ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తడబడుతోంది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న ఓవల్ పిచ్‌పై ఆసీస్ బ్యాటర్లు యదేచ్ఛగా పరుగులు సాధిస్తే మనవాళ్లు మాత్రం పరుగులు చేయడంలో అష్టకష్టాలు పడుతూ వికెట్లు పోగొట్టుకుంటున్నారు.
ఆసీసీ భారీ స్కోరు చేసిన చోట టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. రోహిత్, గిల్, కోహ్లి, పుజారాలు తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఇక మిగిలిన భారం మొత్తం రహానే, జడేజాలపైనే ఉంది. ఒకవేళ వీరిద్దరు కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగితే మ్యాచ్ మూడు రోజుల్లో ముగియడం ఖాయంగా కనిపిస్తోంది.
ఓవల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తుంది. ఆట తొలి సెషన్ మినహా మిగతా రెండు సెషన్లలో బౌలర్లకు ఏమాత్రం సహకరించడం లేదు. కానీ ఆస్ట్రేలియా బౌలర్లు మాత్రం చివరి సెషన్‌లోనూ తమ దూకుడు చూపిస్తున్నారు. కానీ అదే సమయంలో మన టీమిండియా బౌలర్లు మాత్రం వికెట్లు తీయడంలో నానా కష్టాలు పడాల్సి వచ్చింది. పిచ్ ఒకటే.. వాళ్లకు అలా.. మనకు మాత్రం ఎందుకిలా అంటే దీనికి సమాధానం మన బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో తప్పులున్నాయని చూపిస్తుంది.
వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్నప్పటికి టీమిండియా ఆటలో ఏం మార్పు కనిపించడం లేదు. బాధ్యతగా ఆడాల్సిన కెప్టెన్ రోహిత్ సహా గిల్, కోహ్లి, పుజారాలు తక్కువ స్కోర్లకే వెనుదిరిగి టీమిండియాను కష్టాల్లోకి నెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment