Teacher appointments
-
విద్యకు ‘నూతన’ జవసత్వాలు!
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరంలో విద్యా రంగం వినూత్న జవసత్వాలను సంతరించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గణనీయ మార్పులు, కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖపై జరిపిన సమీక్ష తర్వాత రాష్ట్రంలో మార్పులపై సంకేతాలు వస్తున్నాయి. ప్రాథమిక విద్య మొదలుకొని విశ్వవిద్యాలయ స్థాయి వరకు కొత్త అడుగులు పడవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు జాతీయ స్థాయిలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) వంటి సంస్థలు కూడా ఈ ఏడాది కీలక సంస్కరణల అమలుకోసం సిద్ధమవుతున్నాయి. ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై ఆశలు రాష్ట్రంలో 26 వేలకుపైగా ప్రభుత్వ బడులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 12 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్లకు పదోన్నతులు కలి్పస్తే మరో 10 వేల వరకు పోస్టులు అందుబాటులోకి వస్తాయి. మొత్తంగా 22 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉండనుంది. గత ఏడాది 5 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి కార్యాచరణ చేపట్టినా అడుగు ముందుకు పడలేదు. అయితే త్వరలో మెగా డీఎస్సీ చేపడతామని రాష్ట్ర సర్కారు ప్రకటించడం విద్యాశాఖలో ఆశలు రేపుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కేవలం ఏడు జిల్లాల్లోనే పర్యవేక్షణ అధికారులు ఉన్నారు. దీంతో విద్యలో నాణ్యత తగ్గిందన్న ఆరోపణలున్నాయి. మరోవైపు పదోన్నతులు, బదిలీలు కూడా చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం టీచర్లలో హర్షం వ్యక్తమవుతోంది. కాలేజీ విద్యకూ మంచి రోజులు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో 2,400 బోధన సిబ్బంది పోస్టుల భర్తీ కోసం గత ఏడాది ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. కానీ రోస్టర్ పాయింట్ విషయంలో న్యాయపరమైన ఇబ్బందితో భర్తీ ప్రక్రియ ముందుకు కదల్లేదు. నిజానికి రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో రెగ్యులర్ అధ్యాపకులు 1,200 మందే ఉన్నారు. 4,007 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. జూనియర్ కాలేజీల్లో 6,008 పోస్టులుంటే.. 4 వేలకుపైగా ఖాళీలు ఉన్నాయి. వీటన్నింటినీ భర్తీ చేసేందుకు అవసరమైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో.. కొత్త ఏడాదిలో కాలేజీ విద్యకు మంచిరోజులు వచ్చినట్టేనని అంటున్నారు. ఇక రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 3 వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఉన్నత విద్యా మండలి, విశ్వవిద్యాలయాల ప్రక్షాళన, సమన్వయ పాలన వ్యవహారాలపై సర్కారు దృష్టి పెట్టిందని.. ఇవన్నీ 2024 ఏడాదిలో కీలక పరిణామాలకు దారి తీయవచ్చని అంటున్నారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేలా.. ఫిబ్రవరిలో ఇంటర్, మార్చిలో టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. గతంలో పేపర్ లీకులు, ఇంటర్ ఫలితాలపై విద్యార్థుల ఆందోళన వంటివి చోటు చేసుకున్నాయి. దీంతో ఈసారి ప్రభుత్వం పరీక్షలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం, విద్యార్థులను ముందు నుంచే సన్నద్ధం చేస్తూ భయం పోగొట్టడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు అధికారులు చెప్తున్నారు. మారుతున్న సిలబస్.. ఈ ఏడాది నుంచి పాలిటెక్నిక్ సిలబస్ మారనుంది. విదేశాల్లోని డిప్లొమా చదువులకు అమలు చేస్తున్న పాఠ్య ప్రణాళికను ఆధారంగా చేసుకుని కొత్త ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ఒక్కో డిప్లొమా బ్రాంచీకి ఒక్కో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సింగపూర్, చైనా దేశాల్లోని సిలబస్‌లను ఈ కమిటీలు పరిశీలిస్తాయి. పాలిటెక్నిక్ విద్యలో ఇంటర్న్‌షిప్, ఆన్లైన్ మూల్యాంకనం, ఓపెన్ బుక్ విధానం వంటి సంస్కరణలు తీసుకొచ్చే అవకాశం ఉంది. మరిన్ని డీమ్డ్ వర్సిటీలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఈ ఏడాది కీలక మార్పులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. డీమ్డ్, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు నిబంధనలను మరింత సరళతరం చేస్తోంది. ఇప్పటికే సంబంధిత ముసాయిదాపై అన్ని వర్గాల ఆమో దం తీసుకున్నారు. మూడేళ్లు వరుసగా న్యాక్ ఏ ప్లస్‌తోపాటు గ్రేడ్‌లో నాలుగు పాయింట్లకుగాను కనీసం 3.4 పాయింట్లు సాధించిన కాలేజీలకు డీమ్డ్ హోదా ఇవ్వాలని యూజీసీ నిర్ణయించింది. దీనిని బట్టి తెలంగాణలో పది కాలేజీలకు డీమ్డ్ హోదా లభించే వీలుంది. మరోవైపు విదేశీ విద్యాలయాలు మన దేశంలో బ్రాంచీల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయి. వాటికి యూజీసీ, సాంకేతిక విద్యా మండలి సూత్రప్రాయ అంగీకారం తెలిపాయి. విదేశీ యూనివర్సిటీల రాకతో విద్యా బోధనలో మార్పు రావొచ్చని నిపుణులు చెప్తున్నారు. -
రోజుకు రెండు విడతలుగా టీఆర్టీ
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ప్రభుత్వం మొత్తంగా 5,089 పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ ఇవ్వగా.. తాజాగా రాత పరీక్ష, నియామక విధి విధానాల సమగ్ర వివరాలతో బులెటిన్ జారీ చేసింది. నవంబర్ 20వ తేదీ నుంచి రోజూ రెండు సెషన్లలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) ఉంటుందని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్.. మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని తెలిపింది. పూర్తి ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. అభ్యర్థులు ఇచ్చే ఆప్షన్లను బట్టి పరీక్ష కేంద్రాల కేటాయింపు ఉంటుందని వెల్లడించింది. –సాక్షి, హైదరాబాద్ ఒక్కో ప్రశ్నకు అర మార్కు స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) పోస్టులకోసం నిర్వహిస్తున్న ఈ పరీక్షల్లో 160 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోదానికి అర మార్కు ఉంటుంది. టీఆర్టీ నియామకాల్లో టెట్ మార్కులకు వెయిటేజీ ఉంటుంది. అంటే 80శాతం మార్కులను రాత పరీక్ష నుంచి, 20 శాతం మార్కులను టెట్ నుంచి కలిపి తుది మార్కులను నిర్ణయిస్తారు. ♦ ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధించిన పరీక్షలో వంద మార్కులకు 200 ప్రశ్నలుంటాయి. ♦ ఎస్జీటీలకు ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు.. మిగతా పోస్టులకు ఇంటర్మిడియేట్ వరకు రాష్ట్ర సిలబస్ నుంచి ప్రశ్నలిస్తారు. ♦ దివ్యాంగులకు గతంలో 75శాతంపైగా వైకల్యం ఉండాలనే నిబంధన ఉండగా.. దీనిని 40శాతానికి తగ్గించారు. పరీక్ష కేంద్రాలు ఇవీ.. అభ్యర్థులు అక్టోబర్ 20వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి, రూ.వెయ్యి పరీక్ష ఫీజుగా చెల్లించాలి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్,వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల్లో ఆన్లైన్ పరీక్షా కేంద్రాలు ఉంటాయి. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులుఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఆప్షన్లను బట్టి అభ్యర్థులకు పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తారు. పోస్టుల వారీగా అర్హతలివీ.. ♦ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థులు కనీసం 50శాతం మార్కులతో పీజీ లేదా డిగ్రీతోపాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి. (రిజర్వేషన్ కేటగిరీల వారు 45శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే చాలు).ఏ సబ్జెక్టు పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారో, సంబంధిత సబ్జెక్టును డిగ్రీలో చదివి ఉండాలి. ♦ లాంగ్వేజ్ పండిట్లు సంబంధిత భాషలో డిగ్రీ, బీఈడీ చేసి ఉండాలి. ♦ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఇంటర్లో కనీసం 50% (రిజర్వేషన్ వారికి 45%) మార్కులు పొంది.. డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. డిగ్రీతోపాటు బీపీఈడీ చేసిన వారు కూడా దీనికి అర్హులే. ♦ అన్ని పోస్టులకు అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.ఆయ వర్గాల రిజర్వేషన్ల మేÆý‡కు మినహాయింపులు వర్తిస్తాయి. పరీక్షలు, సిలబస్ తీరు ఇదీ.. ♦ స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులకు 160 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు అరమార్కు చొప్పున 80 మార్కులుంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, విద్యలో పురోగతి, టీచింగ్ మెథడ్ నుంచి వివిధ అంశాలతో ప్రశ్నలుంటాయి. ♦ ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్షలో 200 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి అర మార్కు చొప్పున వంద మార్కులు ఉంటాయి. ఇందులో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంగ్లి‹Ùతోపాటు క్రీడా విద్యకు సంబంధించి వివిధ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ♦ ఎస్జీటీలకు 160 ప్రశ్నలుంటాయి. ఒక్కో దానికి అరమార్కు చొప్పున 80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. వివిధ సబ్జెక్టులు, టీచింగ్ విధానాలు, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలుంటాయి. ఇవి 8వ తరగతి వరకూ ఉండే సిలబస్ నుంచి ఇస్తారు. ♦ పరీక్షలో కనీసం ఓసీలు 90 మార్కులు, బీసీలు 75, ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు 60 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులైనట్టుగా భావిస్తారు. అభ్యర్థులు సాధించే మార్కులు, రోస్టర్‌ను అనుసరించి ఒక్కో పోస్టుకు ముగ్గురి చొప్పున ఎంపిక చేస్తారు. వారి నుంచి డీఎస్సీ ఒకరిని ఎంపిక చేస్తుంది. ఎవరికి ఎప్పుడు పరీక్ష? -
టీచర్ పోస్టులకు బ్రేక్.. ప్రభుత్వం సవాల్
లక్నో: ప్రైమరీ టీచర్ల నియామకాలు ఆపాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. టీచర్ల నియామకాల్లో నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఆ రాష్ట్ర ఎగ్జామినేషన్ రెగ్యులారిటీ అథారిటీ స్పష్టం చేసింది. ఈమేరకు ఇద్దరు జడ్జిల డివిజన్ బెంచ్‌లో సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేసింది. సింగిల్ జడ్జి తీర్పు అనవసర, చట్టవిరుద్ధమైందని పిటిషన్లో పేర్కొంది. కాగా, రాష్ట్రంలో ఇటీవల 69 వేల ప్రైమరీ టీచర్ పోస్టుల నియామకాలకు పరీక్షలు జరిగాయి. అయితే, ప్రశ్నాపత్రాల్లో తప్పులు దొర్లాయని, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అస్పష్టంగా ఉన్నాయనే కారణాలతో.. నియామక ప్రక్రియను నిలుపుదల చేయాలని జస్టిస్ అలోక్ మాథుర్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ జూన్ 3న ఉత్తర్వులు జారీ చేసింది. ఇక యూపీ ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను జూన్ 9న డివిజనల్ బెంచ్ విచారించనుంది. -
టీఆర్టీ ఫలితాల్లో గందరగోళం
జనగామ అర్బన్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన టీఆర్టీ ఫలితాలు వివిధ జిల్లాల్లోని స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలను చూసిన అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌పై సంబంధం లేని వివరాలు ఉండడంతో కంగుతింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఎంతోకాలం కష్టపడి పరీక్షకు ప్రిపేర్ అయితే టీఎస్పీఎస్సీ అధికారులు తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. సాంకేతిక తప్పిదం జరిగిందంటూ అధికారులు నిరుద్యోగులను మరోమారు మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పరీక్ష రాసిన తర్వాత తాము చూసుకున్న ఫైనల్ కీ మార్కులకు ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలకు వ్యత్యాసం ఉండడం కూడా పలు అనుమానాలకు తావిస్తోందని వారు వాపోతున్నారు. ఫలితాల్లో తప్పులు.. ♦ జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఎన్.సాయిబాబు బీసీ బీ కులానికి చెందిన పురుషుడు. ఈయనకు ఫైనల్ కీలో 58 మార్కులు వచ్చాయి. కాగా, ఫలితాల్లో మాత్రం ఎస్సీ కేటగిరీగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళగా చూపించి 54 మార్కులు ఉన్నట్లు ప్రకటించారు. ♦ వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన సీహెచ్.కల్యాణి బీసీ బీ మహిళ. ఈమెకు బీసీ డీ పురుషుడిగా, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినట్లు ఫలితాల్లో ఉంది. ♦మహబూబ్‌నగర్‌కు చెందిన జె.రమేష్ బీసీ బీ పురుషుడు. ఈయనను నల్లగొండ జిల్లా బీసీ డీ అభ్యర్థిగా ఫలితాల్లో ప్రకటించారు. ఇదే జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులకు సైతం ఫలితాలు తారుమారు వచ్చాయని ఆందోళన చెందుతున్నారు. ♦ ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్టీ మహిళ అభ్యర్థి అయితే రంగారెడ్డి జిల్లా బీసీ డీ అని ఉంది. ♦ మారుతీరెడ్డి కరీంనగర్ జిల్లా ఓసీ అభ్యర్థిగా పరీక్షకు హాజరుకాగా, ప్రకటించిన ఫలితాల్లో బీసీ డీ, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అభ్యర్థిగా ప్రకటించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం టీఎస్పీఎస్సీ ప్రకటించిన ఫలితాలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. చాలా కాలం పాటు కష్టపడి చదివి పరీక్ష రాస్తే ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ అధికారులు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం సరికాదు. ఫలితాలు సైతం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. –నోముల సాయిబాబు, జనగామ జిల్లా -
వర్సిటీలకు అధ్యాపక నియామక మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో అధ్యాపక నియామకాలపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. పోస్టుల భర్తీకి అవసరమైన మార్గదర్శకాలకు సంబంధించిన ఉత్తర్వులను ఇటీవల జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా వాటిని ఆయా వర్సిటీలకు పంపింది. వర్సిటీల వైస్ చాన్స్లర్ల కమిటీ ఇచ్చిన సిఫార్సులను యథాతథంగా ఆమోదించింది. యూనివర్సిటీ గ్రాం ట్స్ కమిషన్ నిబంధనల మేరకే భర్తీ చేయాలని పేర్కొంది. యూనివర్సిటీల్లో మొత్తం 1,551 పోస్టులు ఖాళీ ఉండగా, తొలి విడతలో 1,061 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కేటగిరీ, సబ్జెక్టుల వారీగా 1,061పోస్టుల భర్తీని ప్రభుత్వం గతంలోనే ఆమోదించింది. తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వర్సిటీలు డ్రాఫ్ట్ నిబంధనలను రూపొందించే పనిలోపడ్డాయి. ఇది పూర్తి కాగానే వర్సిటీల ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాల్లో వీటి భర్తీకి ఆమోదం తెలుపుతాయి. పోస్టుల వారీగా రోస్టర్ పాయింట్లపై పలు సంక్షేమ శాఖల ఆమోదం తీసుకోవాల్సి ఉంది. ఇదంతా పూర్త య్యాక ప్రభుత్వ ఆమోదం తీసుకొని వర్సిటీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనుంది. అయితే ఇది పూర్తయ్యేందుకు దాదాపు 2 నెలలు పట్టే అవకాశం ఉంది. ఇవీ ప్రధాన నిబంధనలు.. - పోస్టుల భర్తీకి యూనివర్సిటీల వారీగా వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేస్తారు. ఇవి జాతీయ స్థాయి నోటిఫికేషన్లుగానే ఉంటాయి. - భర్తీ ప్రక్రియలో స్క్రీనింగ్ టెస్టు ఉండదు. అన్ని వర్సిటీలకు ఒకే రకమైన పరీక్ష విధానం ఉంటుంది. - సబ్జెక్టును బట్టి పరీక్ష అంశాల్లో మార్పు ఉంటుంది. విధానంలో ఏ మార్పు ఉండదు. అలాగే వేర్వేరు తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. -
ప్రతిభ సరే.. భవిత చెప్పరే..?
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ నియామకాలకు మెరిట్ జాబితా విడుదలైనా పూర్తి ఫలితం కోసం అభ్యర్థుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 5వ తేదీన ఎంపిక జాబితా పెడతామని ప్రకటించినా ఇంకా పలు సం దేహాలు వెంటాడుతూనే ఉన్నాయి. జిల్లాలో ఎస్జీటీ, భాషాపండిత్, పీఈటీ పోస్టులకు మాత్రమే ఫలితాలు ప్రకటించారు. అర్హత జా బితాను అందుబాటులో ఉంచారు. జాబితా ప్రకటించిన వివిధ కేటగిరి పోస్టుల అభ్యర్థులు 2,626 మందిలో కొంతమంది పేర్లు గానీ, ర్యాంకులు గానీ ప్రకటించకుండా కేవలం కోర్టు కేసు అంటూ పొందుపరిచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ పోస్టుల పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఒక వేళ ఈ నెల 5లోగా కోర్టు నుంచి పూర్తి సమాచారం అందకుంటే పరిస్థితి ఏమిటన్నదే అనుమానాలకు తావిస్తోంది. దీ నికి సంబంధించి జిల్లా ఎంపిక చైర్మన్ కలెక్టర్‌కు వివరాలు బుధవారం అందాయి. డీఎస్సీ నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టుల సంఖ్యకు భర్తీ ప్రక్రి య చేపడుతున్నప్పటికీ వాటి ప్రదేశాలు మారుతున్నాయి. ఇప్పటికే బదిలీలు, పదోన్నతులు ఇతర కారణాలతో ఖాళీ పడిన ప్రదేశాలను వెంటనే తమ కార్యాలయానికి పంపాలంటూ మండల విద్యాశాఖాధికారులకు డీఈఓ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ప్రకటించిన ఖాళీలు మాత్రం అ లాగే ఉన్నా ప్రాంతాలు మాత్రం మారుతున్నాయి. మరో వైపు జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల నుంచి ఖాళీల వివరాలను ప్రత్యేకంగా క్రోడీకరిస్తున్నారు.