పాక్‌తో మ్యాచ్‌.. అసలు సమరానికి ముందు మంచి బూస్టప్‌ | T20 World Cup 2021: Fans Praise Team India Practice Ahead Pakistan Clash | Sakshi
Sakshi News home page

T20 WC 2021 IND Vs PAK: పాక్‌తో మ్యాచ్‌.. అసలు సమరానికి ముందు మంచి బూస్టప్‌

Published Wed, Oct 20 2021 7:24 PM | Last Updated on Thu, Oct 21 2021 9:59 AM

T20 World Cup 2021: Fans Praise Team India Practice Ahead Pakistan Clash - Sakshi

Team India Boost Up Ahead Pakistan Match.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా టీమిండియా ఆడిన రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లోనూ ఇరగదీసింది. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన టీమిండియా అక్టోబర్‌ 24న పాకిస్తాన్‌తో అసలు సమరానికి మంచి బూస్టప్‌ సంపాదించుకుంది. అంతేగాక పాక్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌కు ముందు టీమిండియాకు మంచి ప్రాక్టీస్‌ లభించినట్లయింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు అందుకున్న టీమిండియా మంచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది.

చదవండి: T20 WC 2021 IND Vs AUS: రోహిత్‌ మెరుపులు.. ఆసీస్‌పై టీమిండియా ఘన విజయం

ఓపెనింగ్‌ స్లాట్‌లో రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ సూపర్‌ సక్సెస్‌ అందుకోవడం.. వన్‌డౌన్‌లో కోహ్లి, ఇషాన్‌ కిషన్‌.. తాజాగా సూర్యకుమార్‌ యాదవ్‌ నిలకడ చూపించడం టీమిండియాకు శుభపరిణామం. అయితే ఈ మ్యాచ్‌ హార్దిక్‌ పాండ్యాకు కీలకమని ముందు నుంచి బెబుతూనే వస్తున్నాం. అందుకు అనుగుణంగా విజయానికి 20 పరుగుల దూరంలో రోహిత్‌ శర్మ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇక హార్దిక్‌ పాండ్యా  సిక్స్ కొట్టి మ్యాచ్‌ను తన స్టైల్లో ముగించి తాను ఫామ్‌లోనే ఉన్నానని చెప్పకనే చెప్పాడు. అయితే హార్దిక్‌ బౌలింగ్‌కు దిగకపోవడంపై మాత్రం ఫ్యాన్స్‌ నిరుత్సాహం వ్యక్తం చేశారు.

చదవండి: T20 WC 2021 IND Vs AUS: రెస్ట్‌ అన్నారు.. బౌలింగ్‌తో సర్‌ప్రైజ్‌

ఇక బౌలింగ్‌ విభాగంలో అశ్విన్‌(2-0-8-2) తన సూపర్‌ ఫామ్‌ను కంటిన్యూ చేయడం టీమిండియాకు మేలు చేయనుంది. అయితే భువనేశ్వర్‌ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీసి ఫామ్‌లోకి వచ్చినట్లే అనిపిస్తున్నాడు. ఇక ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో షమీ బౌలింగ్‌లో మూడు వికెట్లతో మెరవగా.. బుమ్రా వికెట్లు తీయకపోయినప్పటికీ నిలకడ చూపించాడు. ఓవరాల్‌గా చూసుకుంటే టీమిండియా ప్రస్తుతం అన్ని విభాగాల్లోనూ బలోపేతంగా కనిపిస్తుంది. మరోవైపు అభిమానులు కూడా పాకిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి ఐసీసీ టోర్నీ మ్యాచ్‌ల రికార్డును పదిలంగా ఉంచుకుంటుందని భావిస్తున్నారు. ఇక అక్టోబర్‌ 24న పాకిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా ఏ విధంగా ఆడనుందో వేచిచూడాలి.  

చదవండి: T20 WC 2021: మిచెల్‌ మార్ష్‌ గోల్డెన్‌ డక్‌.. కలిసిరాని పుట్టినరోజు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement