లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 444 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 234 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి వరుసగా సోషల్ మీడియాలో క్రిప్టిక్ స్టోరీలను పోస్టు చేస్తున్నాడు.
తాజగా ఈ ఓటమి తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో మరో క్రిప్టిక్ స్టోరీని కోహ్లి పోస్టు చేశాడు. "మౌనమే మన బలానికి గొప్ప మూలం" అర్ధం వచ్చే పోస్టును విరాట్ షేర్ చేశాడు. అంతకు ముందు కూడా విరాట్ కోహ్లి ఈ తరహా మరో పోస్టు చేశాడు. "మనకు బాధలు, భయాలు, అనుమానాలు మరీ ఎక్కువైతే బ్రతకడానికి, ప్రేమించడానికి సమయం ఉండదు. కాబట్టి కొన్ని సార్లు అన్నీ వదిలేయడానికి కూడా ప్రాక్టీస్ చేయాలి " అంటూ ఇన్‌స్టాలో క్రిప్టిక్ స్టోరీని షేర్ చేశాడు.
అయితే విరాట్ ఇటువంటి పోస్టులు ఎందుకు చేస్తున్నాడో తెలియక అతడి అభిమానులు బుర్రలు చించుకుంటున్నారు. మరి కొంతమంది అయితే మరో అడుగు ముందుకు వేసి కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కోహ్లికి విభేదాలు ఏర్పడ్డాయి అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు జట్టు ఎంపిక విషయంలో కోహ్లి సూచనలను రోహిత్, ద్రవిడ్ పరిగణలోకి తీసుకోలేదని, అందుకే అతడు జట్టు మేనేజ్‌మెంట్‌పై ఆసంతృప్తిగా ఉన్నాడని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.
చదవండి: WTC Final: టీమిండియా చేసిన తప్పు అదే.. ఇలా అయితే చాలా కష్టం: సెహ్వాగ్
Instagram story of Virat Kohli. pic.twitter.com/sv0iFAzqtc
— Johns. (@CricCrazyJohns) June 11, 2023
Comments
Please login to add a commentAdd a comment