రోహిత్ మెరుపులు.. ఆసీస్‌పై టీమిండియా ఘన విజయం
టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 13 బంతులు మిగిలిఉండగానే చేధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ(60 పరుగులు రిటైర్డ్‌హర్ట్) అర్థశతకంతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్ 38, కేఎల్ రాహుల్ 39 పరుగులతో రాణించారు. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టి మ్యాచ్‌ను తన స్టైల్లో ముగించాడు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 57 పరుగుల క్లాస్ ఇన్నింగ్స్‌తో మెరవగా.. ఆఖర్లో స్టోయినిస్ 25 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 41 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకముందు మ్యాక్స్‌వెల్ 37 పరుగులతో రాణించాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 2, రాహుల్ చహర్, భువనేశ్వర్ కుమార్, జడేజా తలా ఒక వికెట్ తీశారు. ఇక పాకిస్తాన్‌తో అక్టోబర్ 24న జరగనున్న తొలి మ్యాచ్‌కు టీమిండియాకు మంచి ప్రాక్టీస్ లభించినట్లయింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు అందుకున్న టీమిండియా పాక్‌తో మ్యాచ్‌కు ముందు మంచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది.
► హార్దిక్ పాండ్యాకు బ్యాటింగ్ అవకాశం ఇచ్చేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ 60 పరుగుల వద్ద రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 134 పరుగులు చేసింది. సూర్యకుమార్ 32, హార్దిక్ 2 పరుగులతో ఆడుతున్నారు.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. 13 ఓవర్లలో 101/1
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో 68 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ఆస్టన్ అగర్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. రోహిత్ 47, సూర్యకుమార్ యాదవ్ 13 పరుగులతో ఆడుతున్నారు.
దాటిగా ఆడుతున్న ఓపెనర్లు.. టీమిండియా 67/0
టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు దాటిగా ఆడుతున్నారు. 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. రాహుల్ 39, రోహిత్ 27 క్రీజులో ఉన్నారు. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆసీస్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ కొనసాగిస్తుంది.
టీమిండియా టార్గెట్ 153.. 6 ఓవర్లలో 42/0
153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 20, కేఎల్ రాహుల్ 21 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.
స్టోయినిస్ మెరుపులు.. టీమిండియా టార్గెట్ 153
టి20 ప్రపంచకప్‌లో టీమిండియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 57 పరుగుల క్లాస్ ఇన్నింగ్స్‌తో మెరవగా.. ఆఖర్లో స్టోయినిస్ 25 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 41 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకముందు మ్యాక్స్‌వెల్ 37 పరుగులతో రాణించాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 2, రాహుల్ చహర్, భువనేశ్వర్ కుమార్, జడేజా తలా ఒక వికెట్ తీశారు.
స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ.. ఆస్ట్రేలియా 118/4
ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ క్లాస్ అర్థసెంచరీతో మెరిశాడు. 41 బంతులెదుర్కొన్న స్మిత్ 6 ఫోర్ల సాయంతో 50 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఆసీస్ 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. స్టోయినిస్ 18 పరుగులతో స్మిత్‌కు సహకరిస్తున్నాడు.
మ్యాక్స్‌వెల్ ఔట్.. ఆస్ట్రేలియా 73/4
దాటిగా ఆడుతున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్(37) రాహుల్ చహర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆస్ట్రేలియా 72 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.
10 ఓవర్లలో ఆస్ట్రేలియా 57/3
టీమిండియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 23, స్టీవ్ స్మిత్ 22 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఆరంభంలో స్పిన్నర్ అశ్విన్ టాపార్డర్‌ను కకావికలం చేశాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో వరుస బంతుల్లో వార్నర్, మార్ష్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత జడేజా ఫించ్‌ను ఔట్ చేయడంతో ఆస్ట్రేలియా 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మ్యాక్సీ, స్మిత్‌లు కలిసి నాలుగో వికెట్‌కు 46 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
ఆరోన్ ఫించ్(8) రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 20 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 2, మ్యాక్స్‌వెల్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
అశ్విన్ దెబ్బ.. వరుస బంతుల్లో రెండు వికెట్లు
ఆస్ట్రేలియాకు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన అశ్విన్ వరుస బంతుల్లో వార్నర్, మిచెల్ మార్షలను పెవిలియన్ చేర్చాడు. ముందుగా ఓవర్ ఐదో బంతికి వార్నర్(1)ను ఎల్బీగా వెనక్కి పంపిన అశ్విన్ తర్వాతి బంతికి మిచెల్ మార్ష్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో 2 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 6 పరుగులు చేసింది.
దుబాయ్: టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా టీమిండియా నేడు ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకోవడంతో అతని స్థానంలో రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. కోహ్లితో పాటు బుమ్రా, షమీ కూడా రెస్ట్ తీసుకోనున్నారు. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వార్మప్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ మెరుపులతో టీమిండియా సునాయాస విజయాన్ని దక్కించుకుంది.
టీమిండియా: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ (వికెటకీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్, అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జాంపా, గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్
Comments
Please login to add a commentAdd a comment