సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025 షెడ్యూల్‌ విడుదల | SA20 2025 Schedule Announced: Sunrisers Eastern Cape To Face MI Cape Town In Opening Match | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025 షెడ్యూల్‌ విడుదల

Published Mon, Sep 2 2024 7:17 PM | Last Updated on Mon, Sep 2 2024 7:21 PM

SA20 2025 Schedule Announced: Sunrisers Eastern Cape To Face MI Cape Town In Opening Match

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ (SA20) 2025 ఎడిషన్‌ (సీజన్‌-3) షెడ్యూల్‌ ఇవాళ (సెప్టెంబర్‌ 2) విడుదలైంది. ఈ లీగ్‌ జనవరి 9న ప్రారంభం కానుంది. లీగ్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌.. ముంబై ఇండియన్స్‌ కేప్‌టౌన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ సన్‌రైజర్స్‌ హోం గ్రౌండ్‌ అయిన సెయింట్‌ జార్జ్స్‌ పార్క్‌లో జరుగనుంది. లీగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జొహనెస్‌బర్గ్‌ వేదికగా ఫిబ్రవరి 8న జరుగనుంది.

ఈసారి లీగ్‌లో మొత్తం 30 లీగ్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. లీగ్‌ మ్యాచ్‌ల అనంతరం టాప్‌-4 జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. మొదటి క్వాలిఫయర్‌ ఫిబ్రవరి 4న జరుగనుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఫిబ్రవరి 5న.. క్వాలిఫయర్‌-2 ఫిబ్రవరి 6న జరుగనున్నాయి. సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025 ఎడిషన్‌లో కేన్‌ విలియమ్సన్‌, జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌, దినేశ్‌ కార్తీక్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లు కొత్తగా పాల్గొననున్నారు. ఈ లీగ్‌ యొక్క మ్యాచ్‌లు వయాకామ్‌18 స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

ఎస్‌ఏ20 లీగ్‌ యొక్క వివరాలు..

డిఫెండింగ్‌ ఛాంపియన్‌-సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌
అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టు-సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌ (2)
ఇప్పటి వరకు జరిగిన సీజన్లు-2
అత్యధిక పరుగులు- హెన్రిచ్‌ క్లాసెన్‌ (810)
అత్యధిక వికెట్లు- ఓట్నీల్‌ బార్ట్‌మన్‌ (30)
లీగ్‌లో మొత్తం జట్లు-6

జట్ల పేర్లు..

సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌
ఎంఐ కేప్‌టౌన్‌
డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌
జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌
పార్ల్‌ రాయల్స్‌
ప్రిటోరియా క్యాపిటల్స్‌
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement