
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న కోహ్లి భారీ స్కోర్లు మాత్రం చేయలేకపోతున్నాడు. అంతకముందు వన్డే సిరీస్‌లో వరుస సెంచరీలతో దుమ్మురేపిన కోహ్లి టెస్టు సిరీస్‌కు వచ్చేసరికి మాత్రం మాములు బ్యాటర్‌గా మారిపోయాడు.
ఇక ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మూడు టెస్టుల్లో పిచ్ బౌలింగ్‌కే ఎక్కువగా అనుకూలించడంతో కోహ్లిని కూడా తప్పుబట్టడానికి లేదు. అయితే అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మాత్రం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. అసలు ఏ మాత్రం బౌన్స్, స్పిన్‌కు అనుకూలించని పిచ్‌పై బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కోహ్లి కనీసం నాలుగో టెస్టులోనైనా సెంచరీ మార్క్ అందుకుంటాడని సగటు అభిమాని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే నాలుగో టెస్టు రెండోరోజు ఆట ముగిసిన తర్వాత కోహ్లి ప్యాడ్లు కట్టుకొని గ్రౌండ్‌లోకి వచ్చాడు. చాలాసేపు సీరియస్‌గా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక మూడో రోజు ఆటతో టీమిండియా భవితవ్యం తేలనుంది.
పిచ్‌పై ఎలాంటి బౌన్స్ లేకుంటే మాత్రం మ్యాచ్ నుంచి ఫలితం వచ్చే అవకాశం లేదు. అలా కాకుండా బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై టీమిండియా బ్యాటర్లు విఫలమైతే మాత్రం ఆసీస్ ఈ టెస్టును గెలవడం గ్యారంటీ. ఒకవేళ టీమిండియా బ్యాటర్లు కూడా సమర్థంగా ఆడితే మ్యాచ్ డ్రా అవడం ఖాయం.
King at work 🥳 pic.twitter.com/yCSSlz9YhB
— Sunil (@Hitting_Middle) March 10, 2023
చదవండి: 'బ్యాటర్‌గా విఫలం.. ఓటములకు పూర్తి బాధ్యత నాదే'
41 బంతుల్లోనే శతకం.. అతిపెద్ద టార్గెట్‌ను చేధించి ప్లేఆఫ్స్‌కు
Comments
Please login to add a commentAdd a comment