
సాక్షి, చిత్తూరు: చిత్తూరులో టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని జిల్లా కలెక్టర్ హరి నారాయణ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పరీక్షలు ప్రారంభమైన రెండు గంటల తర్వాత పేపర్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో వచ్చిందని తెలిపారు. కొందరు వ్యక్తులు డీఈఓకు వాట్సప్ ద్వారా పేపర్ లీక్ అయినట్లు మెసేజ్ పెట్టారని అన్నారు.
విద్యార్థులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వాట్సాప్ ద్వారా వచ్చిన సమాచారంపై డీఈఓ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారని అన్నారు. తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని తెలిపారు.
ఈ వార్త కూడా చదవండి: AP SSC Exams 2022: ఏపీలో పదో తరగతి పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment