రోజుకు రెండు విడతలుగా టీఆర్టీ | Govt released teacher recruitment bulletin | Sakshi
Sakshi News home page

రోజుకు రెండు విడతలుగా టీఆర్టీ

Published Thu, Sep 21 2023 3:07 AM | Last Updated on Thu, Sep 21 2023 12:44 PM

Govt released teacher recruitment bulletin - Sakshi

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన పరీక్షల పూర్తి షెడ్యూల్‌ విడుదలైంది. ప్రభుత్వం మొత్తంగా 5,089 పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే నోటిఫికేషన్‌ ఇవ్వగా.. తాజాగా రాత పరీక్ష, నియామక విధి విధానాల సమగ్ర వివరాలతో బులెటిన్‌ జారీ చేసింది. నవంబర్‌ 20వ తేదీ నుంచి రోజూ రెండు సెషన్లలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) ఉంటుందని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.

ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్‌.. మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్‌ ఉంటుందని తెలిపింది. పూర్తి ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. అభ్యర్థులు ఇచ్చే ఆప్షన్లను బట్టి పరీక్ష కేంద్రాల కేటాయింపు ఉంటుందని వెల్లడించింది.      –సాక్షి, హైదరాబాద్‌

ఒక్కో ప్రశ్నకు అర మార్కు 
స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ), సెకండరీ గ్రేడ్‌ టీచ­ర్స్‌ (ఎస్జీటీ) పోస్టులకోసం నిర్వహిస్తున్న ఈ పరీక్షల్లో 160 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోదానికి అర మార్కు ఉంటుంది. టీఆర్టీ నియామకాల్లో టెట్‌ మా­ర్కులకు వెయిటేజీ ఉంటుంది. అంటే 80శాతం మా­ర్కులను రాత పరీక్ష నుంచి, 20 శాతం మార్కులను టెట్‌ నుంచి కలిపి తుది మార్కులను నిర్ణయిస్తారు. 

ఇక ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పోస్టులకు సంబంధించి­న పరీక్షలో వంద మార్కులకు 200 ప్రశ్నలుంటాయి. 
♦ ఎస్జీటీలకు ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు.. మిగతా పోస్టులకు ఇంటర్మిడియేట్‌ వరకు రాష్ట్ర సిలబస్‌ నుంచి ప్రశ్నలిస్తారు. 
 దివ్యాంగులకు గతంలో 75శాతంపైగా వైకల్యం ఉండాలనే నిబంధన ఉండగా.. దీనిని 40శాతానికి తగ్గించారు.  

పరీక్ష కేంద్రాలు ఇవీ..
అభ్యర్థులు అక్టోబర్‌ 20వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి, రూ.వెయ్యి పరీక్ష ఫీజుగా చెల్లించాలి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్,వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి జిల్లా­ల్లో ఆన్‌లైన్‌ పరీక్షా కేంద్రాలు ఉంటాయి. పరీక్ష కేంద్రా­­లకు అభ్యర్థులుఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఆప్షన్లను బట్టి అభ్యర్థులకు పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తారు. 

పోస్టుల వారీగా అర్హతలివీ.. 
♦ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అభ్యర్థులు కనీ­సం 50శాతం మార్కులతో పీజీ లేదా డిగ్రీతో­పాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి. (రిజర్వేషన్‌ కేటగిరీల వారు 45శాతం మార్కులతో ఉత్తీర్ణులై­తే చాలు).ఏ సబ్జెక్టు పోస్టుకు దరఖాస్తు చే­స్తున్నారో, సంబంధిత సబ్జెక్టును డిగ్రీలో చదివి ఉండాలి. 
♦  లాంగ్వేజ్‌ పండిట్లు సంబంధిత భాషలో డిగ్రీ, బీఈడీ చేసి ఉండాలి. 
♦ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పోస్టులకు దరఖాస్తు చేసేవా­రు ఇంటర్‌లో కనీసం 50% (రిజర్వేషన్‌ వా­రికి 45%) మార్కులు పొంది.. డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ చేసి ఉండాలి. డిగ్రీతోపాటు బీపీఈడీ చేసిన వారు కూడా దీనికి అర్హులే. 
♦ అన్ని పోస్టులకు అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.ఆయ వర్గాల రిజర్వేషన్ల మే­Æ­ý‡­కు మినహాయింపులు వర్తిస్తాయి. 

పరీక్షలు, సిలబస్‌ తీరు ఇదీ.. 
♦  స్కూల్‌ అసిస్టెంట్, భాషా పండితులకు 160 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు అరమార్కు చొప్పు­న 80 మార్కులుంటాయి. జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్, విద్యలో పురోగతి, టీచింగ్‌ మెథడ్‌ నుంచి వివిధ అంశాలతో ప్రశ్నలుంటాయి. 
♦  ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలో 200 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి అర మార్కు చొప్పున వంద మార్కులు ఉంటాయి. ఇందులో జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ ఇంగ్లి‹Ùతోపాటు క్రీడా విద్యకు సంబంధించి వివిధ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. 
♦  ఎస్జీటీలకు 160 ప్రశ్నలుంటాయి. ఒక్కో దానికి అరమార్కు చొప్పున 80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. వివిధ సబ్జెక్టులు, టీచింగ్‌ విధానాలు, జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్‌ నుంచి ప్రశ్నలుంటాయి. ఇవి 8వ తరగతి వరకూ ఉండే సిలబస్‌ నుంచి ఇస్తారు. 
♦  పరీక్షలో కనీసం ఓసీలు 90 మార్కులు, బీసీలు 75, ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు 60 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులైనట్టుగా భావిస్తారు. అభ్యర్థులు సాధించే మార్కులు, రోస్టర్‌ను అనుసరించి ఒక్కో పోస్టుకు ముగ్గురి చొప్పున ఎంపిక చేస్తారు. వారి నుంచి డీఎస్సీ ఒకరిని ఎంపిక చేస్తుంది.

ఎవరికి ఎప్పుడు పరీక్ష? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement