10 వికెట్ల తేడాతో టీమిండియాపై పాకిస్తాన్ ఘన విజయం
టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘన విజయాన్ని అందుకుంది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు బాబర్ అజమ్(68 పరుగులు, 52 బంతులు; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మహ్మద్ రిజ్వాన్( 79 పరుగులు, 55 బంతులు; 6 ఫోర్లు, 3 సిక్సర్లు)లు కలిసి తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 152 పరుగులు కొట్టి పాకిస్తాన్‌కు ఘన విజయాన్ని అందించారు.
అంతకముందు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత కోహ్లి, పంత్ కలసి టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. కెప్టెన్ కోహ్లి(49 బంతుల్లో 57 పరుగులు, 5 ఫోర్లు, ఒక సిక్స్), పంత్( 30 బంతుల్లో 39 పరుగులు, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 3, హసన్ అలీ 2, షాబాద్ ఖాన్, హరిస్ రౌత్ 1 చెరో వికెట్ తీశారు.
ఓటమి దిశగా టీమిండియా.. పాకి్ విజయానికి 25 పరుగులు
టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం దిశగా సాగుతుంది. టీమిండియా బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పాక్ ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ అజమ్‌లు చెలరేగి ఆడుతున్నారు. ప్రతీ ఓవర్‌లో కనీసం బౌండరీ ఉండేలా చూసుకున్న ఈ జంట తొలి వికెట్‌కు ఇప్పటికే 125 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. ప్రస్తుతం 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 128 పరుగులు చేసింది. పాకి విజయానికి 24 బంతుల్లో 25 పరుగులు కావాలి
బాబర్ అజమ్ ఫిప్టీ.. విజయానికి 52 పరుగుల దూరంలో
టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ అర్థ సెంచరీతో మెరిశాడు. 41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం 14 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 112 పరుగులు చేసింది. అజమ్ 61, రిజ్వాన్ 48 పరుగులతో ఆడుతున్నారు.
12 ఓవర్లలో పాకిస్తాన్ 85/0
టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓపెనర్లు దూకుడు కనబరుస్తున్నారు. బాబర్ అజమ్, రిజ్వాన్‌లు పోటీపడి మరీ పరుగులు తీస్తున్నారు. 12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 85 పరుగులు చేసింది. రిజ్వాన్ 38, బాబర్ అజమ్ 44 పరుగులతో ఆడుతున్నారు.
152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. రిజ్వాన్ 29, బాబర్ అజమ్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లు వికెట్ తీయడానికి నానా కష్టాలు పడుతున్నారు. అంతకముందు టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
సమయం: 9:23.. టీమిండియా 151/7.. పాకిస్తాన్ టార్గెట్ 152
టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత కోహ్లి, పంత్ కలసి టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. కెప్టెన్ కోహ్లి(49 బంతుల్లో 57 పరుగులు, 5 ఫోర్లు, ఒక సిక్స్), పంత్( 30 బంతుల్లో 39 పరుగులు, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 3, హసన్ అలీ 2, షాబాద్ ఖాన్, హరిస్ రౌత్ 1 చెరో వికెట్ తీశారు.
సమయం: 9:08 PM.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(57) షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో కీపర్ రిజ్వాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. పాండ్యా 9, భువనేశ్వర్ కుమార్ 1 పరుగుతో ఆడుతున్నారు.
సమయం: 9:04 PM .. పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీతో మెరిశాడు. 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో కోహ్లి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కాగా రవీంద్ర జడేజా(13) హసన్ అలీ బౌలింగ్‌లో వెనుదిరగడంతో 125 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.
సమయం: 8: 57 PM.. 17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. కోహ్లి 48, జడేజా 9 పరుగులతో ఆడుతున్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా.. పంత్(39) ఔట్
నిలకడగా ఆడుతున్న రిషబ్ పంత్(30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అనవసరపు షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
దీంతో 84 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 13 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 87/4. క్రీజ్‌లో కోహ్లి(30 బంతుల్లో 30; ఫోర్, సిక్స్), జడేజా(1) ఉన్నారు.
10 ఓవర్లలో టీమిండియా 3 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. కోహ్లి 26, పంత్ 18 పరుగులతో ఆడుతున్నారు.
సమయం: 8.10 PM
►సూర్యకుమార్(11) రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. హసన్ అలీ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 5వ ఓవర్ నాలుగో బంతికి కీపర్ రిజ్వాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 6 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. కోహ్లి 20, పంత్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
కోహ్లి, సూర్యకుమార్ దూకుడు.. ఫుంజుకున్న టీమిండియా
పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. క్రీజులో ఉన్న కోహ్లి, సూర్యకుమార్‌లు బౌండరీలు బాదడంతో స్కోరులో వేగం పెరిగింది. 5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. కోహ్లి 15, సూర్య 11 పరుగులతో ఆడుతున్నారు.
అఫ్రిది దెబ్బ.. కేఎల్ రాహుల్ క్లీన్‌బౌల్డ్
షాహిన్ అఫ్రిది టీమిండియాను వరుస ఓవర్లలో దెబ్బతీశాడు. మొదటి ఓవర్‌లో రోహిత్‌ను వెనక్కి పంపిన అఫ్రిది తన రెండో ఓవర్ తొలి బంతికే కేఎల్ రాహుల్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం 3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 9 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ గోల్డెన్ డక్.. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో గోల్డెన్ డక్ అయ్యాడు. దీంతో 1 పరుగుకే వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం రెండు ఓవర్లలో వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 3, కోహ్లి 3 పరుగులతో ఆడుతున్నారు.
దుబాయ్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. క్రికెట్ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమరంతో దాయాది జట్లు తమ టి20 వరల్డ్‌కప్ వేటను మొదలు పెట్టబోతున్నాయి. ఎన్ని మారినా ఇరు జట్ల మధ్య సమరాల్లో తుది ఫలితం మాత్రం మారలేదు. టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో ఐదుసార్లు తలపడగా ప్రతీసారి భారత్‌నే విజయం వరించింది. వన్డే వరల్డ్‌కప్‌ను కూడా కలుపుకుంటే 12–0తో టీమిండియా తిరుగులేని ప్రదర్శన కనబర్చింది.
టీమిండియా : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా
పాకిస్తాన్ : బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హారిస్ రౌఫ్, షాహిన్ అఫ్రిది
గత కొంత కాలంగా టీమ్ ఫామ్, స్టార్ ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే కచ్చితంగా మనదే పైచేయిగా కనిపిస్తోంది. ఇటీవల ఐపీఎల్ ఆడిన అనుభవంతో యూఏఈ పిచ్‌లపై కూడా అంచనా రావడం మరో సానుకూలాంశం. ‘సొంతగడ్డ’లాంటి వేదికపై ఆడుతున్న పాక్ పని పట్టి స్కోరును 13–0గా మార్చాలని ప్రతీ భారత అభిమాని కోరుకుంటుండగా... ధనాధన్ ప్రదర్శనతో ‘సూపర్ సన్‌డే’ అందరికీ ‘ఫన్‌డే’ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment