India Vs Australia: Virat Kohli Faces Off With Marcus Stoinis During 3rd ODI, Pics & Video Viral - Sakshi
Sakshi News home page

Kohli-Stoinis: అభిమానులను పిచ్చోళ్లను చేశారు

Published Thu, Mar 23 2023 9:00 AM | Last Updated on Thu, Mar 23 2023 1:06 PM

 Virat Kohli Faces Off With Marcus Stoinis IND Vs AUS 3rd ODI Viral - Sakshi

టీమిండియా స్టార్‌.. కింగ్‌ కోహ్లికి కోపమెక్కువన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అగ్రెసివ్‌నెస్‌తో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచాడు. అయితే అందులో చాలా భాగం ఫన్నీవేలోనే కోహ్లిని చూశాం. మ్యాచ్‌ జరిగేటప్పుడు తాను సీరియస్‌గా ఉండలేనని అందుకే కాస్త హ్యూమర్‌ జోడించి ఆడుతానంటూ గతంలో చాలాసార్లు పేర్కొన్నాడు. తాజాగా బుధవారం ఆసీసీతో జరిగిన మూడో వన్డేలో కోహ్లి చర్య ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

భారత్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా కోహ్లి, స్టోయినిస్‌ల మధ్య ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పిచ్‌ స్లో వికెట్‌కు అనుకూలిస్తుండడంతో స్టార్క్‌తో కలిసి మార్కస్‌ స్టోయినిస్‌ బంతిని పంచుకున్నాడు. ఇన్నింగ్స్‌ 21వ ఓవర్లో కేఎల్‌ రాహుల్‌, కోహ్లిలు క్రీజులో ఉన్నారు. బంతి వేసిన తర్వాత స్టోయినిస్‌ కోహ్లిని తన భుజాలతో నెట్టాడు. ఇది గమనించిన కోహ్లి స్టోయినిస్‌కు అడ్డంగా వచ్చి ఒక సీరియస్‌ లుక్‌ ఇచ్చాడు. కేవలం కళ్లతోనే ఒకరినొకరు కాసేపు చూసుకున్నారు.

ఆ తర్వాత స్టోయినిస్‌ చిన్నగా నవ్వడంతో అసలు విషయం అర్థమైంది. నిజానికి ఇద్దరి మధ్య గొడవ ఫన్నీగానే జరిగింది. ఇది తెలియని అభిమానులు అరె నిజంగానే ఇద్దరికి గొడవైనట్లుందే అన్నట్లుగా చూశారు. కానీ చివరికి కోహ్లి, స్టోయినిస్‌లు కలిసి అభిమానులను పిచ్చోళ్లను చేశారు.

ఇక మ్యాచ్‌లో కోహ్లి కీలక ఇన్నింగ్స్‌ ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు.  72 బంతుల్లో 54 పరుగులు చేసిన కోహ్లి వెనుదిరగ్గానే టీమిండియా ఓటమి దిశగా పయనించింది. ఆ తర్వాత హార్దిక్‌ పాండ్యా(40 పరుగులు), జడేజాలు స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో టీమిండియా ఓటమి ఖరారైపోయింది. మూడో వన్డేలో విజయంతో ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

చదవండి: సొంతగడ్డపై బెబ్బులే.. కానీ ఆసీస్‌కు మాత్రం దాసోహం

ఇలా అయితే వరల్డ్‌కప్‌ కొట్టేది ఎలా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement