![Protests On Alleged Paper Leak Against Ashok Gehlot Government - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/13/Protests%20On%20Alleged%20Paper%20Leak%20Against%20Ashok%20Gehlot%20Government%20.jpg.webp?itok=mht4MlNk)
రాజస్థాన్:టీచర్ పోస్టుల రిక్రూట్‌మెంట్‌లో పేపర్ లీకేజీ వ్యవహారంపై రాజస్థాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిరసనలు చేపట్టింది. ఆందోళనకారులు రాష్ట్ర సెక్రటేరియట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆందోళనకారులను చెదరగట్టడానికి పోలీసులు బారీకేడ్లు, జలఫిరంగులు ఉపయోగించారు.
#WATCH | Police use water cannon to disperse BJP workers protesting against Ashok Gehlot government in Jaipur over alleged paper leak pic.twitter.com/20zqe297kQ
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 13, 2023
అయితే.. ఈ పేపర్ లీకేజీ వ్యవహారంపై రాష్ట్రంలో పలుచోట్ల గత నెలలో ఈడీ దర్యాప్తు చేసింది. దీనిపై సీఎం అశోక్ గహ్లోత్ అప్పట్లోనే అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నందున కేంద్రం ఈడీని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. పేపర్ లీకేజీపై రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ మెరుగైన రీతిలో పనిచేస్తున్నప్పటికీ ఈడీ ఎందుకు తలదూర్చుతోందని ప్రశ్నించారు.
ఆ రాష్ట్రంలో 2021లో నిర్వహించిన టీచర్ రిక్రూట్‌మెంట్‌లో పేపర్ లీకేజీ అయినట్లు పలు ప్రాథమిక ఆధారాలు లభించాయి. అనంతరం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022లో నిర్వహించిన పరీక్షల్లోనూ లీకేజీ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ బాబులాల్ కటారాతో పాటు ఆయన మేనల్లున్ని, ఓ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment