ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆఖర్లో షమీ మ్యాజిక్‌తో టీమిండియా ఆరు పరుగులతో విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. ఫించ్ 76 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మహ్మద్ షమీ ఆఖరి ఓవర్‌లో నాలుగు పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా.. ఒక రనౌట్ సహా ఓవరాల్‌గా షమీ ఓవర్లో నాలుగు వికెట్లు పడడం విశేషం.
19వ ఓవర్ వరకు మ్యాచ్ ఆస్ట్రేలియా చేతిలో ఉన్నప్పటికి.. ఆఖరి ఓవర్‌లో షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను గెలిపించడమే గాక మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 76 పరుగులు చేయగా.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 23 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో షమీ 3, భువనేశ్వర్ 2, అర్ష్‌దీప్ సింగ్, చహల్, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు.
13 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరెంతంటే?
13 ఓవర్లు ముగిసిసరికి ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఫించ్ 47, మ్యాక్స్‌వెల్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 11 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ చహల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
మిచెల్ మార్ష్(35) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్
►187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ భువనేశ్వర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది. ఫించ్ 31, స్టీవెన్ స్మిత్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
సూర్యకుమార్ ఫిప్టీ.. 20 ఓవర్లలో టీమిండియా 186/7
►ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 59 పరుగులకే టాప్ స్కోరర్ కాగా.. సూర్యకుమార్ 50 పరుగులు చేసి ఔటైనప్పటికి తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. దినేశ్ కార్తిక్ 20 పరుగులతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కేన్ రిచర్డ్‌సన్ నాలుగు వికెట్లు తీయగా.. మ్యాక్స్‌వెల్, ఆస్టన్ అగర్, మిచెల్ స్టార్క్‌లు తలా ఒక వికెట్ తీశారు.
హార్దిక్ పాండ్యా ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
►ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(2) విఫలమయ్యాడు. కేన్ రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చిన పాండ్యా పెవిలియన్‌కు చేరాడు. అంతకముందు విరాట్ కోహ్లి(19) స్టార్క్ బౌలింగ్‌లో మిచెల్ మార్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 14 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. సూర్యకుమార్ 26, దినేశ్ కార్తిక్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన భారత్.. రోహిత్ శర్మ ఔట్
►80 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఆగర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
కేఎల్ రాహుల్ (57) ఔట్.. తొలి వికెట్ డౌన్
►కేఎల్ రాహుల్(57) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది.
కేఎల్ రాహుల్ అర్థ శతకం.. టీమిండియా 75/0
►టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్థ శతకంతో మెరిశాడు. ప్రస్తుతం టీమిండియా 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 55, రోహిత్ శర్మ 14 పరుగులతో ఆడుతున్నారు.
దంచి కొడుతున్న కేఎల్ రాహుల్.. టీమిండియా 47/0
►టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ దంచి కొడుతున్నాడు. సిక్సర్లు, ఫోర్లతో విజృంభిస్తున్న రాహుల్ 22 బంతుల్లోనే 43 పరుగులతో ఆడుతున్నాడు. రాహుల్ ధాటికి కెప్టెన్ రోహిత్‌కు బ్యాటింగ్ అవకాశం కూడా రాలేదు. ప్రస్తుతం టీమిండియా 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 47 పరుగులు చేసింది.
2 ఓవర్లలో టీమిండియా స్కోరు 16/0
►2 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 12, రోహిత్ (0) పరుగులతో క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
►టి20 ప్రపంచకప్‌లో భాగంగా అసలు పోరుకు ముందు ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది.
►ఈ మ్యాచ్‌లో టీమిండియా 15 మందితో బరిలోకి దిగనుంది.
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ , దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, యజ్వేంద్ర చాహల్.
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్(కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, అష్టన్ అగర్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్‌సన్
ఆ్రస్టేలియాలోని పరిస్థితులకు అలవాటు పడేందుకు అందరికంటే ముందుగా అక్కడికి చేరుకున్న భారత జట్టు స్థానిక జట్లతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లాడింది. ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లో నెగ్గిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఓటమి పాలైంది. అయితే ఈ రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు కావడంతో పెద్దగా పట్టించుకోనవసరం లేదు. కానీ అసలు మ్యాచ్‌లకు ముందు జరిగే వార్మప్ మ్యాచ్‌లో ఇరుజట్లు పూర్తిస్థాయిలో బరిలోకి దిగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment