paper leak allegations
-
‘నీట్’ పేపర్ లీకేజీపై నేడు సుప్రీంలో విచారణ
ఢిల్లీ: ఇవాళ సుప్రీం కోర్టులో నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ, అవతకవకలపై విచారణ జరగనుంది. సుప్రీం కోర్టు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.చివరి సారిగా ‘జులై 8న అత్యున్నత న్యాయ స్థానంలో నీట్ లీకేజీపై వ్యవహారంపై విచారణ జరిగింది. ఆ సమయంలో ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) , కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పేపర్ లీకేజీపై తమ స్పందనలు తెలియజేస్తూ అఫిడవిట్లను దాఖలు చేశాయి. ఆ అఫిడవిట్లు అందరు పిటిషన్‌దారులకు ఇంకా చేరలేదు. వాటిని పరిశీలించేందుకు వీలుగా సమయమిస్తూ తదుపరి విచారణ జులై 18కి వాయిదా వేస్తున్నాం’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారుసీల్డ్ కవర్లో సీబీఐ దర్యాప్తు నివేదికవిచారణ సందర్భంగా నీట్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ కే పరిమితమని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. ఐఐటి మద్రాస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అసాధారణ మార్కులు ఏ అభ్యర్థులకు రాలేదని స్పష్టం చేయగా.. నీట్ లీక్‌పై సీబీఐ తన దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు అందించింది. ఈ వరుస పరిణామల నేపథ్యంలో ఇవాళ నీట్‌పై సుప్రీం కోర్టులో కీలక విచారణ జరగనుంది. నీట్లో పేపర్ లీకేజీపై వరుస అరెస్ట్లుమరోవైపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. కేంద్రం ఆదేశాలతో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఈ కేసులో ఇప్పటి వరకు 14మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తాజాగా ఈ వారంలో.. కీలక నిందితుడు పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్య, అతని సహాయకుడు రాజుసింస్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ అధికారుల విచారణలో పంకజ్ కుమార్ హజారీబాగ్‌లోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి నీట్ ప్రశ్నపత్రం తస్కరించినట్లు అధికారులు తెలిపారు. నిందితుల్లో మొత్తం ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. -
నీట్ పరీక్ష రద్దు పిటిషన్లపై ‘సుప్రీం’ విచారణ నేడు
సాక్షి, న్యూఢిల్లీ : నీట్-యూజీ 2024 పేపర్ లీకేజీ అంశంపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. నీట్ -యూజీ 2024 పేపర్ లీకేజీపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ ఏడాది జరిగిన నేషనల్ ఎలిజిబులటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో అవకతవకలు జరిగాయిని, ఆ పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని కోరుతూ సుమారు 38 పిటిషన్లు దాఖలయ్యాయి. దాఖలైన పిటిషన్లను ఇవాళ (జులై 8న) ఉదయం 10.30 గంటలకు సుప్రీం కోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్,జస్టిస్ జేబీ పార్దివాలా,జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.నీట్-యూజీ పరీక్షను రద్దు చేయాలినీట్-యూజీ పరీక్షను రద్దు చేస్తూ మళ్లీ నిర్వహించాలని పలువురు పిటిషన్లు దాఖలు చేయగా..పేపర్ లీకేజీల కారణంగా నీట్ పరీక్షల పవిత్రత దెబ్బతింటుందని, వాటిని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్నారు.నీట్ యూజీ ప్రశ్నపత్రాల లీకేజీతో ముసురుకున్న వివాదాల నేపథ్యంలో నీట్-యూజీ 2024 పరీక్ష నిర్వహించిన జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) మాత్రం పరీక్షను న్యాయ బద్దంగా నిర్వహించామని,పరీక్ష జరిగే సమయంలో భారీ ఎత్తున మాల్‌ప్రాక్టీస్ జరిగిందనే ఆరోపణల్ని ఖండించింది. నీట్ అవకతవకలపై వస్తున్న ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని స్పష్టం చేసింది.అంతేకాదు,తమ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ ఎన్టీఏ సైతం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎన్టీఏ యూజీ పరీక్షను రద్దు చేయడం వల్ల లక్షలాది మంది నిజమైన అభ్యర్ధులకు అన్యాయం జరుగుతుందని, వారి కెరియర్‌తో పాటు అవకాశాలపై ప్రతీ కూల ప్రభావం పడుతుందని తెలిపింది. -
‘నీట్ రద్దు చేయొద్దు’.. సుప్రీం కోర్టులో విద్యార్ధుల పిటిషన్ దాఖలు
సాక్షి,న్యూఢిల్లీ : నీట్ పరీక్ష లీకేజీపై దాఖలైన పిటిషన్లపై వచ్చే వారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ తరుణంలో గుజరాత్‌కు చెందిన నీట్ యూజీ ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన 50 మందికి పైగా విద్యార్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.నీట్ పరీక్షను రద్దు చేయొద్దని కేంద్రానికి, నీట్ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అదే విధంగా నీట్ పేపర్ లీకేజీకి పాల్పడ్డ నిందితులకు కఠినంగా శిక్షించేంలా కేంద్ర విద్యాశాఖకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు.నీట్ పేపర్ లీకేజీ ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలపై సుప్రీం కోర్టులో 26 పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ధర్మాసనం జులై 8న విచారించనుంది.అదే సమయంలో 56 మంది విద్యార్ధులు నీట్ పరీక్ష రద్దు చేయొద్దంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం విశేషం. ఈ సందర్భంగా పిటిషనర్లలో ఒకరైన నీట్ యూజీ విద్యార్ధి సిద్దార్ధ్ కోమల్ మాట్లాడుతూ.. కేంద్రం,ఎన్టీఏ.. నీట్ పరీక్షను మరోసారి నిర్వహించుకుండా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం కోర్టును విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇది నిజాయితీ, కష్టపడి చదివిన విద్యార్ధులకు తీవ్రం నష్టం వాటిల్లడమే కాదు.. విద్యాహక్కు ఉల్లంఘనకు దారితీసినట్లవుతుందన్నారు. నీట్ పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన నేరస్తుల్ని, అందుకు సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పేపర్ లీకేజీ ఎక్కడెక్కడ జరిగిందో అందుకు బాధ్యులైన వారిని శిక్షించాలని దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరుతున్నామని తెలిపారు. -
నీట్ పేపర్ లీకేజీ.. ఎన్టీఏ ప్రైవేట్ సంస్థనా?!
ఢిల్లీ, సాక్షి : వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్- యూజీ ప్రవేశపరీక్ష 2024’లో పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుండగా.. ఆ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)పై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.నీట్ పేపర్ లీకేజీతో అప్రమత్తమైన కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. లీకేజీకి పాల్పడిన నిందితుల్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆదేశాలు జారీ చేసింది. అలా ఇప్పటి వరకు మధ్యవర్తులు, విద్యార్థులు సహా 14 మందిని బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు.అదే సమయంలో ఎన్టీఏ చీఫ్‌ను తొలగించింది. పరీక్షల నిర్వహణపై ఇస్రో మాజీ చైర్మన్ కే రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏడుగురు కమిటీ సభ్యుల్ని నియమించింది. లీకేజీపై రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.అయినప్పటికీ దేశ వ్యాప్తంగా విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు నీట్ పేపర్ లీకేజీపై తమ ఆందోళనల్ని తెలుపుతూ వస్తున్నారు.ఈ తరుణంలో ఎన్టీఏ ప్రైవేట్ సంస్థ అని,ఎన్టీఏ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద రిజిస్టర్ అయ్యిందని పలువురు ప్రచారం చేస్తున్నారు. ‘సమాచార హక్కు చట్టం’ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరి అందులో నిజమెంత? అనేది తెలియాల్సి ఉంది.సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 అంటేసొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 అనేది బ్రిటీష్ ఇండియాలో ఒక చట్టం. ఇది సాధారణంగా సమాజ శ్రేయస్సు కోరేలా విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాలకు సంబంధించిన సంస్థల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. -
పరారీలో నీట్ పేపర్ లీకేజీ మాస్టర్ మైండ్.. ఎవరీ సంజీవ్ ముఖియా
పాట్నా: నీట్ పేపర్ లీకేజీలో ప్రధాన సూత్ర దారి బీహార్‌లోని షాపూర్‌కు చెందిన సంజీవ్ ముఖియా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న నీట్-యూజీ ప్రవేశ పరీక్ష 2024 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించింది. ఈ పరీక్ష నిర్వహణకు ముందు పేపర్ లీకేజీ కావడం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది.అయితే ఈ పేపర్ లీకేజీ అంతా బీహార్‌లోని పాట్నా ఓ బాయ్స్ హాస్టల్ కేంద్రంగా జరిగినట్లు తెలుస్తోంది. మే 5న నీట్ పరీక్ష జరగాల్సి ఉండగా.. మే 4న లీకేజీలో మాస్టర్ మైండ్ బీహార్ నూర్సరాయ్లోని నలంద కాలేజీ ఆఫ్ హార్టికల్చర్ టెక్నికల్ అసిస్టెంట్ సంజీవ్ ముఖియా బాయ్స్ హాస్టల్లో నీట్ పరీక్ష రాసే 25మంది విద్యార్ధులకు వసతి కల్పించాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సంజీవ్ ముఖియా నీట్ క్వశ్చన్ పేపర్, జవాబుల పత్రాన్ని అదే హాస్టల్లో విద్యార్ధులకు అందించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆ హాస్టల్‌ను ప్రభాత్ రంజన్ అనే వ్యక్తి నుంచి తీసుకున్నాడు. ఇంతకీ ఎవరా ప్రొఫెసర్పేపర్ లీక్ కేసుకు సంబంధించి బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ప్రభాత్ రంజన్‌కు సైతం ప్రశ్నించారు. ఈ పేపర్ లీకేజీలో హస్తం ఉందని గుర్తించారు. రంజన్ నీట్ పేపర్లను ప్రొఫెసర్ నుంచి తీసుకొని సంజీవ్ ముఖియాకు ఇచ్చినట్లు తేలింది. పరీక్షకు ముందు రోజే పేపర్లు విద్యార్ధులకు అందుబాటులోకి వచ్చినా సమయం లేకపోవడం వల్ల పూర్తిగా చదవలేదని సమాచారం. ఇక, పోలీసులు దర్యాప్తు చేస్తున్న పేపర్ లీక్ కేసులో ముఖియాతో సంబంధం ఉన్న రవి అత్రి పేరు కూడా బయటపడింది.చదవండి : 👉 నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం చర్యలుముఖియాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మరం చేశారు. నీట్ పేపర్ లీక్‌తో ముఖియా ప్రమేయం ఉన్నట్లు సూచించే వివరాలు వెలుగులోకి రావడంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు బీహార్ పోలీసుల ఆర్ధిక నేరాల విభాగం( ఈఓయూ) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం..ఈఓయూ నలంద, గయా, నవాడా జిల్లాల్లోని పోలీసు బృందాలను అప్రమత్తం చేసింది. ఇదిలా ఉండగా, లీకైన పేపర్లు ఉత్తరప్రదేశ్ నుండి జార్ఖండ్ మీదుగా బీహార్‌కు చేరుకున్నాయని పోలీసులు అనుమానించడంతో జార్ఖండ్‌కు చెందిన పలువురు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సంజీవ్ ముఖియా ఎవరు2010లో పరీక్ష పేపర్ లీకేజీ వార్తల సమయంలో సంజీవ్ ముఖియా పేరు మారు మ్రోగింది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌ఈ) సహా అనేక పరీక్షల పేపర్ లీక్‌లకు సూత్రధారి. ఆ తర్వాత పేపర్ లీకేజీల కోసం ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. సంజీవ్ కుమారుడు శివ కుమార్ గతంలో బీపీఎస్‌ఈ పరీక్ష లీక్ వ్యవహారంలో అరెస్టయ్యాడు. ఇప్పటికీ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. సంజీవ్ ముఖియా భార్య మమతా దేవి గతంలో రామ్‌విలాస్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ నుంచి టికెట్‌పై పోటీ చేశారు. నిందితులపై కఠిన చర్యలుకాగా, వరుస పేపర్ లీక్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొనేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్ 2024ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశపరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. కారకులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించడానికి వీలుంది. -
పేపర్ లీకేజీపై అశోక్ గహ్లోత్‌కు సెగ..బీజేపీ నిరసనలు..
రాజస్థాన్:టీచర్ పోస్టుల రిక్రూట్మెంట్లో పేపర్ లీకేజీ వ్యవహారంపై రాజస్థాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిరసనలు చేపట్టింది. ఆందోళనకారులు రాష్ట్ర సెక్రటేరియట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆందోళనకారులను చెదరగట్టడానికి పోలీసులు బారీకేడ్లు, జలఫిరంగులు ఉపయోగించారు. #WATCH | Police use water cannon to disperse BJP workers protesting against Ashok Gehlot government in Jaipur over alleged paper leak pic.twitter.com/20zqe297kQ — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 13, 2023 అయితే.. ఈ పేపర్ లీకేజీ వ్యవహారంపై రాష్ట్రంలో పలుచోట్ల గత నెలలో ఈడీ దర్యాప్తు చేసింది. దీనిపై సీఎం అశోక్ గహ్లోత్ అప్పట్లోనే అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నందున కేంద్రం ఈడీని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. పేపర్ లీకేజీపై రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ మెరుగైన రీతిలో పనిచేస్తున్నప్పటికీ ఈడీ ఎందుకు తలదూర్చుతోందని ప్రశ్నించారు. ఆ రాష్ట్రంలో 2021లో నిర్వహించిన టీచర్ రిక్రూట్మెంట్లో పేపర్ లీకేజీ అయినట్లు పలు ప్రాథమిక ఆధారాలు లభించాయి. అనంతరం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022లో నిర్వహించిన పరీక్షల్లోనూ లీకేజీ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ బాబులాల్ కటారాతో పాటు ఆయన మేనల్లున్ని, ఓ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇదీ చదవండి:సీఎం మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ సూపర్ కానుక..! -
కేటీఆర్ లీగల్ నోటీసులపై రేవంత్‌రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా నోటీసులకు నోటీసులతోనే కౌంటర్ ఇచ్చారు. తనకిచ్చిన లీగల్ నోటీసులు వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కేంద్రంగా జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమంతో కేటీఆర్‌కు సంబంధం లేదని.. ఆసమయంలో ఆయన దేశంలో లేనందున ఆ బాధ తెలియదని అన్నారు. టీఎస్పీఎస్సీకి టెక్నికల్ సపోర్ట్ అంతా ఐటీశాఖ అందిస్తోందని ఆరోపించారు. అలాంటప్పుడు కేటీఆర్ తనకు సంబంధం లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్ రెడ్డి నియామకం కూడా ఐటీశాఖ ద్వారానే జరిగిందన్నారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగాల విషయంలో నిరుద్యోగుల తరపున మాట్లాడానని చెప్పారు. పేపర్ లీకేజీపై హైకోర్టులో పిటిషన్ వేశామని.. ఈడీ, సీబీఐకి ఫిర్యాదు చేశామని తెలిపారు. కాగా తనపై తప్పుడు ఆరోపణలు చేశారని టీపీసీసీ రేవంత్ రెడ్డికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. తనపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేకుంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు. చదవండి: బండి సంజయ్ చొరవ.. బీజేపీ కార్యాలయ సిబ్బందిని కలిసిన మోదీ -
Tenth Class Exam Paper Leak: వాట్సాప్ గ్రూపుల్లో టెన్త్ పేపర్ చక్కర్లు.. లీక్?!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పేపర్ లీక్‌ల వ్యవహారం సంచలనంగా మారింది. రాష్ట్రంలో సోమవారం నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, పరీక్ష ప్రారంభమైన కాసేపటికే పరీక్ష పేపర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. వాట్సాప్ గ్రూపుల్లో పదో తరగతి క్వశ్చన్ పేపర్ చక్కర్లు కొట్టింది. పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే(9 గంటల 37 నిమిషాలకు) తెలుగు పేపర్ తాండూరులో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తాండూరులో ప్రశ్నాపత్రం సర్క్యూలేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న టెన్త్ పేపర్‌పై పోలీసులు, విద్యాశాఖ ఆరా తీస్తోంది. పేపర్ ఎలా లీక్ అయ్యింది అని దర్యాప్తు చేస్తున్నారు. దీన్ని ఎవరు ఫొటో తీశారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
మోదీ రాష్ట్రంలోనూ పేపర్లు లీక్ అయ్యాయి: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారం.. తెలంగాణలో రాజకీయ విమర్శలకు తావిచ్చింది. అధికార బీఆర్ఎస్, బీజేపీలు పోటీపడి నిందితులతో సత్సంబంధాలు ఉన్నాయంటూ నిందలు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలో.. పేపర్ లీకేజీతో కేటీఆర్‌కు సంబంధం ఉందంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించగా, దానికి ఘాటు కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. టీఎస్పీఎస్సీ పశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలపై బీఆర్ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ‘‘బండి సంజయ్ తెలివిలేని దద్దమ్మ, రాజకీయ అజ్ఞాని’’ అంటూ మండిపడ్డారు. ‘‘పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రభుత్వ శాఖ కాదు.. అది ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ప్రభుత్వాల పనితీరు, వ్యవస్థల గురించి అవగాహన లేని నాయకుడు సంజయ్. వాటిపై ఆయనకు కనీస అవగాహన కూడా లేదు. ..ఒక వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకు ఆపాదించి గందరగోళం సృష్టిస్తున్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును నాశనం చేసేలా రాజకీయాలు చేస్తున్నారు. నిరుద్యోగుల పట్ల మా నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదు. ఆ పార్టీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఇప్పటికే వందలసార్లకు పైగా ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. అంతెందుకు ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో 13 సార్లు ప్రశ్నపత్రం లీక్ అయింది. ప్రధాని మోదీని రాజీనామా అడిగే దమ్ము బండి సంజయ్‌కు ఉందా? నిరుద్యోగ యువత ప్రయోజనాలు కాపాడటమే మా ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు టీఎస్పీఎస్సీకి అందిస్తాం. రెచ్చగొట్టే రాజకీయ పార్టీల కుట్రల్లో భాగం కాకుండా, తెలంగాణ యువత అంతా ఉద్యోగాల సాధనపైనే దృష్టి పెట్టాలి అని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో ముప్ఫై లక్షల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాత్రి పగలు చదివి కష్టపడి పరీక్షలు రాస్తే.. నిరుద్యోగుల భవిష్యత్ ను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. సిట్ దర్యాప్తుతో ఏం ఒరుగుతుందో ఫాంహౌజ్, నయీం కేసులను చూస్తేనే తెలుస్తోందని, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో తన కేబినెట్ సహచరుల ప్రమేయం లేదనుకుంటే.. సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు బండి సంజయ్. ఈ క్రమంలో కేటీఆర్‌కు పేపర్ లీకేజీతో సంబంధం ఉందని ఆరోపించిన ఆయన.. వెంటనే ఆయన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ కమిషన్‌ను పూర్తిగా రద్దు చేయడంతో పాటు అందులోని సభ్యులను బదిలీ చేయాలని డిమాండ్ చేశారాయన. -
వదంతులను నమ్మొద్దు: టీఎస్పీఎస్సీ చైర్మన్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్, అవకతవకలు జరిగే అవకాశమే లేదని.. వదంతులను ఆపేందుకే తాము మీడియా ముందుకు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్‌రెడ్డి తెలిపారు. ఏఈ పరీక్షా ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం.. ఈ నేపథ్యంలో మిగతా పేపర్లూ లీక్ అయ్యాయంటూ సభ్యుల ఆందోళన.. తదనంతర పరిణామాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం కమిషన్ కీలక భేటీ నిర్వహించింది. సుమారు 4 గంటలకు పైగా ఈ భేటీ జరగ్గా.. కమిషన్ సభ్యులు విడిగానే కాకుండా సీఎస్ శాంతకుమారితోనూ భేటీ అయ్యారు గమనార్హం. అనంతరం పేపర్ లీకేజీ వ్యవహారంపై చైర్మన్ మీడియాతో మాట్లాడారు. ‘‘టీఎస్పీఎస్సీ పరిధిలోని 30 లక్షల మంది వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ కింద దరఖాస్తు చేసుకున్నారు. 26 రకాల ఉద్యోగులకు నోటిఫికేషన్ జారీ చేశాం. గ్రూప్-1 పరీక్షలకు మల్టీపుల్ జంబ్లింగ్ చేశాం’’ అని ఆయన వివరించారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగే అవకాశం లేదన్న చైర్మన్.. దురదృష్టకర పరిస్థితుల్లో ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందని, పేపర్లు లీక్ అయ్యాయంటూ, ఎగ్జామ్‌లు రద్దు అవుతాయంటూ వస్తున్న వదంతులకు పుల్‌స్టాప్ పెట్టాలని తాము ఇదంతా చెప్తున్నామని ఆయన అన్నారు. లీకేజీ సమాచారం అందగానే తాము పోలీసులను ఫిర్యాదు చేశామని, ఆ తర్వాతి పరిణామాలు అందరికీ తెలిసినవే అని చెప్పారాయన. రాజశేఖర్‌రెడ్డి అనే నెట్వర్క్ ఎక్స్పర్ట్ ఆరేడు ఏళ్ల నుంచి పని చేస్తున్నారు. నెట్వర్క్ ఎక్స్పర్ట్ కావడంతో ఐపీ అడ్రస్‌లు తెలిసే అవకాశం ఉంటుంది. రాజశేఖర్‌రెడ్డితో పాటు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ హ్యాకింగ్‌కు పాల్పడ్డాడని, ఈ ఇద్దరితో పాటు మరికొందరి వల్ల ఈ లీక్ వ్యవహారమంతా నడిచిందని తెలిపారాయన. పేపర్ లీక్ అయిన ఏఈ పరీక్షకు సంబంధించి అధికారిక నివేదిక(బుధవారం మధ్యాహ్నం కల్లా అందే అవకాశం ఉంది).. ఆపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్నాకే పరీక్ష వాయిదా వేయాలా? లేదా ఇతర నిర్ణయం తీసుకుని ప్రకటన చేద్దామని భావించామని తెలిపారాయన. అయితే.. ఈలోపు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అనుమానాలను నివృత్తి చేయడానికే మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారాయన. తన కూతురు కూడా గ్రూప్-1 రాసిందంటూ ప్రచారం జరుగుతోందన్న విషయాన్ని చైర్మన్ జనార్ధన్‌రెడ్డి తోసిపుచ్చారాయన. తన కుటుంబ సభ్యులెవరూ పరీక్ష రాయలేదని స్పష్టత ఇచ్చారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో 103 మార్కులు వచ్చిన వ్యవహారంపై స్పందించిన చైర్మన్.. అది నిజమేనని, కానీ, ప్రవీణ్ సెలక్ట్ కాలేదని, ప్రవీణ్‌కు వచ్చిన మార్కులే హయ్యెస్ట్ అంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని స్పష్టత ఇచ్చారు. -
వదంతులు.. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: కలెక్టర్ హరి నారాయణ
సాక్షి, చిత్తూరు: చిత్తూరులో టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని జిల్లా కలెక్టర్ హరి నారాయణ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పరీక్షలు ప్రారంభమైన రెండు గంటల తర్వాత పేపర్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో వచ్చిందని తెలిపారు. కొందరు వ్యక్తులు డీఈఓకు వాట్సప్ ద్వారా పేపర్ లీక్ అయినట్లు మెసేజ్ పెట్టారని అన్నారు. విద్యార్థులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వాట్సాప్ ద్వారా వచ్చిన సమాచారంపై డీఈఓ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారని అన్నారు. తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని తెలిపారు. ఈ వార్త కూడా చదవండి: AP SSC Exams 2022: ఏపీలో పదో తరగతి పరీక్షలు -
ఎస్ఎస్సీ స్కామ్ : కేంద్రం వివరణ కోరిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ప్రశ్నాపత్రాల లీక్ కుంభకోణంపై విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం కేంద్రాన్ని వివరణ కోరింది.ఫిబ్రవరిలో నిర్వహించిన ఎస్ఎస్సీ పరీక్షల స్కామ్‌పై సమాధానం ఇవ్వాలని ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్రాన్ని ఆదేశించింది. ఫిబ్రవరి 21న నిర్వహించిన పరీక్షలు సాంకేతిక కారణాలతో మార్చి 9న తిరిగి నిర్వహిస్తామని ఎస్ఎస్సీ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎస్ఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజిపై విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ ఢిల్లీలోని నాలుగు ప్రాంతాల్లో భారీ నిరసనలు చేపట్టింది. పరీక్షకు హాజరైన అభ్యర్ధుల ఆందోళనలకు తలొగ్గిన కేంద్రం ఈ అంశంపై సీబీఐ విచారణకు ఈనెల 5న కేంద్రం అంగీకరించింది. -
ఎంసెట్-2 పేపర్ లీక్‌పై సీఐడీ విచారణ వేగవంతం
-
ఎంసెట్-2 పేపర్ లీక్‌పై సీఐడీ విచారణ వేగవంతం
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ వ్యవహారంపై సీఐడీ వేగవంతంగా విచారణ చేస్తోంది. దీనికి సంబంధించి ప్రాథమిక ఆధారాలను సేకరించే పనిలో ఉంది. పేపర్ లీకైందనే కోణంలో సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. పేపర్ లీక్ ఘటనపై సీఐడీ ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. సీఐడీ అధికారులు విజయవాడ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విచారణ చేశారు. బ్రోకర్‌తో విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడిన కాల్ డేటాను సేకరించారు. తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ.. ఎంసెట్ కన్వీనర్ రమణారావును పిలిపించి మాట్లాడారు.