సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో అధ్యాపక నియామకాలపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. పోస్టుల భర్తీకి అవసరమైన మార్గదర్శకాలకు సంబంధించిన ఉత్తర్వులను ఇటీవల జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా వాటిని ఆయా వర్సిటీలకు పంపింది. వర్సిటీల వైస్ చాన్స్‌లర్ల కమిటీ ఇచ్చిన సిఫార్సులను యథాతథంగా ఆమోదించింది. యూనివర్సిటీ గ్రాం ట్స్ కమిషన్ నిబంధనల మేరకే భర్తీ చేయాలని పేర్కొంది. యూనివర్సిటీల్లో మొత్తం 1,551 పోస్టులు ఖాళీ ఉండగా, తొలి విడతలో 1,061 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కేటగిరీ, సబ్జెక్టుల వారీగా 1,061పోస్టుల భర్తీని ప్రభుత్వం గతంలోనే ఆమోదించింది. తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వర్సిటీలు డ్రాఫ్ట్ నిబంధనలను రూపొందించే పనిలోపడ్డాయి. ఇది పూర్తి కాగానే వర్సిటీల ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాల్లో వీటి భర్తీకి ఆమోదం తెలుపుతాయి. పోస్టుల వారీగా రోస్టర్ పాయింట్లపై పలు సంక్షేమ శాఖల ఆమోదం తీసుకోవాల్సి ఉంది. ఇదంతా పూర్త య్యాక ప్రభుత్వ ఆమోదం తీసుకొని వర్సిటీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనుంది. అయితే ఇది పూర్తయ్యేందుకు దాదాపు 2 నెలలు పట్టే అవకాశం ఉంది.
ఇవీ ప్రధాన నిబంధనలు..
- పోస్టుల భర్తీకి యూనివర్సిటీల వారీగా వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేస్తారు. ఇవి జాతీయ స్థాయి నోటిఫికేషన్లుగానే ఉంటాయి.
- భర్తీ ప్రక్రియలో స్క్రీనింగ్ టెస్టు ఉండదు. అన్ని వర్సిటీలకు ఒకే రకమైన పరీక్ష విధానం ఉంటుంది.
- సబ్జెక్టును బట్టి పరీక్ష అంశాల్లో మార్పు ఉంటుంది. విధానంలో ఏ మార్పు ఉండదు. అలాగే వేర్వేరు తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
వర్సిటీలకు అధ్యాపక నియామక మార్గదర్శకాలు
Published Thu, Jan 25 2018 2:13 AM | Last Updated on Thu, Jan 25 2018 2:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment