సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2023–24 విద్యా సంవత్సరంలో కీలకమైన ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఈఏపీసెట్ (ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్), లేటరల్ ఎంట్రీ (డిప్లమా విద్యార్థులు ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశం)కి సంబంధించిన ఈసెట్, ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం ఐసెట్ నోటిఫికేషన్, ఆన్‌లైన్‌లో దరఖాస్తు, పరీక్షల నిర్వహణ తేదీలను నిర్ణయించింది.
ఈ మేరకు షెడ్యూల్ వివరాలను ఉన్నత విద్యా మండలి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈఏపీసెట్ పరీక్షలను మే 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈసెట్ మే 5న, ఐసెట్ మే 24, 25 తేదీల్లో నిర్వహిస్తారు.
ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇలా...
Comments
Please login to add a commentAdd a comment