PC: ICC T20.Com
Mitchell Marsh Golden Duck.. టీమిండియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గోల్డెన్ డక్ అయ్యాడు. ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. ఈరోజు(అక్టోబర్ 20) మిచెల్ మార్ష్ 30వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. మరి అలాంటి మార్ష్‌కు తన పుట్టినరోజు నాడే టీమిండియా ఆడుతున్న మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయితే బాధ ఉండదా.. మీరే చెప్పండి. డేవిడ్ వార్నర్ ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన మార్ష్ ఆడిన తొలి బంతికే ఔటయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ రెండో ఓవర్ ఐదో బంతిని ఫ్లిక్ చేయగా.. అది వెళ్లి స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ చేతిలో పడింది. దీంతో మార్ష్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.
ఇక టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. 4 ఓవర్ల ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 14 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 2, మ్యాక్స్‌వెల్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
చదవండి: T20 WC 2021 IND Vs AUS: అటు హార్దిక్.. ఇటు స్టోయినిస్.. ఇద్దరి పరిస్థితి ఒకటే
Comments
Please login to add a commentAdd a comment