లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. రోహిత్ టెస్టులకు కెప్టెన్‌గా పనికిరాడని, వెంటనే అతడిని ఆ భాధ్యతల నుంచి తప్పించాలని మాజీలు డిమాండ్ చేస్తున్నారు.
మరి కొంత మంది కెప్టెన్‌గా రోహిత్ కంటే విరాట్ కోహ్లి ఎంతో బెటర్ అని, అతడి సారధ్యంలో భారత జట్టు అద్బుతంగా రాణించందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లిని ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వాఖ్యలు చేశాడు.
కోహ్లిని టెస్టు క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకోవాలని ఎప్పుడూ తాము కోరుకోలేదని, అది అతడి వ్యక్తిగత నిర్ణయమని గంగూలీ తెలిపాడు. కాగా గతేడాది ఆరంభంలో ధక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లి తప్పుకున్నాడు.
అప్పటికే వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లి.. ఆ సిరీస్ అనంతరం టెస్టులకు కూడా గుడ్‌బై చెప్పేశాడు. అయితే అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న సౌరవ్ గంగూలీతో విభేదాల కారణంగానే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వినిపించాయి. ఇక కోహ్లి తప్పుకున్న అనంతరం రోహిత్ శర్మ భారత జట్టు పగ్గాలు చేపట్టాడు. ఇక ఇదే విషయంపై తాజాగా గంగూలీ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.
విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని మేము అస్సలు ఊహించలేదు. అప్పటికే మేము దక్షిణాఫ్రికా సిరీస్ కోల్పోయి బాధలో ఉన్నాము. అంతలోనే కోహ్లి ఇటువంటి నిర్ణయం తీసుకుని మమ్మల్ని షాక్‌కు గురిచేశాడు. అయితే టెస్టు కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకున్నాడో కోహ్లికే తెలియాలి. అది అతడి వ్యక్తిగత నిర్ణయం. కోహ్లి తప్పుకున్న తర్వాత భారత జట్టుకు ఓ కెప్టెన్ అవసరం వచ్చింది. ఆ సమయంలో రోహిత్ బెస్ట్ అనిపించాడు. అందుకే సెలక్షన్ కమిటీ రోహిత్ పగ్గాలు అప్పజెప్పింది అని ఆజ్ తక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు.
కాగా ఐపీఎల్ కారణంగానే టీమిండియా ఐసీసీ ఈవెంట్‌లో రాణించలేకపోతుంది అని పలువురు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూడా దాదా మాట్లాడుతూ.. ప్రపంచకప్ గెలవడం కంటే ఐపీఎల్ టైటిల్ గెలవడం చాలా కష్టం. 14 మ్యాచ్ ల తర్వాత ప్లేఆఫ్స్ చేరుకుంటారు. వరల్డ్ కప్‌లో నాలుగైదు మ్యాచ్ లలో గెలిస్తే సెమీస్ వెళ్తారు. ఐపీఎల్లో 17 మ్యాచ్ ల తర్వాత టైటిల్ గెలుస్తారు" అని గంగూలీ అన్నాడు.
చదవండి: LPL 2023: లంక ప్రీమియర్ లీగ్ ఆడనున్న సురేష్ రైనా.. ధర ఎంతంటే?
Comments
Please login to add a commentAdd a comment