నాలుగో టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఏకంగా ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది. రవిచంద్రన్ అశ్విన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి 46 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మిగిలిన యోధునుయోధులనుకున్న బ్యాట్స్ మన్ అంతా వరుసపెట్టి పెవిలియన్ బాట పట్టారు. దాంతో రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 161 పరుగులకే చాప చుట్టేసింది. దాంతో మరో రెండు రోజుల ఆట మిగిలి ఉందనగానే మ్యాచ్ ముగిసిపోయింది.
తొలి ఇన్నింగ్స్ లోనే 215 పరుగుల ఆధిక్యం సాధించిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు మూడో రోజు భారత జట్టును మళ్లీ బ్యాటింగ్కు దించింది. అయితే, భారత జట్టుల సరిగ్గా 43 ఓవర్లలోనే 161 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. మురళీ విజయ్ (18), గౌతమ్ గంభీర్ (18), ఛటేశ్వర్ పుజారా (17), విరాట్ కోహ్లీ (7) అజిక్య రహానే (1), రవీంద్ర జడేజా (4), ధోనీ (27), భువనేశ్వర్ కుమార్ (10), ఆరోన్ (9), పంకజ్ (0) పరుగులకు ఔటయ్యారు. రవిచంద్రన్ అశ్విన్ ఒక్కడు మాత్రం 46 పరుగులు చేసి నాటౌట్గా మిగిలాడు. దీంతో ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంతో ఉన్నట్లయింది.