో యోగేశ్‌ పర్మార్‌కు కరోనా నిర్దారణ కావడంతో రద్దైన సంగతి తెలిసిందే.
చదవండి: ట్రోఫితో పాటు ఆ రెండు రికార్డులు టీమిండియా క్రికెటర్లవే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement