Pakistan Break Team India Record 12-1 T20 WC 2021.. టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ టీమిండియాపై తొలిసారి విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు ఇరుజట్లు ఐదుసార్లు తలపడగా.. అన్నింటిలో టీమిండియానే గెలిచింది. తాజాగా టి20 ప్రపంచకప్ 2021లో మాత్రం పాకిస్తాన్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. టీమిండియా బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పాక్ ఓపెనర్లిద్దరే టార్గెట్‌ను చేధించడం విశేషం. ఓపెనర్లు బాబర్ అజమ్, మహ్మద్ రిజ్వాన్ ఆటతీరు చూస్తే ఇంత కసి దాగుందా అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు బాబర్ అజమ్(68 పరుగులు, 52 బంతులు; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మహ్మద్ రిజ్వాన్‌లు( 79 పరుగులు, 55 బంతులు; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఊదిపారేశారు.
చదవండి: IND Vs PAK: కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసిన కోహ్లి.. ఆ రికార్డులో ఫెయిలయ్యాడు
ఇక ఐసీసీ మేజర్ టోర్నీల్లో పాకిస్తాన్‌పై టీమిండియాకు ఘనమైన రికార్డు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్, టి20 ప్రపంచకప్ కలిపి 12-0తో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. తాజాగా పాకిస్తాన్ టీమిండియాపై అద్బుత విజయంతో తొలిసారి ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 12-1 తో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment