సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పేపర్ లీక్‌ల వ్యవహారం సంచలనంగా మారింది. రాష్ట్రంలో సోమవారం నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, పరీక్ష ప్రారంభమైన కాసేపటికే పరీక్ష పేపర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కలకలం సృష్టించింది.
వివరాల ప్రకారం.. వాట్సాప్ గ్రూపుల్లో పదో తరగతి క్వశ్చన్ పేపర్ చక్కర్లు కొట్టింది. పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే(9 గంటల 37 నిమిషాలకు) తెలుగు పేపర్ తాండూరులో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తాండూరులో ప్రశ్నాపత్రం సర్క్యూలేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న టెన్త్ పేపర్‌పై పోలీసులు, విద్యాశాఖ ఆరా తీస్తోంది. పేపర్ ఎలా లీక్ అయ్యింది అని దర్యాప్తు చేస్తున్నారు. దీన్ని ఎవరు ఫొటో తీశారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment