
తెలంగాణలో టెన్త్ పేపర్స్ లీక్ కలకలం నడుస్తోంది..
సాక్షి, వరంగల్: తెలంగాణలో పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్ కలకలం నడుస్తోంది. తాజాగా ఇవాళ(మంగళవారం) రెండో రోజూ పరీక్షల్లో హిందీ పేపర్ సైతం లీక్ అయినట్లు తెలుస్తోంది.
వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ బయటకు వచ్చింది. ఉదయం 9గం.30కే పేపర్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. టెన్త్ విద్యార్థులకు చెందిన పలు వాట్సాప్ గ్రూపుల్లో పేపర్ చక్కర్లు కొట్టింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంపై అధికారులు స్పందించాల్సి ఉంది.
మరోవైపు.. నిన్న తాండూరులో పదో తరగతి తెలుగు ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసింది విద్యాశాఖ. అలాగే.. బందప్ప, సమ్మప్ప అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.