T20 World Cup 2021: Virat Kohli Surprise Team India With Bowling Vs Aus - Sakshi
Sakshi News home page

T20 WC 2021 IND Vs AUS: రెస్ట్‌ అన్నారు.. బౌలింగ్‌తో సర్‌ప్రైజ్‌

Published Wed, Oct 20 2021 6:14 PM | Last Updated on Wed, Oct 20 2021 8:03 PM

T20 World Cup 2021: Virat Kohli Surprise Team India With Bowling Vs Aus - Sakshi

PC: ICC T20.Com

Virat Kohli Surprise Bowling Vs Aus.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియాకు విరాట్‌ కోహ్లి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి బరిలోకి దిగడం లేదని.. అతని స్థానంలో తాను కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నట్లు రోహిత్‌ శర్మ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు పేర్కొన్నాడు. అందుకు అనుగుణంగానే మ్యాచ్‌కు ప్రకటించిన తుది జట్టులో కోహ్లి పేరు లేదు. దీంతో కోహ్లి రెస్ట్‌ అని అంతా భావిస్తున్న సమయంలో సడెన్‌గా ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌లో కోహ్లి బౌలింగ్‌ వేసి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఏడో ఓవర్లో నాలుగు పరుగులు ఇచ్చిన కోహ్లి తర్వాత వేసిన 13వ ఓవర్లో 8 పరుగులు ఇచ్చాడు. మొత్తంగా మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసిన కోహ్లి 12 పరుగులిచ్చి వికెట్‌ తీయలేకపోయాడు. అయితే పార్ట్‌ టైం బౌలర్‌గా కోహ్లి బౌలింగ్‌ చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బౌలింగ్‌ చేయడంపై సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ మీమ్స్‌, ట్రోల్స్‌తో రెచ్చిపోయారు. 

చదవండి: T20 WC 2021: ఒమన్‌ బౌలర్‌ అద్బుతం.. సింగిల్‌ హ్యాండ్‌తో

ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5  వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌ 57 పరుగుల క్లాస్‌ ఇన్నింగ్స్‌తో మెరవగా.. ఆఖర్లో స్టోయినిస్‌ 25 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 41 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అంతకముందు మ్యాక్స్‌వెల్‌ 37 పరుగులతో రాణించాడు. టీమిండియా  బౌలర్లలో అశ్విన్‌ 2, రాహుల్‌ చహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జడేజా తలా ఒక వికెట్‌ తీశారు.

చదవండి: T20 WC 2021: మిచెల్‌ మార్ష్‌ గోల్డెన్‌ డక్‌.. కలిసిరాని పుట్టినరోజు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement