ఆ్రస్టేలియాలోని పరిస్థితులకు అలవాటు పడేందుకు అందరికంటే ముందుగా అక్కడికి చేరుకున్న భారత జట్టు స్థానిక జట్లతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లాడింది. ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లో నెగ్గిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఓటమి పాలైంది. అయితే ఈ రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు కావడంతో పెద్దగా పట్టించుకోనవసరం లేదు. కానీ అసలు మ్యాచ్‌లకు ముందు జరిగే వార్మప్ మ్యాచ్‌లో పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
వార్మప్ మ్యాచ్ కదా అని లైట్ తీసుకుంటే అసలుకే ఎసరు వస్తుంది. ఎందుకంటే వార్మప్‌లో రాణించిన దానిని బట్టే టీమిండియా ఆటతీరుపై ఒక అంచనా వచ్చే అవకాశముంది. కాబట్టి ఇరుజట్లు ఈ మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకోనున్నాయి. ఇక టి20 ప్రపంచకప్ కోసం చాంపియన్ అయిన ఆస్ట్రేలియా ఫించ్ కెప్టెన్సీలో ఆడేందుకు సిద్ధమైంది. ఐసీసీ ఏర్పాటు చేసిన వార్మప్ మ్యాచ్‌లో ఇరుజట్లు నుంచి ప్రధాన జట్లు బరిలోకి దిగనున్నాయి. ఉదయం గం. 8: 30 నుంచి ‘స్టార్ స్పోర్ట్స్–1’లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment