![Telangana Tenth Class Exam Schedule Released - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/9/Tenth-exams.jpg.webp?itok=wDdid8M2)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యా శాఖ మంగళవారం విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పూర్తి విద్యా సంవత్సరం సాధ్యపడనందున కేవలం ఆరు పేపర్లకు మాత్రమే పరీక్షలు నిర్వహించనున్న టీఎస్ ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది. మే 17 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు పేర్కొంది. పరీక్షా సమయం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ఉంటుందని తెలిపింది.
పరీక్షల షెడ్యూల్ వివరాలు..
మే 17న తెలుగు
మే 18న హిందీ
మే 19న ఇంగ్లీష్
మే 20న మ్యాథ్స్
మే 21న సైన్స్
మే 22న సోషల్ పరీక్షలు జరుగుతాయని ఎస్‌ఎస్‌సీ బోర్డు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment