
T20 World Cup 2021 Warm Up Matches Schedule Announced: టీ20 ప్రపంచకప్-2021లో పాక్‌తో జరిగే మహా సంగ్రామానికి ముందు టీమిండియా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. మెగా టోర్నీలో భాగంగా కోహ్లి సేన అక్టోబర్ 24న దాయాది పాక్‌తో తలపడనుండగా, అంతకంటే ముందే అంటే అక్టోబర్ 18న ఇంగ్లండ్‌తో, 20వ తేదీన ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. టీమిండియా సహా ప్రపంచకప్‌లో పాల్గొనే అగ్రశ్రేణి జట్లన్నీ ఈ వార్మప్ మ్యాచ్‌ల్లో పాల్గొంటాయి. ఈ మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది.
అక్టోబర్ 18:
* అఫ్గానిస్తాన్ VS సౌతాఫ్రికా (భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30)
* పాకిస్థాన్ VS వెస్టిండీస్ (3:30)
* ఆస్ట్రేలియా VS న్యూజిలాండ్ (7: 30)
* భారత్ VS ఇంగ్లండ్ (7:30)
అక్టోబర్ 20 :
* ఇంగ్లండ్ VS న్యూజిలాండ్ (3:30)
* భారత్ VS ఆస్ట్రేలియా (3:30)
* సౌతాఫ్రికా Vs పాకిస్థాన్ (7:30)
* అఫ్గానిస్తాన్ VS వెస్టిండీస్ (7:30)
ఈ మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
కాగా, యూఏఈ, ఒమన్ వేదికగా జరిగే పొట్టి ప్రపంచకప్ అక్టోబర్ 17న ప్రారంభమై.. దుబాయ్ వేదికగా నవంబర్ 14న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ టోర్నీలో తొలుత గ్రూప్-ఏ, గ్రూ-బిలోని క్వాలిఫయర్స్ జట్ల మధ్య తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అనంతరం మేజర్ జట్ల మధ్య సూపర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. ఇక, ఈ టోర్నీలో టీమిండియా లీగ్ దశలో తలపడబోయే మ్యాచ్‌ల విషయానికొస్తే.. అక్టోబర్ 24న పాక్‌తో, అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
చదవండి: టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్..!