manchester test
-
కరోనా కారణంగా రద్దైన 'ఆ' టెస్ట్ మ్యాచ్ షెడ్యూల్ ఖరారు
India Vs England 5th Test To Be Held In July 2022: ఐపీఎల్-2021 రెండో దశకు ముందు ఇంగ్లండ్ పర్యటనలో రద్దైన ఐదో టెస్ట్(మాంచెస్టర్) మ్యాచ్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ), ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)లు క్లారిటీ ఇచ్చాయి. భారత శిబిరంలో కరోనా కేసు వెలుగు చూడడంతో రద్దైన ఆ మ్యాచ్‌ను వచ్చే ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో నిర్వహించేందుకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకరించాయి. పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమిండియా వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో పర్యటించనుండగా.. అందులో భాగంగా జులై 1 నుంచి 5వ తేదీ వరకు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రద్దైన టెస్ట్ జరుగుతుందని ఇరు దేశాల బోర్డులు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య 3 టీ20లు (జులై 7, 9, 10), 3 వన్డేలు(జులై 12, 14, 17) జరగనున్నాయి. కాగా, భారత్- ఇంగ్లండ్‌ల మధ్య ఈ ఏడాది సెప్టెంబర్ 10న జరగాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్.. టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు కరోనా నిర్దారణ కావడంతో రద్దైన సంగతి తెలిసిందే. చదవండి: ట్రోఫితో పాటు ఆ రెండు రికార్డులు టీమిండియా క్రికెటర్లవే.. -
రద్దైన టెస్ట్ మ్యాచ్ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన ఇరు బోర్డులు.. అయితే..?
ముంబై: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10న జరగాల్సిన చివరి టెస్ట్ మ్యాచ్ నాటకీయ పరిణామాల మధ్య షెడ్యూల్ సమయానికి మూడు గంటల ముందు రద్దైన సంగతి తెలిసిందే. అయితే రద్దైన ఆ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసేందుకు తాజాగా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకారం తెలిపాయి. వచ్చే ఏడాది జులైలో జరిగే ఇంగ్లండ్ పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు ఈ మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ, ఈసీబీలు పరస్పర అంగీకారానికి వచ్చాయి. అయితే, రీ షెడ్యూల్ అయ్యే ఆ మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు సంబంధం ఉంటుందా లేదా అన్న విషయంపై మాత్రం ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నోరుమెదపలేదు. రీ షెడ్యూల్ మ్యాచ్ 5 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగానే జరగాలని ఈసీబీ పట్టుబడుతుంటే.. బీసీసీఐ మాత్రం అది స్టాండ్ అలోన్ మ్యాచ్(సెపరేట్ మ్యాచ్) అవుతుందని సూచన ప్రాయంగా పేర్కొంది. 4 టెస్ట్‌లు ముగిసే సమయానికి టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో సిరీస్ ఫలితం ఎటూ తేలలేదు. ఈ విషయమై ఐసీసీ సైతం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్‌కు ముందు తొలుత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా సోకగా.. అతని నుంచి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్‌లకు వైరస్ సోకింది. అనంతరం ఐదో టెస్టుకు ముందు రోజు గురువారం (సెప్టెంబర్ 9) సాయంత్రం టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా.. అందరికీ నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ భారత జట్టు ముందు జాగ్రత్త చర్యగా చివరి టెస్ట్‌లో ఆడలేమంటూ చేతులెత్తేసింది. చదవండి: అతన్ని వదులుకోవడం కేకేఆర్ చేసిన అతి పెద్ద తప్పిదం.. -
ఐదో మ్యాచ్ రద్దు.. 2-1 ఆధిక్యంలో టీమిండియా.. ఇక..
మాంచెస్టర్: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు రద్దైంది. ఈ మేరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. కాగా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఓల్డ్ ట్రఫోర్ట్ మైదానంలో జరగాల్సిన ఆఖరి మ్యాచ్ రద్దు కావడంతో సిరీస్ కోహ్లి సేన సొంతం కావడం ఇక లాంఛనమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు... అత్యంత కీలకమైన, నిర్ణయాత్మకమైన ఐదో టెస్టు కోవిడ్ కారణంగా రద్దు కావడంతో.. జూలైలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటన(పరిమిత ఓవర్ల క్రికెట్) నేపథ్యంలో అప్పుడు ఈ టెస్టు మ్యాచ్ నిర్వహించేలా సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. ఆ ఫలితం ఆధారంగానే సిరీస్ విజేతను నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్‌కు ముందు గురువారం టీమిండియా పిజియోథెరపిస్ట్ యోగేశ్ పర్మార్‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. అతనితో పాటు శిక్షణ సిబ్బందిలో మరికొందరు మహమ్మారి బారిన పడడంతో మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఈసీబీ తొలుత ప్రకటించింది. ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బంది అందరికీ కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వచ్చాకే మ్యాచ్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ క్రమంలో బీసీసీఐతో చర్చించిన అనంతరం మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఆటగాళ్లందరికీ నెగిటివ్ వచ్చినప్పటికీ ఆడేందుకు సుముఖంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక తొలి టెస్టు డ్రాగా ముగియగా.. రెండో టెస్టులో భారత్, మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలుపొందాయి. ఇక నాలుగో టెస్టులో విజయం సాధించిన టీమిండియా 2-1తో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. నిర్ణయాత్మక ఐదో టెస్టు రద్దైంది. చదవండి: T20 World Cup 2021: విండీస్ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు Six Balls Six Sixes: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. వీడియో వైరల్ -
నాలుగో టెస్టులో భారత్ ఘోర పరాజయం
నాలుగో టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఏకంగా ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది. రవిచంద్రన్ అశ్విన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి 46 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మిగిలిన యోధునుయోధులనుకున్న బ్యాట్స్ మన్ అంతా వరుసపెట్టి పెవిలియన్ బాట పట్టారు. దాంతో రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 161 పరుగులకే చాప చుట్టేసింది. దాంతో మరో రెండు రోజుల ఆట మిగిలి ఉందనగానే మ్యాచ్ ముగిసిపోయింది. తొలి ఇన్నింగ్స్ లోనే 215 పరుగుల ఆధిక్యం సాధించిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు మూడో రోజు భారత జట్టును మళ్లీ బ్యాటింగ్‌కు దించింది. అయితే, భారత జట్టుల సరిగ్గా 43 ఓవర్లలోనే 161 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. మురళీ విజయ్ (18), గౌతమ్ గంభీర్ (18), ఛటేశ్వర్ పుజారా (17), విరాట్ కోహ్లీ (7) అజిక్య రహానే (1), రవీంద్ర జడేజా (4), ధోనీ (27), భువనేశ్వర్ కుమార్ (10), ఆరోన్ (9), పంకజ్ (0) పరుగులకు ఔటయ్యారు. రవిచంద్రన్ అశ్విన్ ఒక్కడు మాత్రం 46 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంతో ఉన్నట్లయింది.