మహ్మద్ షమీ, రోహిత్ శర్మ (PC: BCCI)
T20 World Cup Warm Ups- Australia vs India- Rohit Sharma: టీ20 వరల్డ్ కప్-2022.. టీమిండియాతో వార్మప్ మ్యాచ్.. ఆస్ట్రేలియా గెలవాలంటే.. ఆఖరి ఓవర్‌లో 11 పరుగులు అవసరం.. అయితే అప్పటి వరకు టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీని ఆడించని.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ... అనూహ్యంగా అతడి చేతికి బంతినిచ్చాడు.
సుదీర్ఘ కాలం తర్వాత వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న షమీ.. తొలుత యార్కర్ వేయడానికి ప్రయత్నించి విఫలం కాగా ఆసీస్ బ్యాటర్ ప్యాట్ కమిన్స్ రెండు పరుగులు రాబట్టాడు. మరుసటి బంతిని యార్కర్‌గా మలచడంలో షమీ సఫలమైనప్పటికీ.. కమిన్స్ ఈసారి జాగ్రత్తగా ఆడి మరో రెండు పరుగులు రాబట్టాడు.
దీంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. చావో రేవో తేల్చుకోవాల్సి పరిస్థితిలో షమీ వరుసగా వికెట్లు పడగొట్టాడు. తొలుత కమిన్స్‌ను బౌల్డ్ చేసిన అతడు అష్టన్ అగర్‌ను రనౌట్ చేశాడు. ఆ తర్వాత వరుసగా జోష్ ఇంగ్లిస్, రిచర్డ్‌సన్‌లను పెవిలియన్‌కు పంపి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.
తొలుత దూరంగానే
అయితే, షమీ జట్టుతోనే ఉన్నా ఆది నుంచి ఒక్క ఓవర్ కూడా వేయించని రోహిత్ శర్మ.. ఆఖరి ఓవర్‌లో అదీ నరాలు తెగే ఉత్కంఠ రేపిన తరుణంలో అతడిని బౌలింగ్‌కు పంపడంపై ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్.. ‘‘చాలా రోజుల తర్వాత అతడు జట్టులోకి తిరిగి వచ్చాడు.
అందుకే ఆఖర్లో పంపించాం
కుదురుకునేందుకు టైం పడుతుంది. నిజానికి తనకూ ఒక ఓవర్ వేసే అవకాశం ఇవ్వాలనుకున్నాం. అది కూడా సవాలుతో కూడుకున్నదై ఉండాలని భావించాం. అందుకే ఫైనల్ ఓవర్ తనతో వేయించాం. ఇక ఆఖరి ఓవర్లో అతడు ఏం చేశారో మీరే చూశారు కదా!’’ అని షమీని చివర్లో ఎందుకు పంపాడో చెప్పుకొచ్చాడు.
కాగా గతేడాది ప్రపంచకప్ తర్వాత షమీ టీమిండియ తరఫున ఒక్క టీ20 కూడా ఆడలేదు. వరల్డ్‌కప్-2022 టోర్నీ నేపథ్యంలో స్టాండ్‌బైగా ఎంపికైన అతడు.. జస్‌ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో దూరం కావడంతో ప్రధాన జట్టులో చోటు దక్కించుకోగలిగాడు. ఆసీస్‌తో వార్మప్ మ్యాచ్‌లో ఒక ఓవర్ వేసిన అతడు నాలుగు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
చదవండి: WI Vs SCO: మాకిది ఘోర పరాభవం.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో: విండీస్ కెప్టెన్
T20 WC Warm Up Matches: చెలరేగిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. పాక్‌పై సునాయాస విజయం
T20 WC 2022: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తప్పదా? ఇంతకీ అతడికి ఏమైంది?
Comments
Please login to add a commentAdd a comment