సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, వ్యవసాయ, వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీసెట్) షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్ష, సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో వ్యవసాయ, ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష బాధ్యతలు కాకినాడ జేఎన్‌టీయూకు అప్పగించారు. మొత్తం 120 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఈ నెల 25న ఇంజనీరింగ్ ప్రాథమిక కీ విడుదల చేస్తామని పేర్కొన్నారు. 2,59,156 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని, కరోనా పాజిటివ్ విద్యార్థులకు పరీక్షకు అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment