
అదంతా ఒక గతం.. మేం చరిత్రను తిరగరాయబోతున్నాం
Babar Azam Confidence About Winning Match Vs India T20 WC.. టీమిండియా- పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కు ఇంకా రెండు రోజులే మిగిలి ఉండడంతో ఎవరు గెలుస్తారనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ అంటే హై వోల్టేజ్‌తో కూడుకొని ఉండడంతో భావోద్వేగాలు సహజంగానే బయటపడతాయి. మేం గెలుస్తామంటే మేం గెలుస్తామంటూ టీమిండియా- పాక్ అభిమానులు పోటీ పడి మరీ చెబుతున్నారు. ఇంత వేడి వాతావరణంలో జరగనున్న మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనేది హాట్‌టాఫిక్‌గా మారింది.
చదవండి: Sunil Gavaskar: టీమిండియా- పాకిస్తాన్ ఫైనల్లో తలపడితే చూడాలనుంది
ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ఈసారి కచ్చితంగా టీమిండియాపై విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. '' ఇండియాతో మ్యాచ్‌ను మేం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. రెండు జట్ల మధ్య అంటేనే పోటీ ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటివరకు టి20 ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడించలేదనేది వాస్తవం. కానీ అదంతా ఒక గతం.. మేం చరిత్రను తిరగరాయబోతున్నాం. అక్టోబర్ 24న జరగనున్న మ్యాచ్‌లో కచ్చితంగా విజయం మాదే అవుతుంది. అందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ప్రణాళికలు రచించుకున్నాం. ఒత్తిడిలో ఎలా ఆడాలన్నది మాకు బాగా అలవాటు అయింది. మ్యాచ్ మాత్రం కౌంటర్‌కు ఎన్‌కౌంటర్‌లా కొనసాగుతుంది. హై వోల్టేజ్‌తో సాగే మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు నియంత్రణ కోల్పోకూడదని ఆశిస్తున్నా. మ్యాచ్ జరగనున్న దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే మా దగ్గర ఉన్న అస్త్ర శ్రస్తాలతో టీమిండియాతో మ్యాచ్‌కు బరిలోకి దిగుతున్నాం. ఈసారి కచ్చితంగా విజయం మాదే అవుతుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: ఆ ఇద్దరు టీమిండియా క్రికెటర్ల నుంచే పాక్‌కు ముప్పు.. పాక్ బ్యాటింగ్ కోచ్
ఇక పాకిస్తాన్ ఇంతవరకు టి20 ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా టీమిండియాను ఓడించలేకపోయింది. పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్‌లో ఐదు సార్లు తలపడగా.. ఐదుసార్లు టీమిండియానే గెలిచింది. ఇక వన్డే ప్రపంచకప్‌లోనూ ఈ రికార్డు పదిలంగా ఉంది. వన్డే ప్రపంచకప్‌లలో టీమిండియా పాకిస్తాన్‌తో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం విశేషం.అయితే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఇరు జట్లు ఐదుసార్లు తలపడగా.. రెండు సార్లు టీమిండియా.. మూడుసార్లు పాకిస్తాన్ విజయం సాధించింది. అయితే బాబర్ అజమ్ కామెంట్స్‌పై టీమిండియా ఫ్యాన్స్ వినూత్నంగా ట్రోల్ చేశారు. '' మ్యాచ్‌కు ముందు ప్రతీ పాకిస్తాన్ కెప్టెన్ చెప్పే మాట ఇదే.. ఈసారి కూడా గెలుపు టీమిండియాదే.. మ్యాచ్ గెలిచి ఈ మాట చెప్పు బాబర్.. ఈసారి కూడా చరిత్ర రిపీట్ అవుతుంది.. నీ అంచనా తప్పవుతుంది.'' అంటూ కామెంట్స్ చేశారు.
చదవండి: Virat Kohli: సండే బిగ్ మ్యాచ్.. మీరు ఒత్తిడిలో? మరి నా పరిస్థితి!