schedule announce
-
ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్ఈ 10, 12 తరగతి పరీక్షలు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ బుధవారం ప్రకటించింది. పదో తరగతి పరీ క్షలు మార్చి 18వ తేదీన ముగియ నున్నాయి. 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ నాలుగో తేదీన ముగియనున్నాయి. సీబీఎస్ ఈ 86 రోజుల ముందుగానే బోర్డ్ పరీక్షల తేదీలను ప్రకటించడం ఇదే తొలిసారి. ‘‘ప్రతి రెండు సబ్జెక్ట్ పరీక్షల మధ్య సరిపోను వ్యవధి ఉండేలా చూశాం. 40,000 సబ్జెక్ట్ కాంబినేషన్లను దృష్టిలో ఉంచుకుని పరీక్ష తేదీల ను సిద్ధంచేశాం. -
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025 షెడ్యూల్ విడుదల
సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20) 2025 ఎడిషన్ (సీజన్-3) షెడ్యూల్ ఇవాళ (సెప్టెంబర్ 2) విడుదలైంది. ఈ లీగ్ జనవరి 9న ప్రారంభం కానుంది. లీగ్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్.. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ సన్‌రైజర్స్ హోం గ్రౌండ్ అయిన సెయింట్ జార్జ్స్ పార్క్‌లో జరుగనుంది. లీగ్ ఫైనల్ మ్యాచ్ జొహనెస్‌బర్గ్ వేదికగా ఫిబ్రవరి 8న జరుగనుంది.SA20 2025 FIXTURES...!!!!- Starts on January 9th & Final on February 8th. THE CRICKET CARNIVAL IN SOUTH AFRICA ⚡ pic.twitter.com/jZZKyeEAAJ— Johns. (@CricCrazyJohns) September 2, 2024ఈసారి లీగ్‌లో మొత్తం 30 లీగ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. లీగ్ మ్యాచ్‌ల అనంతరం టాప్-4 జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. మొదటి క్వాలిఫయర్ ఫిబ్రవరి 4న జరుగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్ ఫిబ్రవరి 5న.. క్వాలిఫయర్-2 ఫిబ్రవరి 6న జరుగనున్నాయి. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025 ఎడిషన్‌లో కేన్ విలియమ్సన్, జో రూట్, బెన్ స్టోక్స్, దినేశ్ కార్తీక్ లాంటి స్టార్ ఆటగాళ్లు కొత్తగా పాల్గొననున్నారు. ఈ లీగ్ యొక్క మ్యాచ్‌లు వయాకామ్18 స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.ఎస్ఏ20 లీగ్ యొక్క వివరాలు..డిఫెండింగ్ ఛాంపియన్-సన్‌రైజర్స్ ఈస్ట్రన్కేప్అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టు-సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ (2)ఇప్పటి వరకు జరిగిన సీజన్లు-2అత్యధిక పరుగులు- హెన్రిచ్ క్లాసెన్ (810)అత్యధిక వికెట్లు- ఓట్నీల్ బార్ట్‌మన్ (30)లీగ్‌లో మొత్తం జట్లు-6జట్ల పేర్లు..సన్‌రైజర్స్ ఈస్ట్రన్కేప్ఎంఐ కేప్టౌన్డర్బన్ సూపర్ జెయింట్స్జోబర్గ్ సూపర్ కింగ్స్పార్ల్ రాయల్స్ప్రిటోరియా క్యాపిటల్స్ -
మే 23న ఎడ్‌సెట్..జూన్ 4,5 తేదీల్లో ఐసెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 4, 5 తేదీల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ను ఆదివారం విడుదల చేసింది. మార్చి 5న నోటిఫికేషన్, 7నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఆలస్య రుసుముతో మే 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని షెడ్యూల్లో పేర్కొంది. పూర్తి వివరాల కోసం https://icet. tsche. ac.in ను చూడవచ్చని తెలిపింది. మే 23న ఎడ్‌సెట్ రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఉమ్మడి ప్రవేశ పరీక్షను మే 23న నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది. మార్చి 4న నోటిఫికేషన్, మార్చి 6 నుంచి మే 13 వరకూ దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వెల్లడించింది. పరీక్ష మే 23న ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ, సాయంత్రం 2 నుంచి 4 గంటల వరకూ ఉంటుందని పేర్కొంది. -
రోజుకు రెండు విడతలుగా టీఆర్టీ
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ప్రభుత్వం మొత్తంగా 5,089 పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ ఇవ్వగా.. తాజాగా రాత పరీక్ష, నియామక విధి విధానాల సమగ్ర వివరాలతో బులెటిన్ జారీ చేసింది. నవంబర్ 20వ తేదీ నుంచి రోజూ రెండు సెషన్లలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) ఉంటుందని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్.. మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని తెలిపింది. పూర్తి ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. అభ్యర్థులు ఇచ్చే ఆప్షన్లను బట్టి పరీక్ష కేంద్రాల కేటాయింపు ఉంటుందని వెల్లడించింది. –సాక్షి, హైదరాబాద్ ఒక్కో ప్రశ్నకు అర మార్కు స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) పోస్టులకోసం నిర్వహిస్తున్న ఈ పరీక్షల్లో 160 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోదానికి అర మార్కు ఉంటుంది. టీఆర్టీ నియామకాల్లో టెట్ మార్కులకు వెయిటేజీ ఉంటుంది. అంటే 80శాతం మార్కులను రాత పరీక్ష నుంచి, 20 శాతం మార్కులను టెట్ నుంచి కలిపి తుది మార్కులను నిర్ణయిస్తారు. ♦ ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధించిన పరీక్షలో వంద మార్కులకు 200 ప్రశ్నలుంటాయి. ♦ ఎస్జీటీలకు ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు.. మిగతా పోస్టులకు ఇంటర్మిడియేట్ వరకు రాష్ట్ర సిలబస్ నుంచి ప్రశ్నలిస్తారు. ♦ దివ్యాంగులకు గతంలో 75శాతంపైగా వైకల్యం ఉండాలనే నిబంధన ఉండగా.. దీనిని 40శాతానికి తగ్గించారు. పరీక్ష కేంద్రాలు ఇవీ.. అభ్యర్థులు అక్టోబర్ 20వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి, రూ.వెయ్యి పరీక్ష ఫీజుగా చెల్లించాలి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్,వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల్లో ఆన్లైన్ పరీక్షా కేంద్రాలు ఉంటాయి. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులుఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఆప్షన్లను బట్టి అభ్యర్థులకు పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తారు. పోస్టుల వారీగా అర్హతలివీ.. ♦ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థులు కనీసం 50శాతం మార్కులతో పీజీ లేదా డిగ్రీతోపాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి. (రిజర్వేషన్ కేటగిరీల వారు 45శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే చాలు).ఏ సబ్జెక్టు పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారో, సంబంధిత సబ్జెక్టును డిగ్రీలో చదివి ఉండాలి. ♦ లాంగ్వేజ్ పండిట్లు సంబంధిత భాషలో డిగ్రీ, బీఈడీ చేసి ఉండాలి. ♦ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఇంటర్లో కనీసం 50% (రిజర్వేషన్ వారికి 45%) మార్కులు పొంది.. డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. డిగ్రీతోపాటు బీపీఈడీ చేసిన వారు కూడా దీనికి అర్హులే. ♦ అన్ని పోస్టులకు అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.ఆయ వర్గాల రిజర్వేషన్ల మేÆý‡కు మినహాయింపులు వర్తిస్తాయి. పరీక్షలు, సిలబస్ తీరు ఇదీ.. ♦ స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులకు 160 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు అరమార్కు చొప్పున 80 మార్కులుంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, విద్యలో పురోగతి, టీచింగ్ మెథడ్ నుంచి వివిధ అంశాలతో ప్రశ్నలుంటాయి. ♦ ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్షలో 200 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి అర మార్కు చొప్పున వంద మార్కులు ఉంటాయి. ఇందులో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంగ్లి‹Ùతోపాటు క్రీడా విద్యకు సంబంధించి వివిధ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ♦ ఎస్జీటీలకు 160 ప్రశ్నలుంటాయి. ఒక్కో దానికి అరమార్కు చొప్పున 80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. వివిధ సబ్జెక్టులు, టీచింగ్ విధానాలు, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలుంటాయి. ఇవి 8వ తరగతి వరకూ ఉండే సిలబస్ నుంచి ఇస్తారు. ♦ పరీక్షలో కనీసం ఓసీలు 90 మార్కులు, బీసీలు 75, ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు 60 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులైనట్టుగా భావిస్తారు. అభ్యర్థులు సాధించే మార్కులు, రోస్టర్‌ను అనుసరించి ఒక్కో పోస్టుకు ముగ్గురి చొప్పున ఎంపిక చేస్తారు. వారి నుంచి డీఎస్సీ ఒకరిని ఎంపిక చేస్తుంది. ఎవరికి ఎప్పుడు పరీక్ష? -
వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్ విడుదల ఇవాళే
క్రికెట్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (జూన్ 27) ప్రకటించనుంది. ఉదయం 11:30 గంటలకు ముంబైలో జరిగే ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఐసీసీ కార్యవర్గ సభ్యులు షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. వరల్డ్‌కప్ ప్రారంభ తేదీ అయిన అక్టోబర్ 5కు జూన్ 27 సరిగ్గా 100 రోజులు ముందుండంతో ఐసీసీ ఈ తేదీన షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించింది. కాగా, బీసీసీఐ-పీసీబీల మధ్య వరల్డ్‌కప్ వేదికల వ్యవహారంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో షెడ్యూల్ ప్రకటన ఆలస్యం అయిన విషయం తెలిసిందే. అయితే బీసీసీఐతో పలు చర్చల అనంతరం పీసీబీ ఈ విషయంలో అంగీకారం తెలిపినట్లు సమాచారం. అహ్మదాబాద్‌లో భారత్‌తో తలపడేందుకు పాక్ ఒప్పుకుందని తెలుస్తోంది. అలాగే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్లతో బెంగళూరు, చెన్నైలలో మ్యాచ్‌లు ఆడేందుకు పాక్ అంగీకారం తెలిపిందని సమాచారం. ఇదిలా ఉంటే, వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ (అక్టోబర్ 5), ఫైనల్ మ్యాచ్‌లకు (నవంబర్ 19) అహ్మదాబాద్ వేదికగా ఖరారైందని తెలుస్తోంది. భారత్.. తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను, రెండో మ్యాచ్‌లో (అక్టోబర్ 11) ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీకొట్టవచ్చని సమాచారం. చిరకాల ప్రత్యర్ధులైన భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 15న జరగవచ్చు. -
World Cup 2023: భారత మ్యాచ్ ‘భాగ్యం’ లేదు!
న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చే పరిణామం...వన్డే ప్రపంచకప్ వేదికల్లో ఒకటిగా ఖాయమై రూ. 117 కోట్లతో ఆధునీకరణకు ఉప్పల్ స్టేడియం సిద్ధమవుతోందని, మెగా ఈవెంట్లో టీమిండియా మ్యాచ్‌ను వీక్షించవచ్చని భావించిన ఫ్యాన్స్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు ఆడే అవకాశం లేదని తేలింది. మ్యాచ్ వేదికలు, తేదీలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి బీసీసీఐ షెడ్యూల్ డ్రాఫ్ట్ సమర్పించింది. ఇందులో టీమిండియా లీగ్ దశలో ఆడే 9 మ్యాచ్‌ల వేదికల్లో హైదరాబాద్ పేరు లేదు. ఉప్పల్ స్టేడియాన్ని భారత మ్యాచ్ కోసం పరిగణలోకి తీసుకోలేదు. బోర్డు పంపిన జాబితాను వరల్డ్ కప్ ఆడే అన్ని జట్లకూ పంపించి వారి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఐసీసీ అధికారిక ప్రకటన చేస్తుంది. అయితే... సాధారణంగా ఆతిథ్య దేశం ఇచ్చిన డ్రాఫ్ట్‌లో మార్పులు లేకుండానే ఐసీసీ ఆమోదిస్తుంది కాబట్టి ఈ షెడ్యూల్ ప్రకటన లాంఛనమే. భారత జట్టు ఆడకపోయినా... 2011 వరల్డ్ కప్‌తో పోలిస్తే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు జరగడమే అభిమానులకు కాస్త ఊరట. డ్రాఫ్ట్ ప్రకారం పాకిస్తాన్ జట్టు ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. తొలి మ్యాచ్, ఫైనల్ అహ్మదాబాద్‌లోనే... లక్షకు పైగా సామర్థ్యం ఉన్న అహ్మదాబాద్ స్టేడియం సహజంగానే వరల్డ్‌కప్‌కు ప్రధాన వేదిక కానుంది. 2019 వరల్డ్ కప్ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న జరిగే మ్యాచ్‌లో ఈ విశ్వ సమరం మొదలవుతుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ కూడా ఇక్కడే జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ షెడ్యూల్లో లీగ్ దశకే పరిమితం కాగా... నవంబర్ 15, 16న జరిగే సెమీ ఫైనల్ వేదికల గురించి ఇంకా పేర్కొనలేదు. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే తొలి పోరుతో భారత్ వరల్డ్ కప్ వేట మొదలవుతుంది. నిజానికి పూర్తి స్థాయి షెడ్యూల్‌ను బీసీసీఐ ఎప్పుడో ప్రకటించాల్సింది. అయితే భారత గడ్డపై తమ మ్యాచ్‌ల వేదికల విషయంలో పాకిస్తాన్ లేవనెత్తిన అభ్యంతరాలు, ఆసియా కప్‌లో తాము పాల్గొనే అంశంతో ముడిపెట్టడంతో ఇంత ఆలస్యమైంది. పాక్ విజ్ఞప్తిని బట్టి ఆ జట్టు ఆడే మ్యాచ్‌ల విషయంలో బోర్డు కాస్త సడలింపులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నాకౌట్ దశకు వెళ్లి తప్పనిసరైతే తప్ప అహ్మదాబాద్‌లో ఆడమని చెబుతూ వచ్చిన పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. ఈ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న భారత్, పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్‌లోనే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మినహా తమ 8 మ్యాచ్‌లలో పాకిస్తాన్ తాము సూచించిన నాలుగు వేదికలు కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోనే ఆడనుంది. భారత్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2011 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను దాదాపు ఏడాది క్రితమే ఐసీసీ ప్రకటించింది. దీని ప్రకారం శ్రీలంక, బంగ్లాదేశ్ కాకుండా భారత్‌లో 8 వేదికల్లో 29 మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ఖరారు చేసింది. అప్పట్లోనే అన్ని రకాలుగా సిద్ధమైన హైదరాబాద్ స్టేడియం 3 వన్డేలకు ఆతిథ్యమిచ్చింది కూడా. అయితే వరల్డ్ కప్ మైదానాల్లో మాత్రం ఉప్పల్‌కు చోటు దక్కలేదు. ‘టెస్టు హోదా ఉన్న స్టేడియాలను మాత్రం బోర్డు పరిశీలించింది’ అంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధికారి ఒకరు దానికి వివరణ ఇచ్చారు. ఇప్పుడు పుష్కర కాలం తర్వాత భారత్ మరోసారి వన్డే ప్రపంచ కప్‌ను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌కు మ్యాచ్‌లు దక్కాయన్న ఆనందంలో అభిమానులు ఉండగా, ఇప్పుడు భారత్ మ్యాచ్ లేకపోవడం సహజంగానే నిరాశపర్చే అంశం. క్రికెట్ పట్ల చూపించిన ఆదరణను బట్టి చూస్తే ఉప్పల్ స్టేడియం ఎప్పుడూ నిరాశపర్చలేదు. అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే కాదు...ఐపీఎల్ హోం టీమ్ సన్‌రైజర్స్ పేలవ ప్రదర్శన ఇచ్చినా సరే, స్టేడియంలో వారి ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. దేశవ్యాప్తంగా చూస్తే చక్కటి అవుట్‌ఫీల్డ్, ఫిర్యాదులు లేని పిచ్‌తో సహా సౌకర్యాలపరంగా చూస్తే ఇతర అన్ని స్టేడియాలతో పోలిస్తే మేలైన వసతులు ఉన్నాయి. అయితే ఇదంతా బోర్డు పట్టించుకున్నట్లుగా లేదు. వరల్డ్ కప్‌లో వేదికల ఖరారు గురించి గత నెలలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. కార్యదర్శి జై షా నేతృత్వంలో ఇది పని చేసింది. భారత మ్యాచ్‌లకు కేటాయించిన 9 వేదికలను చూస్తే వేర్వేరు కారణాలతో వీటిని ఖాయం చేసినట్లుగా అర్థమవుతుంది. భారత క్రికెట్లో మొదటినుంచి ‘ప్రధాన’ కేంద్రాలుగా గుర్తింపు పొందిన ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వేదికల విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. సహజంగానే పెద్ద స్టేడియమైన అహ్మదాబాద్‌లో అన్నింటికంటే పెద్ద మ్యాచ్ (పాక్‌తో) నిర్వహించాలని బోర్డు భావించింది. మిగతా మూడు వేదికల విషయంలో బోర్డు అంతర్గత రాజకీయాలు పని చేశాయి. బోర్డు ఉపాధ్యక్షుడైన రాజీవ్ శుక్లా తన సొంత మైదానమైన లక్నోలో, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తమ అసోసియేషన్‌కు చెందిన ధర్మశాలలో మ్యాచ్‌లను తీసుకున్నారు. పుణేకు కూడా మ్యాచ్ కేటాయించుకోవడంలో మహారాష్ట్ర క్రికెట్ సంఘం గట్టిగా ప్రయత్నం చేసి సఫలమైంది. నిజానికి ముందుగా షార్ట్ లిస్ట్ చేసిన 12 వేదికల్లో పుణే పేరు లేదు. ఆ తర్వాత దానిని అదనంగా చేర్చడంలోనే పరిస్థితి అర్థమైంది. బహుశా ఈ మ్యాచ్ ఉప్పల్‌కు దక్కేదేమో. కానీ బోర్డులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఎలాంటి ప్రాతినిధ్యమే లేదు. నిత్య కలహాలతోనే అసోసియేషనే లేకుండా మాజీ న్యాయమూర్తి చేతుల్లో ఉన్న వ్యవస్థ మ్యాచ్‌పై పట్టుబట్టే పరిస్థితిలో అసలే లేదు! -
మే 15 నుంచి ఏపీఈఏపీసెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2023–24 విద్యా సంవత్సరంలో కీలకమైన ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఈఏపీసెట్ (ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్), లేటరల్ ఎంట్రీ (డిప్లమా విద్యార్థులు ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశం)కి సంబంధించిన ఈసెట్, ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం ఐసెట్ నోటిఫికేషన్, ఆన్లైన్లో దరఖాస్తు, పరీక్షల నిర్వహణ తేదీలను నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ వివరాలను ఉన్నత విద్యా మండలి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈఏపీసెట్ పరీక్షలను మే 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈసెట్ మే 5న, ఐసెట్ మే 24, 25 తేదీల్లో నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇలా... -
కాంగ్రెస్ చీఫ్ ఎన్నికకు 3–4 రోజుల్లో షెడ్యూల్!
న్యూఢిల్లీ/జైపూర్: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధినేతను ఎన్నికొనేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ మరో 3–4 రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు సోమవారం తెలిపాయి. సెప్టెంబర్ 20లోగా నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ చెప్పారు. ఎన్నిక తేదీపై తుది నిర్ణయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీదేనని(సీడబ్ల్యూసీ) వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ చేపట్టాలని తాము కోరుకుంటున్నట్లు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు. రాహుల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకొనేందుకు పార్టీ నేతలంతా సానుకూలంగా ఉన్నారని వివరించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని, పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించాలని రాహుల్ గాంధీకి అశోక్ గహ్లోత్ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఆయన నిరాకరిస్తే కార్యకర్తలు అసంతృప్తికి లోనవుతారని చెప్పారు. ఆనంద్ శర్మను బుజ్జగించే యత్నాల్లో కాంగ్రెస్ హిమాచల్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన ఆనంద్ శర్మను శాంతింపజేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఏఐసీసీ ఇన్చార్జి రాజీవ్ శుక్లా సోమవారం ఆయన్ను కలిసి, పార్టీ పదవిలో కొనసాగాలని కోరారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా శర్మతో ఫోన్లో మాట్లాడి, అనేక అంశాలపై చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీయే అంతిమ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నాయి. -
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఈ నెల 10 నుంచి కీలక టోర్నీ ప్రారంభం
భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా వాయిదా పడిన దేశవాళీ టోర్నీ రంజీట్రోఫీ 2022.. ఈ నెల 10 నుంచి ప్రారంభంకానున్నట్లు ప్రకటించింది. రెండు దశల్లో జరగనున్న ఈ టోర్నీలో ఫస్ట్ ఫేస్ ఫిబ్రవరి నుంచి మార్చి 15 వరకు, రెండో దశ మే 30 నుంచి జూన్ 26 వరకు జరగనున్నట్లు బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. టోర్నీలో భాగంగా మొత్తం 38 జట్లు 9 గ్రూపులుగా విభంజించబడి, 62 రోజుల పాటు దేశంలోని 9 ప్రధాన నగరాల్లో(అహ్మదాబాద్, కోల్‌కతా, రాజ్‌కోట్, ఢిల్లీ, గౌహతి, కటక్, త్రివేండ్రం, చెన్నై, హర్యానా), 64 మ్యాచ్‌లను నిర్వహించతలపెట్టినట్లు బీసీసీఐ పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా గురువారం అధికారిక ప్రకటన విడుదల చేశాడు. కాగా, షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది రంజీ సీజన్ జనవరి 13 నుంచి ప్రారంభం కావాల్సి ఉండింది. అయితే, దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో టోర్నీని కొన్ని రోజుల పాటు వాయిదా వేశారు. చదవండి: పుజారా, రహానేలకు గంగూలీ పరోక్ష హెచ్చరిక -
కరోనా కారణంగా రద్దైన 'ఆ' టెస్ట్ మ్యాచ్ షెడ్యూల్ ఖరారు
India Vs England 5th Test To Be Held In July 2022: ఐపీఎల్-2021 రెండో దశకు ముందు ఇంగ్లండ్ పర్యటనలో రద్దైన ఐదో టెస్ట్(మాంచెస్టర్) మ్యాచ్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ), ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)లు క్లారిటీ ఇచ్చాయి. భారత శిబిరంలో కరోనా కేసు వెలుగు చూడడంతో రద్దైన ఆ మ్యాచ్‌ను వచ్చే ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో నిర్వహించేందుకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకరించాయి. పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమిండియా వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో పర్యటించనుండగా.. అందులో భాగంగా జులై 1 నుంచి 5వ తేదీ వరకు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రద్దైన టెస్ట్ జరుగుతుందని ఇరు దేశాల బోర్డులు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య 3 టీ20లు (జులై 7, 9, 10), 3 వన్డేలు(జులై 12, 14, 17) జరగనున్నాయి. కాగా, భారత్- ఇంగ్లండ్‌ల మధ్య ఈ ఏడాది సెప్టెంబర్ 10న జరగాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్.. టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు కరోనా నిర్దారణ కావడంతో రద్దైన సంగతి తెలిసిందే. చదవండి: ట్రోఫితో పాటు ఆ రెండు రికార్డులు టీమిండియా క్రికెటర్లవే.. -
భారత్ తొలి ప్రత్యర్థి ఫ్రాన్స్
లుసాన్ (స్విట్జర్లాండ్): వచ్చే నెల 24 నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వేదికగా జరిగే జూనియర్ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. డిఫెండింగ్ చాంపియన్ భారత్ నవంబర్ 24న జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ తర్వాత 25న జరిగే రెండో మ్యాచ్‌లో కెనడాతో, 27న జరిగే మూడో మ్యాచ్‌లో పోలాండ్‌తో టీమిండియా ఆడుతుంది. పూల్ ‘బి’లో భారత్‌తోపాటు కెనడా, ఫ్రాన్స్, పోలాండ్ జట్లకు చోటు కల్పించారు. పూల్ ‘ఎ’లో బెల్జియం, చిలీ, మలేసియా, దక్షిణాఫ్రికా... పూల్ ‘సి’లో దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, స్పెయిన్, అమెరికా... పూల్ ‘డి’లో అర్జెంటీనా, ఈజిప్‌్ట, జర్మనీ, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. డిసెంబర్ 3న సెమీఫైనల్స్, 5న ఫైనల్స్ జరుగుతాయి. 2016 ప్రపంచకప్ టోర్నీకి కూడా భారతే వేదికగా నిలిచింది. మరోవైపు డిసెంబర్ 5 నుంచి 16 వరకు దక్షిణాఫ్రికాలో జరిగే మహిళల జూనియర్ ప్రపంచకప్ షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. పూల్ ‘సి’లో ఉన్న భారత్ డిసెంబర్ 6న తొలి మ్యాచ్‌లో రష్యాతో ఆడుతుంది. ఆ తర్వాత 7న అర్జెంటీనాతో, 9న జపాన్‌తో భారత్ తలపడుతుంది. -
టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆ రెండు జట్లతో టీమిండియా 'ఢీ'.. షెడ్యూల్ ఇదే
T20 World Cup 2021 Warm Up Matches Schedule Announced: టీ20 ప్రపంచకప్-2021లో పాక్‌తో జరిగే మహా సంగ్రామానికి ముందు టీమిండియా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. మెగా టోర్నీలో భాగంగా కోహ్లి సేన అక్టోబర్ 24న దాయాది పాక్‌తో తలపడనుండగా, అంతకంటే ముందే అంటే అక్టోబర్ 18న ఇంగ్లండ్‌తో, 20వ తేదీన ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. టీమిండియా సహా ప్రపంచకప్‌లో పాల్గొనే అగ్రశ్రేణి జట్లన్నీ ఈ వార్మప్ మ్యాచ్‌ల్లో పాల్గొంటాయి. ఈ మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. అక్టోబర్ 18: * అఫ్గానిస్తాన్ VS సౌతాఫ్రికా (భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30) * పాకిస్థాన్ VS వెస్టిండీస్ (3:30) * ఆస్ట్రేలియా VS న్యూజిలాండ్ (7: 30) * భారత్ VS ఇంగ్లండ్ (7:30) అక్టోబర్ 20 : * ఇంగ్లండ్ VS న్యూజిలాండ్ (3:30) * భారత్ VS ఆస్ట్రేలియా (3:30) * సౌతాఫ్రికా Vs పాకిస్థాన్ (7:30) * అఫ్గానిస్తాన్ VS వెస్టిండీస్ (7:30) ఈ మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. కాగా, యూఏఈ, ఒమన్ వేదికగా జరిగే పొట్టి ప్రపంచకప్ అక్టోబర్ 17న ప్రారంభమై.. దుబాయ్ వేదికగా నవంబర్ 14న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ టోర్నీలో తొలుత గ్రూప్-ఏ, గ్రూ-బిలోని క్వాలిఫయర్స్ జట్ల మధ్య తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అనంతరం మేజర్ జట్ల మధ్య సూపర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. ఇక, ఈ టోర్నీలో టీమిండియా లీగ్ దశలో తలపడబోయే మ్యాచ్‌ల విషయానికొస్తే.. అక్టోబర్ 24న పాక్‌తో, అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. చదవండి: టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్..! -
ఏపీఈఏపీసెట్- 2021 షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, వ్యవసాయ, వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీసెట్) షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్ష, సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో వ్యవసాయ, ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష బాధ్యతలు కాకినాడ జేఎన్టీయూకు అప్పగించారు. మొత్తం 120 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఈ నెల 25న ఇంజనీరింగ్ ప్రాథమిక కీ విడుదల చేస్తామని పేర్కొన్నారు. 2,59,156 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని, కరోనా పాజిటివ్ విద్యార్థులకు పరీక్షకు అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు. -
పూరీ రథయాత్ర: ఖరారైన షెడ్యూల్
భువనేశ్వర్/పూరీ: విశ్వవ్యాప్తంగా భక్తజనం కలిగిన పూరీ శ్రీ జగన్నాథుని వార్షిక రథయాత్ర షెడ్యూల్ ఖరారు చేసినట్లు శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి (సీఏఓ) డాక్టర్ క్రిషన్ కుమార్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సోమవారం ఆయన 36 నియోగులతో సమావేశం నిర్వహించారు. స్నాన యాత్ర నుంచి నీలాద్రి విజే వరకు యాత్ర కార్యాచరణపై సమావేశంలో తీర్మానించామని యాత్ర కార్యాచరణపై సేవాయత్‌లు పూర్తి అంగీకారంతో ఏకాభ్రిపాయం వ్యక్తం చేశారని సమావేశం వివరాలను శ్రీ మందిరం సేవల విభాగం అడ్మినిస్ట్రేటర్ జితేంద్ర సాహు తెలిపారు. యాత్ర కార్యకలాపాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు జగన్నాథ సంస్కృత విద్యా పీఠం ప్రాంగణంలో ప్రత్యేక కోవిడ్ టీకా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నెల 22వ తేదీ వరకు ఈ శిబిరం కొనసాగుతుంది. కోవిడ్–19 నెగెటివ్ నమోదైన వారిని మాత్రమే సేవలకు అనుమతిస్తారు. స్నానయాత్రకు 48 గంటలు ముందుగా కోవిడ్ పరీక్షల నిర్వహణ పూర్తి చేస్తారని తెలిపారు. స్నానయాత్ర ఈ నెల 24వ తేదీ పౌర్ణమి తిథి సందర్భంగా శ్రీ జగన్నాథుని స్నానయాత్ర జరగనుంది. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి స్నానోత్సవం సన్నాహాలు ప్రారంభి స్తారు. ఉదయం 4 గంటలకు పొహండి కార్యక్రమం ముగిస్తారు. శ్రీ మందిరం రత్న వేదిక నుంచి మూల విరాట్లు (సుదర్శనుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుడు) ఒక్కోటిగా బహిరంగ స్నాన మండపానికి తరలించడమే పొహండి కార్యక్రమం. 108 కలశాలతో మూల విరాట్లకు సుగంధ జలాభిషేకం నిర్వహించి గజానన అలంకరణ చేస్తారు. ఈ అలంకరణ ఉదయం 11 గంటలతో పూర్తి చేయాలని నిర్ణయించారు. తిరుగు పొహండి స్నాన మండపం నుంచి శ్రీ మందిరం లోనికి మూల విరాట్ల తరలింపు కార్యక్రమానికి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సమయం నిర్ధారించారు. గుండిచా యాత్ర గండిచా యాత్రగా జగన్నాథుని రథయాత్ర ప్రసిద్ధి. ఈ ఏడాది జూలై 12వ తేదీన దీనిని నిర్వహిస్తారు. ఉదయం 8.30 గంటల నుంచి మూల విరాట్లను రథాలపైకి తరలించే కార్యక్రమం ప్రారంభమవుతుంది. రథాలపై పూరీ గజపతి మహా రాజా దివ్య సింగ్ దేవ్ ఆలయ సంప్రదాయ రీతుల్లో ఛెరా పొంహరా (చీపురుతో రథాలు తుడిచే కార్యక్రమం) సేవలో పాల్గొంటారు. ఈ సేవకు మధ్యాహ్నం 2 గంటలకు సమయం కేటాయించారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి రథాలు లాగేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. బహుడా యాత్ర గుండిచా మందిరం నుంచి మూల విరాట్లు శ్రీ మందిరానికి తరలి వచ్చే యాత్ర బహుడా యాత్ర. దీనినే మారురథయాత్రగా పిలుస్తారు. జూలై 20వ తేదీన ఈ యాత్ర జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2.30 గంటల వరకు పొహండి సేవలు నిర్వహించి మూలవిరాట్లు రథాలపైకి చేరగానే సాయంత్రం 4 గంటల నుంచి ఈ యాత్ర ప్రారంభిస్తారు. స్వర్ణాలంకారం ఏటా రథ యాత్రను పురస్కరించుకుని రథాలపై మూల విరాట్లకు స్వర్ణాలంకారం చేస్తారు. ఈ అలంకారం జూలై 21వ తేదీన నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభించి 5.30 గంటల మధ్య స్వర్ణాలంకారం పూర్తి చేయాలని నిర్ణయించారు. నీలాద్రి విజే రథాలపై సేవలు, ఉత్సవాలు ముగియడంతో మూల విరాట్లు చివరగా శ్రీ మందిరం రత్నవేదికకు యథావిధిగా చేరుతాయి. రథాలపై నుంచి రత్న వేదికకు మూల విరాట్లు చేరే ఉత్సవం నీలాద్రి విజే. జూలై 23వ తేదీన ఈ ఉత్సవం జరుగుతుంది. రథాలపైకి తరలించే మూలవిరాట్లను తరలించడంతో మొదలై రత్న వేదికపైకి చేర్చడంతో వార్షిక రథయాత్రకు తెర పడుతుంది. చదవండి: పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి సిక్కు వర్గం నుంచే.. -
సెప్టెంబర్ 19 నుంచి మళ్లీ ఐపీఎల్ మ్యాచ్‌లు
-
సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం
ముంబై: కరోనా కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్ పునఃప్రారంభం కానుంది. భారత్‌లో కరోనా ఉధృతి తగ్గని కారణంగా ఐపీఎల్ సెకండాఫ్ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సీజన్లో జరగాల్సిన మిగతా 31 మ్యాచ్‌లను సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్, అబుదాబి, షార్జాల్లో నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. అలాగే ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను అక్టోబర్ 15న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కాగా, సెకండాఫ్ ఐపీఎల్ మ్యాచ్‌లకు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా లేరా అంశంపై సందిగ్ధత నెలకొంది. ఇదిలా ఉంటే విదేశీ ఆటగాళ్లు వచ్చినా, రాకపోయినా లీగ్‌ను మాత్రం కంటిన్యూ చేస్తామని బీసీసీఐ ఉపాధ్యక్షడు రాజీవ్ శుక్లా ఇటీవలే స్పష్టం చేశారు. చదవండి: వాళ్లిద్దరి కెప్టెన్సీ ఒకేలా ఉంటుంది.. ఆ విషయంలో ధోనీ స్టైల్ వేరు -
తెలంగాణ: టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యా శాఖ మంగళవారం విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పూర్తి విద్యా సంవత్సరం సాధ్యపడనందున కేవలం ఆరు పేపర్లకు మాత్రమే పరీక్షలు నిర్వహించనున్న టీఎస్ ఎస్ఎస్సీ బోర్డు వెల్లడించింది. మే 17 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు పేర్కొంది. పరీక్షా సమయం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ఉంటుందని తెలిపింది. పరీక్షల షెడ్యూల్ వివరాలు.. మే 17న తెలుగు మే 18న హిందీ మే 19న ఇంగ్లీష్ మే 20న మ్యాథ్స్ మే 21న సైన్స్ మే 22న సోషల్ పరీక్షలు జరుగుతాయని ఎస్ఎస్సీ బోర్డు పేర్కొంది. -
‘వరల్డ్ కప్ సూపర్ లీగ్’ వచ్చేసింది...
లండన్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ తరహాలో వన్డేల్లో కూడా పాయింట్ల పద్ధతిలో టోర్నీ తీసుకురావాలని భావించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తమ ప్రణాళికను అమల్లోకి తీసుకొస్తోంది. గతంలోనే ప్రకటించి కరోనా కారణంగా కాస్త వెనక్కి తగ్గినా... ఇప్పుడు టోర్నీ జరగడం ఖాయమైంది. ఈ నెల 30నుంచి ఈ మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. ‘క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ ’ పేరుతో జరిగే ఈ ఈవెంట్... టి20ల మెరుపులతో ప్రభ తగ్గుతున్న వన్డే క్రికెట్‌ను సజీవంగా నిలబెట్టగలదని ఐసీసీ ఆశిస్తోంది. వరల్డ్ కప్ సూపర్ లీగ్ నిర్వహణపై సందేహాలు ఉండటంతో కొంత కాలం క్రితం ఈ టోర్నీపై ప్రణాళిక రూపొందించి కూడా ఐసీసీ వెనక్కి తగ్గింది. కోవిడ్–19 నేపథ్యంలో పలు టోర్నీలు, సిరీస్‌లు రద్దు కావడంతో ఇది సాధ్యమయ్యేలా కనిపించలేదు. అయితే 2023 ఫిబ్రవరి–మార్చిలో జరగాల్సిన వన్డే వరల్డ్ కప్ అక్టోబర్–నవంబర్‌కు వాయిదా పడి తగినంత సమయం లభించడంతో ఐసీసీ మళ్లీ దీనిపై దృష్టి పెట్టి ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. టోర్నీ ఎప్పటినుంచి... జూలై 30 నుంచి ఇంగ్లండ్–ఐర్లాండ్ మధ్య జరిగే మూడు వన్డేల సిరీస్‌తో వరల్డ్ కప్ సూపర్ లీగ్ మొదలవుతుంది. ఇందులో భాగంగా జులై 30, ఆగస్టు 1, ఆగస్టు 4 తేదీల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. పాల్గొనే జట్లు మొత్తం 13 టీమ్‌లు సూపర్ లీగ్‌లో ఆడతాయి. ర్యాంకింగ్ ప్రకారం టాప్–12 జట్లతో పాటు 2015–17 ఐసీసీ వరల్డ్ క్రికెట్ సూపర్ లీగ్ విజేతగా నిలిచిన నెదర్లాండ్స్ 13వ జట్టు. టోర్నీ ఫార్మాట్ వచ్చే మూడేళ్లలోగా నిర్ణీత సమయంలో (ఇంకా కటాఫ్ తేదీ ఖరారు కాలేదు) ప్రతీ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లు కనీసం ఎనిమిది (నాలుగు ఇంటా, నాలుగు బయట ప్రాతిపదికన) ఆడుతుంది. గెలిచిన జట్టుకు 10 పాయింట్లు, డ్రా, టై లేదా రద్దు అయితే 5 పాయింట్లు లభిస్తాయి. తర్వాత ఏమిటి... పాయింట్లపరంగా టాప్–7లో నిలిచిన జట్లు 2023 వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. వీటికి తోడు ఆతిథ్య దేశంగా భారత్‌కు ఇప్పటికే అవకాశం లభించింది. భారత్ టాప్–7లో ఉంటే ఎనిమిదో టీమ్‌కు చాన్స్ దక్కుతుంది. మిగిలిన జట్లు ఏం చేస్తాయి... నేరుగా క్వాలిఫై కాని 5 టీమ్‌లు, మరో 5 అసోసియేట్ జట్లతో కలిసి వరల్డ్ కప్ క్వాలిఫయర్ 2023 టోర్నీ ఆడతాయి. ఇందులో టాప్–2 జట్లు మాత్రమే ముందంజ వేస్తాయి. మిగిలిన 8 సహా మొత్తం 10 జట్లతో వన్డే ప్రపంచ కప్ జరుగుతుంది. మూడో కంటికే ‘నోబాల్’ వన్డేలు, టి20ల్లో ఫీల్డ్ అంపైర్ల పాత్రను మరింత తగ్గించే దిశగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరో అడుగు వేసింది. కొత్త నిబంధన ప్రకారం ఇకపై ఫ్రంట్ ఫుట్ నోబాల్‌లను పర్యవేక్షించే అ«ధికారం పూర్తిగా థర్డ్ అంపైర్లకే అప్పజెప్పారు. సాధారణంగా ఫీల్డ్ అంపైర్లే నో బాల్‌ను ప్రకటిస్తారు. అయితే కొన్నాళ్ల క్రితం భారత్–వెస్టిండీస్ సిరీస్‌లో అదనంగా మూడో అంపైర్ కూడా ఒక కన్నేసి ఉంచేలా ప్రయోగాత్మకంగా పరిశీలించారు. సాంకేతికంగా అది సరైనదిగా అనిపించడంతో ఇప్పుడు పూర్తిగా ‘మూడో కంటి’కే ఈ నిర్ణయాధికారం కట్టబెట్టారు. ఇకపై ఫీల్డ్ అంపైర్లు ఫ్రంట్ ఫుట్ నోబాల్ ప్రకటించడానికి వీల్లేదు. జూలై 30 నుంచి జరిగే ఇంగ్లండ్, ఐర్లాండ్ వన్డే సిరీస్‌తో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. మరో వైపు వన్డే సూపర్ లీగ్‌లో స్లో ఓవర్‌రేట్‌కు కూడా శిక్షను కఠినతరం చేశారు. ఇప్పటి వరకు విధిస్తున్న జరిమానా కాకుండా ఒక ఓవర్ ఆలస్యమైతే ఒక పాయింట్ కోత విధించాలని ఐసీసీ నిర్ణయించింది. -
టోక్యోలో భారత్ తొలిపోరు కివీస్‌తో...
టోక్యో: వచ్చే ఏడాదికి వాయిదా పడిన ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు తమ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. అమ్మాయిల జట్టు నెదర్లాండ్స్‌ను ఎదుర్కోనున్నారు. ఈ రెండు మ్యాచ్‌లు జూలై 24నే జరుగుతాయి. 8 సార్లు చాంపియన్ అయిన పురుషుల జట్టు పూల్ ‘ఎ’ తదుపరి పోటీల్లో 25న ఆసీస్, 27న స్పెయిన్, 29న డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, 30న చివరి మ్యాచ్‌లో జపాన్‌తో ఆడుతుంది. మరోవైపు మహిళల పూల్ ‘ఎ’లో ఉన్న భారత్ 26న జర్మనీ, 28న బ్రిటన్, 29న అర్జెంటీనా, 30న జపాన్‌లతో తలపడుతుంది. కాగా మెగాఈవెంట్ కోసం అత్యున్నత హంగులతో 42 వేదికలను సిద్ధం చేశామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) శుక్రవారం షెడ్యూలును విడుదల చేసింది. ఆరంభ వేడుకలు జూలై 23న జరుగుతాయి. అంతకంటే ముందే అర్చరీ, రోయింగ్ పోటీలు మొదలవుతాయని ఐఓసీ తెలిపింది. 24 నుంచి మిగతా పోటీలు జరుగుతాయి. తొలి మెడల్ ఈవెంట్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో జరుగుతుంది. -
బ్రిస్బేన్ టెస్టుతో మొదలు!
మెల్బోర్న్: ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించే భారత క్రికెట్ జట్టు టెస్టు సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 3 నుంచి బ్రిస్బేన్ మైదానంలో జరిగే తొలి టెస్టుతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభమవుతుందని ఆసీస్ మీడియా తెలిపింది. ఈ మేరకు ఆసీస్‌లో భారత్ పర్యటన వివరాలను శుక్రవారం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ అధికారికంగా ప్రకటించే అవకాశముంది. బ్రిస్బేన్ టెస్టు తర్వాత అడిలైడ్‌లో డిసెంబర్ 11 నుంచి రెండో టెస్టు... మెల్బోర్న్లో డిసెంబర్ 26 నుంచి మూడో టెస్టు... సిడ్నీలో జనవరి 3 నుంచి నాలుగో టెస్టు జరుగుతుంది. అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టును డే–నైట్‌గా నిర్వహించే అవకాశముంది. కరోనా నేపథ్యంలో ఆసీస్‌లో పర్యటించే భారత జట్టును క్వారంటైన్లో పెట్టాలా వద్దా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. -
హైదరాబాద్ ఓపెన్‌తో బీడబ్ల్యూఎఫ్ సీజన్ పునః ప్రారంభం
న్యూఢిల్లీ: కరోనా కారణంగా మూలకు పడిన టోర్నమెంట్లను నిర్వహించేందుకు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సిద్ధమైంది. ఈ మేరకు పలు టోర్నీల సవరించిన షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించింది. ఇందులో భాగంగా ఆగస్టు 11 నుంచి 16 వరకు జరుగనున్న హైదరాబాద్ ఓపెన్‌తో మళ్లీ బ్యాడ్మింటన్ సందడి మొదలు కానుంది. హైదరాబాద్ ఓపెన్ కాకుండా... సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ (నవంబర్ 17–22), ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్ ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ (డిసెంబర్ 8–13) కూడా భారత్‌లో జరుగనున్నాయి. నిజానికి ఇండియా ఓపెన్ మార్చి 24–29 వరకు జరగాల్సి ఉండగా కరోనా ధాటికి వాయిదా పడింది. సవరించిన క్యాలెండర్ ప్రకారం బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ స్థాయి టోర్నీలు తైపీ ఓపెన్ సూపర్ 300 (సెప్టెంబర్ 1–6)తో ప్రారంభం కాను న్నాయి. అనంతరం డెన్మార్క్ ఓపెన్ (అక్టోబర్ 3–11) జరుగనుంది. వీటితో పాటు 8 ప్రముఖ అంతర్జాతీయ టోర్నీలను రీషెడ్యూల్ చేశారు. అయితే బీడబ్ల్యూఎఫ్ సవరించిన షెడ్యూల్‌పై భారత అగ్రశ్రేణి క్రీడాకారులు సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు నెలల కాలంలో ఏకంగా 22 అంతర్జాతీయ టోర్నీలు ఉండటమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఆటగాళ్లు ఇంకా ప్రాక్టీసే ప్రారంభించలేదని... ప్రాక్టీస్ మొదలుపెట్టాక మ్యాచ్ ఫిట్నెస్ సంతరించుకోవడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని సాయిప్రణీత్ అన్నాడు. -
మార్చి 29 నుంచి ఐపీఎల్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, గత ఏడాది రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది. ప్రస్తుతానికి లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌నే విడుదల చేయగా, నాకౌట్ మ్యాచ్‌ల వివరాలను తర్వాత ప్రకటిస్తారు. మే 17న ఆఖరి లీగ్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఫైనల్ మాత్రం మే 24న నిర్వహించడం ఖాయమైంది. గతంతో పోలిస్తే ఈ సారి ‘డబుల్ హెడర్’ మ్యాచ్‌ల (ఒకే రోజు 4 గంటలకు, 8 గంటలకు రెండు మ్యాచ్‌లు) సంఖ్యను బాగా తగ్గించారు. ఇప్పుడు తొలి రోజు, చివరి రోజు మినహాయించి మిగిలిన ఆదివారాల్లో మాత్రమే డబుల్ హెడర్లు జరుగుతాయి. దాంతో లీగ్ దశ రోజుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 44 రోజుల్లో లీగ్ మ్యాచ్‌లను ముగిస్తుండగా, ఇప్పుడు అది 50 రోజులు కానుంది. మరోవైపు రాజస్తాన్ మినహా మిగిలిన ఏడు ఐపీఎల్ జట్లన్నీ తమ సొంత వేదికలను కొనసాగించనున్నాయి. రాజస్తాన్ మాత్రం జైపూర్‌తో పాటు రెండు మ్యాచ్‌లను గువాహటి వేదికగా నిర్వహించాలని నిర్ణయించుకుంది. అయితే ఇలా రెండో నగరాన్ని హోం గ్రౌండ్‌గా వాడుకోవడం కుదరదంటూ రాజస్తాన్ క్రికెట్ సంఘం కోర్టులో కేసు దాఖలు చేసింది. ఏప్రిల్ 1 నుంచి హైదరాబాద్‌లో...: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ ‘హోం’ మ్యాచ్‌లను ఎప్పటిలాగే ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది. హైదరాబాద్‌లో ఈ ఏడు మ్యాచ్‌లు ఏప్రిల్ 1, 12, 16, 26, 30, మే 5, 12 తేదీల్లో జరుగుతాయి. ఇతర వేదికల్లో ఏప్రిల్ 4, 7, 19, 21, మే 3, 9, 15 తేదీల్లో సన్‌రైజర్స్ తమ మ్యాచ్‌లు ఆడుతుంది. -
ఢిల్లీ అసెంబ్లీకి మోగిన ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు, 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 14వ తేదీన విడుదలవుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా ప్రకటించారు. సోమవారం ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈసారి ఎన్నికలలో 1.46 కోట్లకు పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ పదవీ కాలం ఫిబ్రవరి 22వ తేదీతో ముగియనుంది. ఓటర్ల గుర్తింపు సులువుగా వేగంగా పూర్తయ్యేందుకు అధికారులు అందరికీ క్యూఆర్ కోడ్‌తో కూడిన ఓటర్ స్లిప్పులను అందజేస్తారు. 13,659 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన పోలింగ్ స్టేషన్‌కు రాలేని వారి కోసం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించనున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన జార్ఖండ్‌లోని ఏడు నియోజకవర్గాల్లో దేశంలోనే మొదటిసారిగా ఈ వెసులుబాటును కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లోలో తమ పార్టీ రిపోర్టు కార్డుతోనే మరోసారి విజయం సాధించాలని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ అశిస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వ విజయాలు, ఆయన సమ్మోహకశక్తి తమ ప్రచారాస్త్రాలని బీజేపీ అంటోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అకాలీదళ్‌తో కలిసి పోటీ చేయనుంది. చాన్నాళ్లుగా ఢిల్లీ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న షీలాదీక్షిత్ మరణంతో చతికిలబడ్డ ఢిల్లీ కాంగ్రెస్‌కు ఇటీవల పార్టీ జార్ఖండ్‌లో సాధించిన విజయం నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ముక్కోణపు పోటీ 2015 ఎన్నికల్లో ఆప్ 67 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. నాడు బీజేపీ మూడు సీట్లు గెలవగా, కాంగ్రెస్‌కు ఒక్కటీ దక్కలేదు. ఈసారి ఎన్నికలలో అరడజను పైగా పార్టీలు తలపడనున్నా ప్రధాన పోటీ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉండనుంది. ఈ మూడు పార్టీలు ఢిల్లీలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఆప్ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తుండగా 22 ఏళ్లుగా ఢిల్లీ పీఠానికి దూరమైన బీజేపీ, 15 ఏళ్లు ఢిల్లీని ఏకధాటిగా ఏలినా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవని కాంగ్రెస్.. సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. -
మహారాష్ట్ర, హరియాణాల్లో ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో లోక్‌సభ, శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) షెడ్యూలు విడుదల చేసింది. దీంతోపాటు తెలంగాణలోని హుజూర్నగర్ శాసనసభ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల షెడ్యూలు విడుదలైన మరుక్షణం నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా మీడియాకు వెల్లడించారు. ఈ రెండు రాష్ట్రాలకు ఒకే విడతలో ఎన్నికలు జరపనున్నట్లు ప్రకటించారు. కాగా, హరియాణాలోని 90 అసెంబ్లీ స్థానాల్లో 17 స్థానాలు షెడ్యూలు కులాలకు రిజర్వ్ అయి ఉన్నాయి. ఇక్కడ ఎస్టీ నియోజకవర్గాలేవీ లేవు. మహారాష్ట్రలో మొత్తం 288 నియోజకవర్గాలకు గాను 29 ఎస్సీ, 25 ఎస్టీ రిజర్వు అయి ఉన్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ 2014 నవంబరు 10వ తేదీన కొలువుదీరగా శాసనసభ కాల పరిమితి 2019 నవంబరు 9వ తేదీతో ముగియనుంది. అలాగే, హరియాణా శాసనసభ 2014, నవంబరు 3వ తేదీన కొలువుదీరగా 2019, నవంబరు 2న ముగియనుంది. 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా ఒక లోక్‌సభ స్థానం, వివిధ రాష్ట్రాల్లోని 64 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. ఎంపీ రామచంద్ర పాశ్వాన్ మరణించడంతో బిహార్‌లోని సమస్తిపూర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. సమస్తిపూర్ లోక్‌సభ నియోజకవర్గంతో పాటు హుజూర్నగర్ సహా దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 64 శాసన సభ స్థానాలకూ అక్టోబరు 21న ఎన్నిక జరగనుంది. ప్రధానంగా కర్ణాటకలో 15, యూపీలో 11, బిహార్, కేరళ రాష్ట్రాల్లో 5, అస్సాం, గుజరాత్‌లలో 4 చొప్పున స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో ఫిరాయింపు నిరోధక చట్టం పరిధిలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో అక్కడ ఎక్కువ స్థానాల్లో ఉప ఎన్నిక జరుగుతోంది. ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గాల్లో ఎన్నికల నిబంధనావళి తక్షణం అమల్లోకి వస్తుంది. సుప్రీంను ఆశ్రయిస్తాం: కర్ణాటక ఎమ్మెల్యేలు సాక్షి, బెంగళూరు: ఎన్నికల సంఘం ప్రకటనపై అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు బెంగళూరులో మాట్లాడుతూ.. తమపై అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా ఎన్నికలు జరపాలన్న ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఈసీ నిర్ణయంపై స్టే కోరుతామన్నారు. మొత్తం 17 మందిపై అనర్హత వేటు పడగా ఈసీ 15 స్థానాలకు మాత్రమే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం గమనార్హం. మిగతా ఇద్దరి ఎన్నికకు సంబంధించిన పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున నిర్ణయం తీసుకోలేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా అన్నారు. వీరికి అనర్హత వేటు పడిన వారితో సంబంధం లేదని వివరించారు. జూలైలో కర్ణాటకలో జరిగిన వివిధ రాజకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజరు కావడంతో హెచ్డీ కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కూలిపోగా, బీజేపీ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. -
నేడు పరిషత్ ఎన్నికల షెడ్యూల్!
సాక్షి, హైదరాబాద్: జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. శనివారం ఎన్నికల షెడ్యూల్ జారీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. కొత్తగా ఏర్పడిన 4 మండలాల్లోని జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్ల ఖరారుపై ఆయా జిల్లాల కలెక్టర్లు శుక్రవారం గెజిట్లు విడుదల చేశారు. శుక్రవారం సెలవు దినం కావడంతో షెడ్యూల్ జారీ చేయలేదు. దీంతో శనివారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటర్ల జాబితా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జెడ్పీపీ, ఎంపీపీ స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ల ఖరారైన విషయం తెలిసిందే. కాగా, ఈ నెల 22 నుంచి మే 14లోగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగించేలా ముసాయిదా షెడ్యూల్‌ను ఎస్ఈసీ ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. మూడు విడతల్లో పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. 26 జిల్లాల్లో మూడు విడతల్లో, ఐదు జిల్లాల్లో 2 దశల్లో, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 4 మండలాల్లో రిజర్వేషన్లు ఇలా.. కొత్తగా ఏర్పడిన నాలుగు మండలాల్లో ఎంపీపీ అధ్యక్ష స్థానాలు, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జెడ్పీటీసీ రిజర్వేషన్లు.. నిజామాబాద్ జిల్లాలోని చండూరు (ఎస్టీ), మోసర (జనరల్), సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట (జనరల్), మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి (జనరల్) కేటగిరీలకు రిజర్వ్ అయ్యాయి. ఎంపీపీ స్థానం రిజర్వేషన్లు.. నిజామాబాద్ జిల్లాలోని చండూరు ఎంపీపీ ఎస్టీలకు, మోసర ఎంపీపీ జనరల్‌కు, సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట ఎంపీపీ జనరల్‌కు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి ఎంపీపీ బీసీ కేటగిరీలకు రిజర్వ్ అయ్యాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్లు ఈ నెల 22, 26, 30 తేదీల్లో విడుదల కానున్నాయి. తొలి విడత ఎన్నికలు మే 6, రెండో విడత 10, తుది విడత ఎన్నికలు 14న జరగనున్నాయి. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పరిషత్ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత కొద్ది రోజులకు జెడ్పీపీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షుల ఎంపిక ఉంటుంది. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీపీ చైర్పర్సన్, ఎంపీపీ అధ్యక్ష స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోర్టల్‌లో అధికారులు పొందుపరిచారు.