భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా వాయిదా పడిన దేశవాళీ టోర్నీ రంజీట్రోఫీ 2022.. ఈ నెల 10 నుంచి ప్రారంభంకానున్నట్లు ప్రకటించింది. రెండు దశల్లో జరగనున్న ఈ టోర్నీలో ఫస్ట్ ఫేస్ ఫిబ్రవరి నుంచి మార్చి 15 వరకు, రెండో దశ మే 30 నుంచి జూన్ 26 వరకు జరగనున్నట్లు బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది.
టోర్నీలో భాగంగా మొత్తం 38 జట్లు 9 గ్రూపులుగా విభంజించబడి, 62 రోజుల పాటు దేశంలోని 9 ప్రధాన నగరాల్లో(అహ్మదాబాద్, కోల్‌కతా, రాజ్‌కోట్, ఢిల్లీ, గౌహతి, కటక్, త్రివేండ్రం, చెన్నై, హర్యానా), 64 మ్యాచ్‌లను నిర్వహించతలపెట్టినట్లు బీసీసీఐ పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా గురువారం అధికారిక ప్రకటన విడుదల చేశాడు. కాగా, షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది రంజీ సీజన్ జనవరి 13 నుంచి ప్రారంభం కావాల్సి ఉండింది. అయితే, దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో టోర్నీని కొన్ని రోజుల పాటు వాయిదా వేశారు.
చదవండి: పుజారా, రహానేలకు గంగూలీ పరోక్ష హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment