third test match
-
మూడో టెస్టుకు హర్షిత్
ముంబై: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే మూడో టెస్టు కోసం పేస్ బౌలర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నారు. బుధవారం అతను జట్టుతో చేరతాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ట్రావెలింగ్ రిజర్వ్‌లలో ఢిల్లీకి చెందిన హర్షిత్ కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రధాన జట్టులోకి రానున్నాడని సమాచారం. నవంబర్ 1 నుంచి భారత్, కివీస్ మధ్య మూడో టెస్టు వాంఖెడే మైదానంలో జరుగుతుంది. హర్షిత్‌కు ఇప్పటికే బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం ఆ్రస్టేలియాకు వెళ్లే భారత టెస్టు టీమ్‌లో చోటు లభించింది. దానికి ముందు ఒక టెస్టులో అతడిని ఆడిస్తే బాగుంటుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.కివీస్‌తో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో మూడో టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే హర్షిత్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టవచ్చు. బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్‌లకు ఎంపికైనా... హర్షిత్‌కు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. మంగళవారం అస్సాంతో ముగిసిన రంజీ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన హర్షిత్...ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 10 మ్యాచ్‌ల ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 24.00 సగటుతో రాణా 43 వికెట్లు పడగొట్టాడు. విలియమ్సన్ దూరం వెలింగ్టన్: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ భారత్‌తో సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు అందుబాటులో లేని అతను ఇప్పుడు మూడో టెస్టునుంచి తప్పుకున్నాడు. విలియమ్సన్ భారత్‌కు రావడం లేదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. గాయం నుంచి కోలుకొని అతను ప్రస్తుతం రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. అయితే ముందు జాగ్రత్తగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.సంచలన ప్రదర్శనతో కివీస్ ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో హడావిడిగా విలియమ్సన్‌ను బరిలోకి దించరాదని బోర్డు భావించింది. ఈ సిరీస్ తర్వాత సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. దాని కోసం విలియమ్సన్ పూర్తి స్థాయిలో ఫిట్‌గా అందుబాటులో ఉండాలనేదే ప్రధాన కారణం. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడిన తర్వాత స్వదేశానికి వెళ్లిన విలియమ్సన్ గాయం కారణంగా భారత గడ్డపై అడుగు పెట్టనే లేదు. -
Gambhir On KL Rahul: వికెట్ కీపర్ ఎప్పటికీ ఓపెనింగ్ బ్యాటర్ కాలేడు..
IND Vs SA: దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వరుసగా విఫలమవుతున్న వేళ, కేఎల్ రాహుల్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పజెప్పాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ ఫార్మాట్లో వికెట్ కీపర్ ఎప్పటికీ విజయవంతమైన ఓపెనింగ్ బ్యాటర్ కాలేడని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం బ్యాటింగ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న రాహుల్‌ను అనవసరంగా వికెట్ కీపింగ్ రొంపిలోకి లాగొద్దని సూచించాడు. స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన రాహుల్‌పై వికెట్ కీపింగ్ భారాన్ని మోపడం సబబు కాదని, ఇలా చేయడం వల్ల అతనితో పాటు జట్టు కూడా తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించాడు. క్రికెట్ చరిత్రలో ఏ వికెట్ కీపర్ టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా రాణించింది లేదని ఈ సందర్భంగా ఉదహరించాడు. కీపింగ్ చేసి ఓపెనర్‌గా సక్సెస్ కావడం వన్డే, టీ20ల్లో చూసామని, సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం అలా జరగడం దాదాపు అసాధ్యమని పేర్కొన్నాడు. ఉపఖండపు పిచ్‌లపై సగటున ఓ జట్టు 150 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే.. కీపింగ్ చేసి మళ్లీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి రాణించడం అత్యాశ అవుతుందని తెలిపాడు. పంత్‌ను పక్కకు పెట్టాల్సిన పరిస్థితి వస్తే.. మరో రెగ్యులర్ వికెట్ కీపర్ వైపు చూడాలి కాని, రాహుల్‌ను డిస్టర్బ్ చేయకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. చదవండి: IND Vs SA 3rd Test: సెంచరీ పూర్తి చేసిన కోహ్లి, బ్యాటింగ్‌లో అనుకుంటే పొరపాటే..! -
ఇంగ్లండ్‌తో భారత్ మూడో టెస్టు ఫోటోలు
-
మహ్మద్ సిరాజ్ కంటతడి
సిడ్నీ : టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ గురువారం కన్నీటి పర్యంతమయ్యాడు. గురువారం ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయగీతం ఆలపిస్తుండగా సిరాజ్ కంట తడిపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇటీవలె సిరాజ్ తండ్రి అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. క్వారంటైన్ నిబంధనల కారణంగా భారత్‌కి తిరిగి వెళ్లే అవకాశం లేనందన టెస్టుల్లో ఆడేందుకే సుముఖత చూపించాడు. రెండో మ్యాచ్‌లో సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీకి గాయం కారణంగా సిరాజ్‌కు అవకాశం లభించిన సంగతి తెలిసిందే. (ఎంపీఎల్లో కోహ్లి పెట్టుబడులు) ఈ నేపథ్యంలో గురువారం టెస్టు ప్రారంభానికి ముందు జాతీయగీతం ఆలపించే సందర్భంలో తండ్రిని గుర్తుచేసుకొని సిరాజ్ భావోధ్వేగానికి లోనయ్యాడు. ఇక మూడో టెస్టులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(5)ను తక్కువ స్కోరుకే మహ్మద్ సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. పుజారాకు క్యాచ్ ఇచ్చి వార్నర్ ఔటయ్యాడు. (న్యూజిలాండ్ నంబర్‌వన్) ✊ #AUSvIND pic.twitter.com/4NK95mVYLN — cricket.com.au (@cricketcomau) January 6, 2021 -
వార్నర్ ఔట్; మ్యాచ్‌కు వర్షం అంతరాయం
సిడ్నీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(5)ను తక్కువ స్కోరుకే మహ్మద్ సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. పుజారాకు క్యాచ్ ఇచ్చి వార్నర్ ఔటయ్యాడు. ఆస్ట్రేలియా 7 ఓవర్లలో 21/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. వర్షం కారణంగా ఆటకు మరోసారి అంతరాయం కలిగింది. అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన్ ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. కాగా, మళ్లీ మ్యాచ్ ఆరంభమైన తర్వాత వర్షం పడటంతో మరొకసారి నిలిచిపోయింది. 7.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 21 పరుగుల వద్ద ఉండగా మళ్లీ వర్షం పడటంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. షైనీ ఆరంగ్రేటం హిట్‌మన్ రోహిత్ శర్మ జట్టులోకి వచ్చాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కు జట్టులో స్థానం దక్కలేదు. గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో నవదీప్ షైనీని జట్టులోకి తీసుకున్నారు. టెస్టుల్లో భారత్ తరపున 299వ ఆటగాడిగా షైనీ ఆరంగ్రేటం చేశాడు. సహచర ఆటగాళ్ల అభినందనల నడుమ సీనియర్ బౌలర్ బుమ్రా చేతుల మీదుగా టెస్ట్ జట్టు క్యాప్‌ను షైనీ అందుకుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున విల్ పకోవ్‌స్కీ టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాడు. Congratulations @navdeepsaini96. He realises his dream of playing Test cricket for #TeamIndia today. A proud holder of 🧢 299 and he receives it from @Jaspritbumrah93. #AUSvIND pic.twitter.com/zxa5LGJEen — BCCI (@BCCI) January 6, 2021 భారత్ (తుది జట్టు): రహానే (కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, పుజారా, విహారి, పంత్, జడేజా, అశ్విన్, సిరాజ్, బుమ్రా, సైనీ. ఆస్ట్రేలియా (అంచనా): పైన్ (కెప్టెన్), వార్నర్, పకోవ్‌స్కీ, స్మిత్, లబ్‌షేన్, వేడ్, గ్రీన్, కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్, లయన్. చదవండి: ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానంలోకి -
ఓపెనర్‌గానే రోహిత్ శర్మ!
సిడ్నీ: ఫిట్నెస్ సంతరించుకొని... క్వారంటైన్ పూర్తి చేసుకున్న వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు తుదిజట్టులో స్థానం ఖరారైంది. సిడ్నీలో గురువారం మొదలయ్యే మూడో టెస్టులో రోహిత్ ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయమైంది. ఆతిథ్య బౌలర్లను ఎదుర్కోవడంలో తంటాలు పడుతున్న మయాంక్ అగర్వాల్‌ను సిడ్నీ టెస్టు నుంచి తప్పించాలని టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టాపార్డర్‌లోనే ‘హిట్‌మ్యాన్’ దిగనుండటంతో ఇప్పుడు ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి స్థానానికి వచ్చిన ముప్పేమీ లేదు. గాయంతో సిరీస్ నుంచి వైదొలిగిన పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ స్థానంలో శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైనీ, నటరాజన్‌లలో ఒకరికి చాన్స్ దక్కుతుంది. టీమ్ మేనేజ్మెంట్ జట్టు కూర్పు కోసం తుది కసరత్తు చేస్తోంది. తాత్కాలిక సారథి రహానే ప్రధానంగా బ్యాటింగ్, బౌలింగ్‌ల సమతూకంపై దృష్టి పెట్టాడు. ప్రధానంగా సీనియర్ సీమర్లు లేని బౌలింగ్ లైనప్‌పై అతను సమాలోచనలు చేస్తున్నాడు. ఇదివరకే షమీ దూరమయ్యాడు. ఇప్పుడేమో ఉమేశ్ లేడు. ఇలాంటి పరిస్థితుల్లో బుమ్రా, సిరాజ్‌లకు తోడుగా తుది జట్టులో మూడో పేసర్‌గా శార్దుల్, సైనీ, కొత్త పేసర్ నటరాజన్‌లలో ఎవరిని తీసుకోవాలనే దానిపై టీమ్ మేనేజ్మెంట్ తర్జనభర్జన పడుతోంది. వాతావరణం మేఘావృతమై ఉండటంతో పిచ్‌పై కవర్ని కప్పి ఉంచారు. బహుశా పిచ్ పరిశీలించాకే మూడో పేసర్ ఎవరో ఖరారు చేసే అవకాశముంది. మంగళవారం జరిగిన నెట్ సెషన్లో రోహిత్ ప్రాక్టీస్ చేశాడు. అతను పేసర్లు, స్పిన్నర్లను ఇబ్బంది లేకుండా ఎదుర్కొన్నాడు. గాయంతో స్వదేశానికి రాహుల్ ఈ సిరీస్‌లో గాయాలు... ఇరు జట్ల ఆటగాళ్లతో ఆడుకుంటున్నాయి. భారత శిబిరంలో ఇప్పటికే సీనియర్ సీమర్లు షమీ, ఉమేశ్ యాదవ్‌లు టెస్టు సిరీస్‌కు దూరం కాగా, ఈ జాబితాలో ఇప్పుడు బ్యాట్స్‌మన్ లోకేశ్ రాహుల్ కూడా చేరాడు. ప్రాక్టీస్ సెషన్లో అతని ఎడంచేతి మణికట్టు బెణికింది. గాయం తీవ్రత దృష్ట్యా అతను మిగతా రెండు టెస్టులకు అందుబాటులో ఉండడని జట్టు వర్గాలు తెలిపాయి. ‘శనివారం మెల్బోర్న్లో బ్యాటింగ్ సాధన చేస్తుండగా రాహుల్ ఎడంచేతి మణికట్టు బెణికింది. అతను పూర్తిగా కోలుకునేందుకు సుమారు మూడు వారాల సమయం పడుతుంది. అందువల్లే మిగతా మ్యాచ్‌లకు అతను దూరమయ్యాడు’ అని బీసీసీఐ తెలిపింది. మంగళవారం అతను స్వదేశానికి పయనమయ్యాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో అతనిప్పుడు పునరావాస శిబిరంలో పాల్గొంటాడు. కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్ తో జరిగే సిరీస్‌కల్లా రాహుల్ కోలుకుంటాడా లేదోనన్న సందేహాలు నెలకొన్నాయి. వార్నర్ రెడీ! ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ సిడ్నీ టెస్టుకు సిద్ధమయ్యాడని జట్టు కోచ్ లాంగర్ చెప్పుకొచ్చాడు. గజ్జల్లో గాయంతో టి20లతో పాటు అతను తొలి రెండు టెస్టులకు దూరమైన సంగతి తెలిసిందే. అతని ఫిట్‌నెస్‌పై కోచ్... మీడియాతో వర్చువల్ మీటింగ్‌లో మాట్లాడుతూ ‘వార్నర్ ఆడతాడని చాలా ఆశాభావంతో ఉన్నాం. ఎంతైనా అతను యోధుడు కదా! ఎందుకంటే జట్టు కోసం సంసిద్ధంగా ఉండేందుకు అతను ఏదైనా చేస్తా డని మొదటినుంచి నేను చెబుతున్నా. అన్నట్లే అతను ట్రాక్‌లో పడ్డాడు. టచ్‌లోకి వచ్చాడు. ఆడేందుకు అంకితభావంతో కృషిచేశాడు. ఈ పోటాపోటీ టెస్టు సిరీస్‌లో పాల్గొనేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. నెట్ సెషన్స్ పూర్తయ్యాక అతనిపై తుది నిర్ణ యం తీసుకుంటాం. తొందరపడి అతన్ని రిస్క్‌లోకి నెట్టం. అంతా ఆలోచించే జట్టును ఖరారు చేస్తాం’ అని అన్నాడు. భారత్ ‘ఎ’తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో తలకు బంతి తగిలి కన్‌కషన్‌కు గురైన యువ బ్యాట్స్‌మన్ పకోవ్‌స్కీ కూడా కోలుకున్నాడని కోచ్ చెప్పా డు. దీంతో టెస్టుల్లో పకోవ్‌స్కీ అరంగేట్రం చేయనున్నాడు. -
పాకిస్తాన్ 100/2
సౌతాంప్టన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే మరో 210 పరుగులు చేయాలి. ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 100 పరుగులు చేసింది. వర్షం అంతరాయం కలిగించడంతో నాలుగో రోజు 56 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఓపెనర్లు షాన్ మసూద్ (18; 2 ఫోర్లు), అబిద్ అలీ (42; 2 ఫోర్లు) అవుటయ్యారు. కెప్టెన్ అజహర్ అలీ (29 బ్యాటింగ్), బాబర్ ఆజమ్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అబిద్ అలీని అవుట్ చేయడంతో ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ టెస్టు వికెట్ల సంఖ్య 599కు చేరుకుంది. చివరి రోజు అండర్సన్ మరో వికెట్ తీస్తే టెస్టుల్లో 600 వికెట్లు పడగొట్టిన తొలి పేస్ బౌలర్‌గా గుర్తింపు పొందుతాడు. టెస్టుల్లో 600 కంటే ఎక్కువ వికెట్లు తీసిన ముగ్గురు బౌలర్లు మురళీధరన్ (శ్రీలంక), షేన్ వార్న్ (ఆస్ట్రేలియా), అనిల్ కుంబ్లే (భారత్) స్పిన్నర్లే కావడం గమనార్హం. -
అజహర్ అలీ సెంచరీ: పాక్ 273
సౌతాంప్టన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో క్రికెట్ టెస్టులో పాకిస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 93 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్‌కు 310 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. పాక్ కెప్టెన్ అజహర్ అలీ (141 నాటౌట్; 21 ఫోర్లు) కెరీర్లో 17వ టెస్టు సెంచరీ చేయడంతోపాటు 6 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఓవర్‌నైట్ స్కోరు 24/3తో మూడో రోజు ఆదివారం ఆట కొనసాగించిన పాక్‌ను ఇంగ్లండ్ బౌలర్లు అండర్సన్ (5/56), బ్రాడ్ (2/40) దెబ్బ తీశారు. అంతకుముందు రెండో రోజు శనివారం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 583 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. జాక్ క్రాలీ (267; 34 ఫోర్లు, సిక్స్) డబుల్ సెంచరీ... జోస్ బట్లర్ (152; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించారు. -
‘పోప్’ ముందుండి నడిపించగా...
మాంచెస్టర్: స్టార్ ఆటగాడు స్టోక్స్ విఫలమయ్యాడు... కెప్టెన్ రూట్‌ది అదే బాట... గత మ్యాచ్‌లో శతకం బాదిన సిబ్లీ ఈ సారి సున్నా చుట్టాడు... ఐదుగురు రెగ్యులర్ బ్యాట్స్‌మెన్‌తోనే బరిలోకి దిగిన జట్టులో టాప్–4 రెండు సెషన్లు ముగియక ముందే పెవిలియన్ చేరారు. అయినా సరే వెస్టిండీస్‌తో చివరి టెస్టులో తొలి రోజు ఇంగ్లండ్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. ఇదంతా యువ ఆటగాడు ఒలి జాన్ పోప్ (142 బంతుల్లో 91 బ్యాటింగ్; 11 ఫోర్లు) చలవే. అతనికి సరైన సమయంలో కీపర్ బట్లర్ (120 బంతుల్లో 56 బ్యాటింగ్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అండగా నిలవడంతో ఆతిథ్య జట్టు ఊపిరి పీల్చుకుంది. రోరీ బర్న్స్ (147 బంతుల్లో 57; 4 ఫోర్లు) కూడా రాణించాడు. వెస్టిండీస్ పేలవ బౌలింగ్ కారణంగా చివరి సెషన్ మొత్తం ఆధిక్యం కనబర్చిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 85.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. పోప్, బట్లర్ ఇప్పటికే ఐదో వికెట్‌కు అభేద్యంగా 136 పరుగులు జోడించారు. 32.4 ఓవర్లు సాగిన చివరి సెషన్లో ధాటిగా ఆడి 127 పరుగులు జత చేయడం విశేషం. రోచ్‌కు 2 వికెట్లు దక్కాయి. రూట్ విఫలం: నిర్ణాయక టెస్టులో విండీస్‌కు శుభారంభం లభించింది. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన సిబ్లీ (0)ని తొలి ఓవర్లోనే రోచ్ ఎల్బీగా అవుట్ చేశాడు. ఆ తర్వాత లేని సింగిల్ కోసం ప్రయత్నించి కెప్టెన్ రూట్ (17) రనౌట్ అయ్యాడు. లంచ్ సమయానికి ఇంగ్లండ్ 66 పరుగులకు చేరింది. విరామం తర్వాత స్టోక్స్ (20)ను అద్భుత ఇన్‌స్వింగర్‌తో రోచ్ బౌల్డ్ చేశాడు. అయితే సహచరులు వెనుదిరుగుతున్నా మరోవైపు ఓపెనర్ బర్న్స్ మాత్రం కాస్త పట్టుదల ప్రదర్శించాడు. 126 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కొద్దిసేపటికే ఛేజ్ బౌలింగ్‌లో కార్న్‌వాల్‌కు క్యాచ్ ఇచ్చి బర్న్స్ వెనుదిరిగాడు. కీలక భాగస్వామ్యం: టీ విరామానికి ఇంగ్లండ్ 4 వికెట్లు చేజార్చుకొని 131 పరుగులు చేసింది. అనంతరం పోప్, బట్లర్ బాధ్యతాయుత ఆటతో ఆదుకున్నారు. విండీస్ కూడా కాస్త ఉదాసీనత ప్రదర్శించడంతో చకచకా పరుగులు వచ్చాయి. చక్కటి షాట్లు ఆడిన పోప్ 77 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... వరుసగా విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్న బట్లర్ ఎట్టకేలకు రాణించాడు. 104 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. వీరిద్దరిని విడదీయడం విండీస్ వల్ల కాలేదు. కొత్త బంతిని తీసుకున్నా లాభం లేకపోయింది. -
చివరి పరీక్షలో విజయమెవరిదో..
మాంచెస్టర్: కరోనాను కాదని ముందడుగు పడిన ఈ టెస్టు సిరీస్‌లో ప్రతీ మ్యాచ్ ఫలితాన్నిచ్చింది. గత మ్యాచ్ కంటే గడిచిన సిరీస్ గెలిచిన వెస్టిండీస్‌కే కాస్త అనుకూలత ఉంది. నేటి నుంచి జరిగే ఆఖరి టెస్టు డ్రా చేసుకున్నా సరే... విజ్డెన్ ట్రోఫీని కరీబియన్ జట్టు నిలబెట్టుకుంటుంది. అలాగని ఇంగ్లండ్ జోరును తక్కువ అంచనా వేయలేని పరిస్థితి గత మ్యాచ్ కళ్లకు కట్టింది. వరుసగా ఈ మ్యాచ్ కూడా గెలిస్తే ఏకంగా సిరీసే చేతికొస్తుంది. ఈ నేపథ్యంలో ఆఖరి పోరు ఆరంభం నుంచి రసవత్తరంగా జరిగే అవకాశముంది. స్టోక్స్ జోరుతో... ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ జోరుతో ఆతిథ్య జట్టు ట్రాక్‌లో పడింది. రెండో టెస్టులో భారీ శతకంతో పాటు మెరుపు అర్ధసెంచరీ ఇంగ్లండ్‌ను రేసులో నిలిపింది. ఓపెనర్ సిబ్లీ కూడా సెంచరీతో ఫామ్‌లోకి రావడం... ఈ ఆఖరి మ్యాచ్ కూడా మాంచెస్టర్లోనే జరగడం కలిసొచ్చే అంశం. బట్లర్ కూడా మెరుగ్గానే రాణించాడు. టాపార్డర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ టచ్‌లోకి రావడంతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. అలాగని బౌలింగ్ దళం లోటుపాట్లతో ఏమీ లేదు. రెండో టెస్టులో బుడగ దాటి క్రమశిక్షణ చర్యకు గురైన ఆర్చర్ ఇప్పుడు ఆఖరి పోరుకు అందుబాటులోకి రావడం ఇంగ్లండ్‌కు తుది జట్టు సెలక్షన్ తలనొప్పులు తెచ్చిపెట్టింది. గత మ్యాచ్‌లో యువ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్‌తో పాటు బ్రాడ్, వోక్స్ చక్కగా రాణించారు. దీంతో ఎవరిని పక్కనబెట్టాలన్నది టీమ్ మేనేజ్మెంట్కు సమస్యగా మారింది. పైగా ఈ మ్యాచ్‌లో అండర్సన్‌ను ఆడితే కరన్‌తో పాటు, వోక్స్నూ బెంచ్‌కే పరిమితం చేసే అవకాశముంటుంది. హోల్డర్ సేన సత్తా చాటాల్సిందే తొలి టెస్టులో కనబరిచిన ఆల్‌రౌండ్ ప్రదర్శన రెండో టెస్టుకొచ్చే సరికి నీరుగారిపోయింది. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్, మిడిలార్డర్లో బ్లాక్‌వుడ్, రోస్టన్ చేజ్లు మాత్రం నిలకడగా ఆడుతున్నప్పటికీ మిగతావారిలో డౌరిచ్, బ్రూక్స్, షై హోప్ ఒక ఇన్నింగ్స్ ఆడితే మరో ఇన్నింగ్స్ విఫలమవుతున్నారు. కీలకమైన తరుణంలో బ్యాట్స్‌మెన్ బాధ్యతగా ఆడలేకపోవడం జట్టును కలవర పెడుతుంది. ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేసిన కరీబియన్ బౌలర్లు... గత మ్యాచ్‌లో మాత్రం ఆ మేరకు ప్రభావం చూపలేదు. సౌతాంప్టన్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ స్టోక్స్‌ను కట్టడి చేసిన విండీస్ కెప్టెన్ హోల్డర్ మాంచెస్టర్‌లో మాత్రం తేలిపోయాడు. గత మ్యాచ్ వైఫల్యాలను అధిగమిస్తే నిర్ణాయక పోరులో జట్టుకు కలిసొస్తుంది. లేదంటే సిరీస్‌నే ప్రత్యర్థి చేతిలో పెట్టాల్సివుంటుంది. జట్లు (అంచనా) ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), బర్న్స్, సిబ్లీ, క్రాలీ, స్టోక్స్, ఒలీపోప్, బట్లర్, బెస్, ఆర్చర్, అండర్సన్, బ్రాడ్. వెస్టిండీస్: హోల్డర్ (కెప్టెన్), క్రెయిగ్ బ్రాత్‌వైట్, హోప్, బ్రూక్స్, చేజ్, బ్లాక్‌వుడ్, డౌరిచ్, జోసెఫ్, రోచ్, గాబ్రియెల్. -
జరిమానాతో సరి...
లండన్: ‘బయో సెక్యూరిటీ’ నిబంధనలు ఉల్లంఘించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆగ్రహానికి గురైన పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు ఊరట లభించింది. ఆర్చర్ గత ప్రవర్తనను దృష్టిలో ఉంచుకొని ఈ సారికి జరిమానాతో సరి పెట్టాలని ఈసీబీ నిర్ణయించింది. ఆర్చర్ తన తప్పును అంగీకరించడంతో మూడో టెస్టు కోసం అతడిని జట్టులోకి ఎంపిక చేసింది. తొలి టెస్టు ముగిశాక సౌతాంప్టన్‌నుంచి రెండో టెస్టు వేదిక మాంచెస్టర్‌కు వెళ్లే సమయంలో ఆర్చర్ దారిలోనే ఉన్న తన ఇంటికి వెళ్లొచ్చాడు. ఇలా రక్షణ వలయాన్ని దాటడంపై ఆగ్రహించిన ఈసీబీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ వెంటనే అతడిని రెండో టెస్టు నుంచి తప్పించింది. ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశించింది. ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గైల్స్ శుక్రవారం చేపట్టిన విచారణలో ఇంగ్లండ్ ప్లేయర్ల సంఘం ప్రతినిధి, ఆర్చర్ ఏజెంట్ పాల్గొన్నారు. గట్టి హెచ్చరికతో పాటు జరిమానా విధించామని ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే జరిమానా ఎంతనేది మాత్రం ఈసీబీ అధికారికంగా వెల్లడించలేదు. ఈ మొత్తం రెండో టెస్టు మ్యాచ్ ఫీజుతో సమానమైన సుమారు 15వేల పౌండ్లు (రూ. 14 లక్షలు) కావచ్చని సమాచారం. ఇప్పటికే ఒక కోవిడ్ పరీక్షకు ఆర్చర్ హాజరు కాగా, రిపోర్ట్ నెగెటి వ్గా వచ్చింది. రెండో పరీక్షలో కూడా ఇదే ఫలితం వస్తే అతను మంగళవారం జట్టుతో చేరతాడు. -
ఇంగ్లండ్‌దే మూడో టెస్టు
పోర్ట్ ఎలిజబెత్: ఊహించినట్లుగానే దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. ఫాలోఆన్ ఆడిన దక్షిణాఫ్రికాను రెండో ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌట్ చేయడం ద్వారా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో నెగ్గింది. దాంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 102/6తో చివరి రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా మరో 26.5 ఓవర్ల పాటు ఆడి చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. కేశవ్ మహరాజ్ (71; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), 11వ నంబర్ ఆటగాడు ప్యాటర్సన్ (39; 6 ఫోర్లు) పదో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. రూట్ వేసిన 82వ ఓవర్లో కేశవ్ మహరాజ్ 4,4,4,6,6 బాదడంతో మొత్తం 28 పరుగులు (4 బైస్) వచ్చాయి. తద్వారా టెస్టుల్లో ఒకే ఓవర్లో అత్యధికంగా 28 పరుగులు ఇచ్చిన మూడో బౌలర్‌గా రూట్ గుర్తింపు పొందాడు. గతంలో పీటర్సన్ (దక్షిణాఫ్రికా), అండర్సన్ (ఇంగ్లండ్) కూడా 28 పరుగులు చొప్పున ఇచ్చారు. -
మూడో టెస్టు భారత్ ఘన విజయం
-
నేడే క్లీన్‌స్వీప్
ఈ టెస్టుకు ఇంకా రెండు రోజుల ఆట ఉంది. కానీ... చరిత్రకెక్కేందుకు లాంఛనమే మిగిలుంది. సఫారీపై ఎప్పుడూలేని విధంగా 3–0తో క్లీన్‌స్వీప్ విజయానికి టీమిండియా రెండే అడుగుల దూరంలో ఉంది. టెస్టుల్లో నంబర్‌వన్ కోహ్లి బృందం తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను రోజంతా దడదడలాడించింది. మూడో టెస్టులో ఒక్క మూడో రోజే 16 వికెట్లతో ఘనచరితకు శ్రీకారం చుట్టింది. రాంచీ: భారత పేసర్లు షమీ, ఉమేశ్‌లు ఆఖరి టెస్టును మూడో రోజే తేల్చేశారు. ఇద్దరు సీమర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదేసి వికెట్లు పడేశారు. చారిత్రక విజయానికి భారత్‌ను దగ్గర చేశారు. క్లీన్‌స్వీప్‌కు రెండే వికెట్ల దూరంలో నిలిపారు. ఆ లాంఛనం తొలి ఘడియలోనే పూర్తయితే కోహ్లి సేన ఎదురులేని విజయాన్ని సాధిస్తుంది. తొలి సెషన్లో పేసర్లు ఉమేశ్ (3/40), షమీ (2/22)లకు స్పిన్నర్లు జడేజా (2/19), నదీమ్ (2/22) తోడయ్యారు. దీంతో సఫారీ తొలి ఇన్నింగ్స్ 56.2 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. హమ్జా (79 బంతుల్లో 62; 10 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. భారత పేసర్లు ఫాలోఆన్‌లో మరింత రెచ్చిపోయారు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను నిలువునా కూల్చేశారు. ఆటనిలిచే సమయానికి 132 పరుగులకే 8 వికెట్లను పడేశారు. 10 పరుగులే ఇచి్చన షమీ 3 వికెట్లు తీయగా, ఉమేశ్ 35 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. ఆడింది... హమ్జా ఒక్కడే! దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ హమ్జా ఒక్కడే భారత బౌలర్లకు ఎదురునిలిచాడు. 9/2 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సఫారీ జట్టు ఆరంభ ఓవర్లోనే కెపె్టన్ డు ప్లెసిస్ (1) వికెట్‌ను కోల్పోయింది. అతన్ని ఉమేశ్ బౌల్డ్ చేశాడు. హమ్జాకు బవుమా (72 బంతుల్లో 32; 5 ఫోర్లు) జతయ్యాడు. ఇద్దరు కలిసి భారత బౌలర్లను 21 ఓవర్ల పాటు ఆడుకున్నారు. జట్టు స్కోరు 100 పరుగులు దాటాక సఫారీ కష్టాలు మొదలయ్యాయి. వన్డేను తలపించే ఇన్నింగ్స్‌తో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న హమ్జాను జడేజా బోల్తా కొట్టించగా... బవుమాను నదీమ్ ఔట్ చేశాడు. 129/6 స్కోరు వద్ద సఫారీ లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. రెండో సెషన్లో లిండే (81 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్) టెయిలెండర్లతో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. పీట్ (4), రబడ (0) స్వల్ప వ్యవధిలోనే ని్రష్కమించినప్పటికీ... తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నోర్జే (55 బంతుల్లో 4) ఆకట్టుకున్నాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌ను చాలాసేపు ఎదుర్కొన్నాడు. 45వ ఓవర్లో జట్టు స్కోరు 150 పరుగులకు చేరింది. ఆ తర్వాత కాసేపటికే లిండేను ఉమేశ్, నోర్జేను నదీమ్ ఔట్ చేయడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 162 పరుగుల వద్ద ముగిసింది. తప్పని తడబాటు... తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 335 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో సఫారీకి ఫాలోఆన్ తప్పలేదు. అయితే వారి రెండో ఇన్నింగ్స్ కూడా కష్టాలతోనే మొదలైంది. రిటైర్డ్‌హర్ట్ ఎల్గర్ (16) మినహా తొలి ఐదుగురు బ్యాట్స్‌మెన్ అంతా 5 పరుగుల్లోపే పెవిలియన్ చేరారు. డికాక్ (5)ను ఉమేశ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో జట్టును ఆదుకున్న హమ్జా (0)కు షమీ ఈసారి ఆ అవకాశం ఇవ్వలేదు. ఇదే ఊపులో కెప్టెన్ డుప్లెసిస్ (4)ను షమీ ఎల్బీ చేశాడు. మొత్తానికి మూడో సెషన్‌కు ముందే సఫారీ 4 కీలక వికెట్లను కోల్పోయింది. టీ బ్రేక్ తర్వాత కూడా పర్యాటక జట్టు పరిస్థితిలో ఏ మార్పూ లేదు. లోయర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ లిండే (27), పీట్ (23) నిలబడటంతో జట్టుస్కోరు వందకు చేరింది. ఎల్గర్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రుయిన్ (30 బ్యాటింగ్) అజేయంగా నిలిచాడు. సఫారీ ఇన్నింగ్స్‌లో రెండే వికెట్లు ఉండటంతో మరో అరగంటసేపు ఆటను పొడిగించారు. కానీ బ్రుయిన్.. నోర్జే (5 బ్యాటింగ్)తో కలిసి నాటౌట్‌గా నిలవడంతో ఆట మరో రోజు కొనసాగనుంది. ►5..ఒకే రోజు ఆటలో 14 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం భారత్‌కిది ఐదోసారి. ఈ జాబితాలో 20 వికెట్లు (అఫ్గానిస్తాన్‌పై బెంగళూరులో; 2018) తొలి స్థానంలో ఉండగా... తర్వాతి స్థానాల్లో 17 వికెట్లు (పాకిస్తాన్‌పై ఢిల్లీలో; 1952–53), 16 వికెట్లు (దక్షిణాఫ్రికాపై రాంచీలో; 2019లో), 15 వికెట్లు (శ్రీలంకపై బెంగళూరులో; 1993–94లో), 14 వికెట్లు (వెస్టిండీస్‌పై రాజ్‌కోట్‌లో 2018–19లో) ఉన్నాయి. ►8.. ప్రత్యర్థి జట్టును ఎక్కువసార్లు ఫాలోఆన్ ఆడించిన భారత కెపె్టన్‌గా విరాట్ కోహ్లి గుర్తింపు పొందాడు. కోహ్లి సారథ్యంలో ఇప్పటివరకు భారత్ ప్రత్యర్థి జట్టును 8 సార్లు ఫాలోఆన్ ఆడించింది. తర్వాతి స్థానాల్లో అజహరుద్దీన్ (7), ధోని (5), సౌరవ్ గంగూలీ (4) ఉన్నారు. ►2.. ఒక సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు రెండుసార్లు ఫాలోఆన్ ఆడటం 1964–65 తర్వాత ఇదే తొలిసారి. స్వదేశంలో 1964–65లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా చివరిసారి రెండుసార్లు ఫాలోఆన్ ఆడింది. ►4.. టెస్టుల్లో స్టంపింగ్ ద్వారా కెరీర్లో తొలి వికెట్ తీసిన నాలుగో బౌలర్‌గా షాబాజ్ నదీమ్ గుర్తింపు పొందాడు. గతంలో డబ్ల్యూవీ రామన్ (వాల్‡్ష–1987–88లో), ఎం.వెంకటరమణ (హేన్స్–1988–89లో), ఆశిష్ కపూర్ (కార్ల్ హూపర్–1994–95లో) ఈ ఘనత సాధించారు. ►2.. కొట్నీ వాల్ష్ (వెస్టిండీస్) తర్వాత భారత గడ్డపై వరుసగా ఐదు ఇన్నింగ్స్‌లలో మూడు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఉమేశ్ యాదవ్ (6/88, 4/45, 3/37, 3/22, 3/40) గుర్తింపు పొందాడు. ఉమేశ్ బౌన్సర్... ఎల్గర్ కన్కషన్ భారత సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ బౌన్సర్ సఫారీ ఓపెనర్ ఎల్గర్‌ను పడేసింది. అతను వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఎల్గర్ 16 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా... ఉమేశ్ వేసిన మూడో బంతి అనూహ్యంగా బౌన్స్ అయి బ్యాట్స్‌మన్ చెవి పైభాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో అతను పడిపోయాడు. బ్యాటింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో ఐసీసీ కన్కషన్ ప్రొటోకాల్ ప్రకారం మ్యాచ్ రిఫరీ ఎల్గర్ స్థానంలో బ్రుయిన్ను ఆడించేందుకు అనుమతించారు. ఎల్గర్ గాయం నుంచి కోలుకోవడానికి మరో ఆరు రోజల సమయం పడుతుందని దక్షిణాఫ్రికా టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది. సాహా స్థానంలో పంత్ కీపింగ్ టీమిండియాకు మరో ఎదురుదెబ్బ. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయంతో మైదానం వీడాడు. మూడో రోజు ఆటలో అశ్విన్ వేసిన 27వ ఓవర్ తొలి బంతి గింగిర్లు తిరుగుతూ బౌన్స్ అయింది. క్రీజులో ఉన్న లిండే దాన్ని ఎదుర్కోలేకపోవడంతో బంతిని సాహా అందుకునే ప్రయత్నం చేయగా అతని మునివేళ్లను తాకడంతో గాయపడ్డాడు. నొప్పికి తాళలేకపోయిన సాహా పెవిలియన్ చేరగా అతని స్థానంలో రిషభ్ పంత్ కీపింగ్ చేయాల్సి వచ్చింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 497/9 డిక్లేర్డ్; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) సాహా (బి) షమీ 0; డికాక్ (సి) సాహా (బి) ఉమేశ్ 4; హమ్జా (బి) జడేజా 62; డు ప్లెసిస్ (బి) ఉమేశ్ 1; బవుమా (స్టంప్డ్) సాహా (బి) నదీమ్ 32; క్లాసెన్ (బి) జడేజా 6; లిండే (సి) రోహిత్ (బి) ఉమేశ్ 37; పీట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 4; రబడ రనౌట్ 0; నోర్జే (ఎల్బీడబ్ల్యూ) (బి) నదీమ్ 4; ఇన్‌గిడి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (56.2 ఓవర్లలో ఆలౌట్) 162. వికెట్ల పతనం: 1–4, 2–8, 3–16, 4–107, 5–107, 6–119, 7–129, 8–130, 9–162, 10–162. బౌలింగ్: షమీ 10–4–22–2, ఉమేశ్ 9–1–40–3, నదీమ్ 11.2–4–22–2, జడేజా 14–3–19–2, అశ్విన్ 12–1–48–0. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: డికాక్ (బి) ఉమేశ్ 5; ఎల్గర్ (రిటైర్డ్ హర్ట్) 16; హమ్జా (బి) షమీ 0; డు ప్లెసిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 4; బవుమా (సి) సాహా (బి) షమీ 0; క్లాసెన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఉమేశ్ 5; లిండే (రనౌట్) 27; పీట్ (బి) జడేజా 23; బ్రుయిన్ (బ్యాటింగ్) 30; రబడ (సి) జడేజా (బి) అశ్విన్ 12; నోర్జే (బ్యాటింగ్) 5; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (46 ఓవర్లలో 8 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–5, 2–10, 3–18, 4–26, 5–36, 6–67, 7–98, 8–121. బౌలింగ్: షమీ 9–5–10–3, ఉమేశ్ 9–1–35–2, జడేజా 13–5–36–1, నదీమ్ 5–0–18–0, అశి్వన్ 10–3–28–1. -
దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు తొలి రోజు ఆట ఫోటోలు
-
2-1కి... 2 వికెట్లు కావాలి
ఆస్ట్రేలియా గడ్డపై మరో ప్రతిష్టాత్మక విజయానికి భారత్ మరింత చేరువైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో టాస్ వేసిన దగ్గరి నుంచి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ వచ్చిన టీమిండియా నాలుగో రోజు ముగిసేసరికి గెలుపునకు కేవలం 2 వికెట్ల దూరంలో నిలిచింది. మయాంక్, పంత్ దూకుడు తర్వాత వేగంగా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి భారీ లక్ష్యంతో ప్రత్యర్థికి సవాల్ విసిరిన కోహ్లి సేన ఎనిమిది ఆసీస్ వికెట్లు పడగొట్టి సిరీస్‌లో ఆధిక్యానికి సన్నద్ధమైంది. బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకునే క్రమంలో భారత్‌కు శనివారం పేసర్ కమిన్స్ నుంచే కాస్త ప్రతిఘటన ఎదురైంది. కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబర్చడంతో పాటు బ్యాటింగ్‌లో అర్ధసెంచరీ కూడా సాధించిన కమిన్స్ అడ్డుగోడగా నిలిచాడు. నాలుగో రోజు తరహాలోనే ఆదివారం కూడా ఆటకు ముందు కొన్ని చిరుజల్లులకు అవకాశం ఉన్నా... పూర్తి రోజు వర్షం బారిన పడే ప్రమాదం లేదు కాబట్టి భారత్ గెలుపు ఇక లాంఛనమే కావచ్చు. మెల్బోర్న్: కంగారూ నేలపై సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించే లక్ష్యంతో అడుగు పెట్టిన భారత జట్టు మరో అడుగు ముందుకు వేసింది. మూడో టెస్టు మ్యాచ్‌లో గెలుపునకు అతి చేరువలో నిలిచి 2–1 ఆధిక్యం సాధించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. భారత్ విధించిన 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ప్యాట్ కమిన్స్ (103 బంతుల్లో 61 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్), షాన్ మార్‡్ష (72 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ప్రస్తుతం కమిన్స్‌తో పాటు లయన్ (6 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. వీరిద్దరు తొమ్మిదో వికెట్‌కు అభేద్యంగా 43 పరుగులు జోడించారు. అరగంట అదనపు సమయం తీసుకొని ఎనిమిది ఓవర్లు వేసినా టీమిండియా ఈ జోడీని విడదీయలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్‌లో కంగారూలు కొంత పోరాటపటిమ కనబర్చినా ఓటమి నుంచి తప్పించుకునేందుకు అది సరిపోయేలా లేదు. అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 106 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (102 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషభ్ పంత్ (43 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. ప్యాట్ కమిన్స్ (6/27) ఆరు వికెట్లతో చెలరేగాడు. సొంతగడ్డపై 2016–17 సీజన్లో ఆస్ట్రేలియాను ఓడించి బోర్డర్–గావస్కర్ ట్రోఫీని గెలుచుకున్న భారత్... ఈ టెస్టులో గెలిస్తే తర్వాతి మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ట్రోఫీని నిలబెట్టుకుంటుంది. సిడ్నీ టెస్టును ‘డ్రా’ చేసుకున్నా సరే తొలిసారి ఆస్ట్రేలియాలో సిరీస్ గెలుచుకున్నట్లవుతుంది. 10.3 ఓవర్లు...52 పరుగులు... ఓవర్‌నైట్ స్కోరు 54/5తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్ తక్కువ ఓవర్లలో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు జోడించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్, పంత్ దూకుడుగా ఆడారు. లయన్ ఓవర్లో మయాంక్ రెండు భారీ సిక్సర్లతో చెలరేగడం విశేషం. అయితే ఆ తర్వాత కమిన్స్ అద్భుత బంతిని వికెట్లపైకి ఆడుకోవడంతో మయాంక్ చక్కటి ఇన్నింగ్స్ ముగిసింది. రవీంద్ర జడేజా (6 బంతుల్లో 5; ఫోర్) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. హాజల్‌వుడ్ వేసిన తర్వాతి ఓవర్లో లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాదిన పంత్... తర్వాత బంతిని కీపర్ మీదుగా ఆడబోయి క్యాచ్ ఇచ్చాడు. ఆ వెంటనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్లు కోహ్లి ప్రకటించాడు. పేలవ బ్యాటింగ్... ఆస్ట్రేలియా ఓపెనర్ల పేలవ ప్రదర్శన రెండో ఇన్నింగ్స్‌లోనూ కొనసాగింది. 10 ఓవర్లు కూడా పూర్తి కాక ముందే ఇద్దరూ పెవిలియన్ చేరారు. బుమ్రా తొలి ఓవర్లోనే స్లిప్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి ఫించ్ (3) వెనుదిరగ్గా, జడేజా బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడబోయి షార్ట్‌లెగ్‌లో అగర్వాల్ చేతికి హారిస్ (13) చిక్కాడు. ఈ దశలో షాన్ మార్‡్ష, ఖాజా (59 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) కొద్దిసేపు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ లంచ్ వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. విరామం తర్వాత షమీ... ఖాజాను; షాన్ మార్ష్‌ను బుమ్రా ఎల్బీగా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నారు. మిషెల్ మార్ష్ (21 బంతుల్లో 10; సిక్స్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. కమిన్స్ అర్ధ సెంచరీ... చివరి సెషన్లో కూడా ఆస్ట్రేలియా ఆటలు సాగలేదు. షమీ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి పైన్ పైచేయి సాధించే ప్రయత్నం చేసినా భారత బౌలర్లు తమ ఒత్తిడిని కొనసాగించగలిగారు. హెడ్ (92 బంతుల్లో 34; 2 ఫోర్లు)ను ఇషాంత్ బౌల్డ్ చేయగా, కొద్ది సేపటికే జడేజా బౌలింగ్‌లో పంత్ చేతికి పైన్ (26; 4 ఫోర్లు) చిక్కాడు. అయితే ఎనిమిదో వికెట్ (39 పరుగులు), తొమ్మిదో వికెట్ (43 పరుగులు) భాగస్వామ్యాలు భారత్ కు అసహనాన్ని కలిగించాయి. ఈ రెండు భాగస్వామ్యాల్లో కమిన్స్ కీలక పాత్ర పోషించగా, స్టార్క్ (18), లయన్ అండగా నిలిచారు. ఈ క్రమంలో కమిన్స్ 86 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లయన్, కమిన్స్జోడి 14.1 ఓవర్ల పాటు వికెట్ కోల్పోకుండా నిలబడగలిగింది. -
నిలువునా కూల్చారు
టీమిండియా ఎక్కడా పట్టువిడవలేదు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు కుదురుకునే అవకాశమే ఇవ్వలేదు. నిప్పు కణికల్లాంటి జస్ప్రీత్ బుమ్రా బంతులు నిలువెల్లా వణికించడంతో ఆస్ట్రేలియన్లు చేతులెత్తేశారు. మిగతా బౌలర్లు సహాయక పాత్ర పోషించడంతో మెల్బోర్న్ టెస్టులో కోహ్లి సేన జయభేరి మోగించే దిశగా సాగుతోంది. ఇప్పటికే ఆధిక్యం 346 పరుగులకు చేరింది. మరో రెండు రోజుల సమయం ఉంది. అన్నింటికి మించి భారత్ జోరు మీదుంది. కంగారూలు తోక ముడవడం... సిరీస్‌లో మన జట్టు 2–1తో ముందంజ వేయడం ఖాయంగా కనిపిస్తోంది. మెల్బోర్న్: అంతా కోరుకున్నట్లే ‘బాక్సింగ్ డే’ టెస్టులో భారత బౌలర్లు ఆస్ట్రేలియాకు పంచ్ ఇచ్చారు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా (6/33) కెరీర్ అత్యుత్తమ గణాంకాలతో ఏకంగా నాకౌట్ పంచే కొట్టాడు. దీంతో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు శుక్రవారం ఆతిథ్య జట్టు కుదేలైపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే ఆలౌటైంది. టీమిండియాకు 292 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విరాట్ కోహ్లి సేన... కమిన్స్ (4/10) ధాటికి తడబడింది. ఆట ముగిసే సమయానికి 54 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. టాప్ బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమైనా, అరంగేట్ర ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (28 బ్యాటింగ్) నిలబడటంతో ఆధిక్యాన్ని 346కు పెంచుకుంది. అతడి తోడుగా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. బుమ్రా బెంబేలెత్తించాడు ఓపెనర్లు ఫించ్ (8), హారిస్ (22) సులువుగా పరుగులు సాధించడంతో శుక్రవారం ఉదయం ఆసీస్ ఇన్నింగ్స్ సాఫీగానే ప్రారంభమైంది. కానీ, ఇది ఎంతోసేపు నిలవలేదు. ఇషాంత్ వేసిన బంతిని లెగ్‌సైడ్ ఫ్లిక్ చేసేందుకు యత్నించిన ఫించ్... మయాంక్ చక్కటి క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. భుజం ఎత్తులో వచ్చిన బుమ్రా షార్ట్ బాల్‌ను హుక్ చేయబోయి విఫలమైన హారిస్... ఇషాంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. దూకుడుగా కనిపించిన ఖాజా (21)ను జడేజా వెనక్కు పంపాడు. పాతుకుపోయేందుకు యత్నించిన షాన్ మార్‡్ష (19)ను రెండో స్పెల్‌కు దిగిన బుమ్రా బోల్తా కొట్టించాడు. 89/4తో ఆసీస్ లంచ్‌కు వెళ్లింది. విరామం తర్వాత హెడ్ (20) వికెట్లను గిరాటేసి బుమ్రానే భారత్‌కు మరో బ్రేక్ ఇచ్చాడు. మిషెల్ మార్‡్ష (9)ను జడేజా ఎక్కువసేపు నిలవనీయలేదు. ఈ దశలో కెప్టెన్ పైన్ (22)కు అండగా నిలిచిన కమిన్స్ (17)ను షమీ బౌల్డ్ చేశాడు. టీ తర్వాత మూడో విడత బౌలింగ్‌కు దిగుతూనే తొమ్మిది బంతుల వ్యవధిలో పైన్, లయన్ (0), హాజల్‌వుడ్ (0)లను ఔట్ చేసి కంగారూల ఇన్నింగ్స్‌కు బుమ్రా తెరదించాడు. నాలుగో వికెట్‌కు ఖాజా–షాన్ మార్‡్ష, ఏడో వికెట్‌కు పైన్–కమిన్స్ జోడించిన 36 పరుగులే ప్రత్యర్థి ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యాలు కావడం గమనార్హం. టీమిండియా బౌలర్ల ధాటికి శుక్రవారం ఆ జట్టు 60.5 ఓవర్లే ఆడగలిగింది. కమిన్స్ మాయ చేశాడు... మ్యాచ్‌కు రెండు రోజులపైగా సమయం ఉండటం, ఆధిక్యాన్ని మరింత పెంచుకుని ఆసీస్‌ను ఆత్మరక్షణలోకి నెట్టే ఉద్దేశంతో ఫాలోఆన్ ఇవ్వకుండా భారత్ రెండో ఇన్నింగ్స్‌కు దిగింది. సాధికారికంగా ఆడుతున్న మయాంక్‌కు విహారి (13) తోడ్పాటునందించాడు. ఈ జోడీ 13 ఓవర్లపాటు నిలిచింది. అయితే కమిన్స్ షార్ట్ బంతితో విహారిని పడగొట్టాడు. తర్వాతి ఓవర్లో గ్లాన్స్ ఆడేందుకు యత్నించిన పుజారా (0), కోహ్లి (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. లెగ్‌సైడ్ వెళ్తున్న బంతిని ఆడబోయి రహానే (1) కీపర్‌కు చిక్కాడు. 8 బంతుల తేడాతోనే కమి న్స్ ఈ నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. హాజల్‌వుడ్ వేసిన షార్ట్ బంతి రోహిత్ (5) కథ ముగించింది. చివర్లో మయాంక్, పంత్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. బూమ్రా... భళా మెల్బోర్న్ టెస్టు మూడో రోజు భారత్ తరఫున బుమ్రా, ఆస్ట్రేలియా తరఫున కమిన్స్‌ల స్పెల్ హైలైట్‌గా నిలిచింది. ఎక్కువగా చెప్పుకోవాల్సింది మాత్రం టీమిండియా బౌలర్లు, అందులోనూ బుమ్రా గురించే. మూడు స్పెల్‌లలోనూ షార్ట్ పిచ్, స్లో యార్కర్లు, స్వింగ్ బంతులతో అతడు ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను ఆటాడుకున్నాడు. హుక్ షాట్ ఆడేలా ప్రేరేపించి హారిస్‌ను పెవిలియన్ చేర్చిన బుమ్రా... 115 కి.మీ. వేగం దాటని యార్కర్ లెంగ్త్ బంతితో షాన్ మార్‡్షను ఎల్బీ చేశాడు. దీనిపై ఆసీస్ సమీక్ష కూడా కోరే ఆలోచన చేయలేదంటే బంతి ఎంత కచ్చితంగా పడిందో అర్ధమవుతుంది. ఆ వెంటనే 142 కి.మీ. వేగంతో బెయిల్స్ లేపేసి హెడ్ దిమ్మతిరిగేలా చేశాడు. టీ తర్వాత బుమ్రా స్పెల్ గురించి మరింత చెప్పుకోవాలి. ఆడాలా వద్దా అన్నట్లు వచ్చిన బంతి పైన్ బ్యాట్ అంచును తాకుతూ కీపర్ పంత్ చేతుల్లో పడింది. కచ్చితమైన బంతులతో లయన్, హాజల్వుడ్లనూ ఔట్ చేసి ఆసీస్ ఆట కట్టించాడు. ఇదే సమయంలో ఇషాంత్ బౌలింగ్‌లో షార్ట్ మిడ్ వికెట్లో మయాంక్‌ను ఉంచడం వంటి కోహ్లి ఫీల్డింగ్ వ్యూహాలకూ ప్రశంసలు దక్కాయి. పించ్‌ను ఔట్ చేసి ఇషాంత్ (1/41) శుభారంభమిస్తే... ప్రత్యర్థి భాగస్వామ్యాలను ఎప్పటికప్పుడు విడగొట్టి జడేజా (2/45), షమీ (1/27) బాధ్యతను సంపూర్తిగా నెరవేర్చారు. మొత్తం 66.5 ఓవర్లలో జడేజానే 25 వేయడం గమనార్హం. ఫాలోఆన్ ఇవ్వలేదంటే... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌లో చేసిన స్కోరుకు దాదాపు రెట్టింపు ఆధిక్యం దక్కినా, బుమ్రా సహా మిగతా పేసర్లు పెద్దగా అలసిపోకున్నా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆస్ట్రేలియాను ఫాలోఆన్ ఆడించకపోవడం కొంత ఆశ్చర్యం కలిగించింది. కొన్ని కోణాల్లో చూస్తే ఇది సమంజసమే అనిపించింది. పేసర్లు మరింత తాజాగా బౌలింగ్‌కు దిగే వీలు కల్పించడం ఇందులో మొదటిది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ అనూహ్యంగా పుంజుకొని 400పైగా పరుగులు చేస్తే టీమిండియా నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగాల్సి రావడం రెండోది. ఇదే జరిగితే పిచ్ అనూహ్య స్పందనల కారణంగా స్వల్ప లక్ష్యమే అయినా, ఇబ్బందులు తప్పేలా లేవు. అసలా పరిస్థితే రాకుండా ఉండాలంటే రెండో ఇన్నింగ్స్‌లో మనమే సాధ్యమైనన్ని పరుగులు చేసి, కంగారూల ముందు అందుకోలేనంత భారీ లక్ష్యాన్ని విధించాలని కోహ్లి భావించినట్లున్నాడు. అయితే, భారత బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో ఈ ప్రణాళిక కొంత దెబ్బతిన్నా, ఇప్పటికే అతి భారీ లక్ష్యాన్ని నిర్దేశించే స్థితిలో ఉండటంతో ఆందోళన చెందాల్సిన పని లేకపోయింది. ఈ నేపథ్యంలో నాలుగో రోజు మయాంక్, పంత్ వేగంగా ఆడి లక్ష్యాన్ని 400 పరుగుల సమీపానికి చేరిస్తే ఆ వెంటనే కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఎప్పటిలాగానే బౌలర్లు చెలరేగితే టెస్టు మన వశమౌతుంది. ► ఒకే ఏడాదిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా గడ్డపై ఇన్నింగ్స్‌లో ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా గుర్తింపు పొందాడు. ఈ సంవత్సరం దక్షిణాఫ్రికాపై (జొహన్నెస్‌బర్గ్‌లో 5/54); ఇంగ్లండ్‌పై (ట్రెంట్‌బ్రిడ్జ్‌లో 5/85); ఆస్ట్రేలియాపై (మెల్బోర్న్లో 6/33) ఈ ఘనత సాధించాడు. ► ఒకే ఏడాది విదేశీ గడ్డపై అత్యధిక (45) వికెట్లు తీసిన భారతీయ బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది ఇప్పటికే 45 వికెట్లు పడగొట్టిన బుమ్రా అరంగేట్రం చేసిన సంవత్సరమే ఎక్కువ వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గానూ గుర్తింపు పొందాడు. ► ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారతీయ వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ నిలిచాడు. ప్రస్తుత సిరీస్‌లో పంత్ 18 క్యాచ్‌లు అందుకున్నాడు. గతంలో సయ్యద్ కిర్మాణీ, ధోని అత్యధికంగా 17 క్యాచ్‌లు పట్టారు. మా బ్యాట్స్‌మెన్ పుజారా, కోహ్లిలా ఆడాలి మా బ్యాటింగ్ బాలేదు. తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు చేసి మ్యాచ్‌లో నిలవాలని భావించినా సాధ్యం కాలేదు. ఒత్తిడిని తట్టుకుంటూ భారత తొలి ఇన్నింగ్స్‌లో పుజారా, కోహ్లి ఆడినట్లుగా ఇప్పుడు మా బ్యాట్స్‌మెన్ ఆడాలి. ఈ పిచ్‌పై పరుగులు రావడం కష్టమే. అయితే, మేం గతేడాది నాలుగు, ఐదో రోజున చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన చేశాం. – ఆస్ట్రేలియా పేసర్ కమిన్స్ రంజీ అనుభవంతో రివర్స్ స్వింగ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో నెమ్మదైన పిచ్‌లపై బౌలింగ్ చేసిన అనుభవం మెల్బోర్న్లో ఉపయోగపడింది. దీంతో బంతిని రివర్స్ స్వింగ్ చేయగలిగా. నేను బౌలింగ్‌కు దిగినప్పుడు పిచ్ నెమ్మదిగా ఉంది. బంతి మెత్త బడింది. దీనికి తగ్గట్లే బంతులేశా. బంతి రివర్స్ స్వింగ్ అవుతుండటంతో ఫలితం దక్కింది. నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి కెరీర్ ప్రారంభ ఏడాదిలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడం నన్నేమీ ఆశ్చర్చపర్చలేదు. వివిధ దేశాల్లో ఆడటం కొత్త అనుభూతినిస్తోంది. – జస్ప్రీత్ బుమ్రా, భారత పేసర్ -
నేటి నుంచే... బాక్సింగ్ 'ఢీ' టెస్టు
మూడు విదేశీ సిరీస్ విజయాలే లక్ష్యంగా 2018ని ప్రారంభించింది టీమిండియా. ఆటగాళ్ల గాయాలు, తుది జట్టు ఎంపికలో పొరపాట్లు, బ్యాటింగ్ వైఫల్యాలతో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో ఒక్కో గెలుపుతో సరిపెట్టుకుని వెనుదిరిగింది. ఇవే లోపాలు వెంటాడుతుండగా ఇప్పుడు ఏడాది ఆఖరులో... మూడో సిరీస్ మధ్యలో నిలిచింది. దీనిని కూడా కోల్పోకుండా ఉండాలంటే... ఒక్క గెలుపు సరిపోయే స్థితిలో కొంత మెరుగ్గానే ఉంది. మరి... కోహ్లి సేన ఏం చేస్తుందో? మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) అంటేనే తెలియని ఆకర్షణ. క్రిస్మస్ను ఆనందంగా జరుపుకొని వేలాదిగా హాజరయ్యే ప్రేక్షకుల మధ్య బాక్సింగ్ డే టెస్టు ప్రారంభమై దానిని రెట్టింపు చేస్తుంది. ఆ హంగామాకు ఈసారి పోటాపోటీ సిరీస్ తోడై అభిమానులకు మరింత మజా ఇవ్వనుంది. మరి... ఫలితాన్ని 1–1 నుంచి 2–1కి మార్చే జట్టేదో? పెర్త్‌లో పరాజయం పాలైన టీమిండియా పైచేయికి ప్రయత్నిస్తుందా? తమ చరిత్రలోనే చేదైన అనుభవాలు మిగిల్చిన 2018కి... సొంతగడ్డపై వరుసగా రెండో విజయంతో కంగారూలు వీడ్కోలు పలుకుతారా? చూద్దాం... ఎవరి పంతం నెగ్గుతుందో? మెల్బోర్న్: అనుకున్నట్లే పెర్త్ టెస్టు ఓటమి టీమిండియాలో భారీ మార్పుచేర్పులకు దారితీసింది. బుధవారం నుంచి మెల్బోర్న్లో జరుగనున్న మూడో టెస్టుకు రెగ్యులర్ ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ఇద్దరిపై ఒకేసారి వేటుపడేలా చేసింది. కొంత సంచలనమైనా మెల్బోర్న్లో కోహ్లి సేన సాహసానికి దిగక తప్పని పరిస్థితి కల్పించింది. ఈ ప్రకంపనల నేపథ్యంలో కర్ణాటక పరుగుల యంత్రం మయాంక్ అగర్వాల్ అరంగేట్రం ఖాయమైంది. ఆంధ్ర బ్యాట్స్‌మన్ హనుమ విహారిపై ఇన్నింగ్స్ ఆరంభించే పెద్ద బాధ్యత పడింది. ఫిట్టా, అన్‌ఫిట్టా అనే ఊహాగానాలకు తెరదించుతూ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు తుది 11 మందిలో చోటు దక్కింది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా... బ్యాట్స్ మన్ హ్యాండ్స్కోంబ్ స్థానంలో పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ మిషెల్ మార్ష్‌ను తీసుకుంది. ఆటతో, మాటతో ఇప్పటికే వేడెక్కిన సిరీస్‌ను... ‘బాక్సింగ్ డే’ సమరం ఇంకెంత రసవత్తరం చేస్తుందో చూడాలి. మయాంకొచ్చాడు... వారిద్దరూ ఔట్ లెక్కకు మిక్కిలి అవకాశాలతో పాటు అంతే స్థాయిలో వైఫల్యాలను మూటగట్టుకున్న విజయ్, రాహుల్‌లను ఇంకెంతమాత్రం భరించలేని టీమిండియా... కొత్త కుర్రాళ్లైనా, కఠిన పరిస్థితులు ఎదురవనున్నా ఏమాత్రం సంకోచించకుండా మయాంక్, విహారిలను ఓపెనర్లుగా దించేందుకే సిద్ధమైంది. బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు రోహిత్ శర్మను ఆరో స్థానంలో పంపనుంది. ఫిట్‌నెస్‌పై విపరీత చర్చ జరిగినప్పటికీ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా జడేజానే ఎంచుకుంది. పక్కటెముకల నొప్పి నుంచి ఇంకా కోలుకోని ఆఫ్ స్పిన్నర్ అశ్విన్, ఫిట్‌నెస్‌పై అనుమానాలతో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలకు అవకాశం దక్కలేదు. కూర్పు రీత్యా బ్యాటింగ్ భారాన్ని కెప్టెన్ కోహ్లి, పుజారా, రహానే త్రయమే మోయాలి. వీరిలో ఏ ఇద్దరు నిలిచినా భారీ స్కోరు ఖాయం. కొద్దిసేపు నిలవగలిగితే రోహిత్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ నుంచి మంచి ఇన్నింగ్స్‌లు ఆశించవచ్చు. పేసర్లు ఇషాంత్, షమీ, బుమ్రా చక్కగా రాణిస్తున్నారు. అయితే, ప్రత్యర్థి టాపార్డర్లానే లోయరార్డర్‌ను కూడా వీరు పడగొట్టాలి. చకచకా ఓవర్లు వేసే జడేజా... పరిస్థితులకు తగ్గట్లు వికెట్లు సైతం తీస్తే జట్టుకు మేలు చేకూరుతుంది. హనుమా... గట్టెక్కించుమా? కెరీర్లో మూడో టెస్టు ఆడబోతున్న ఆంధ్ర బ్యాట్స్‌మన్ హనుమ విహారి... మెల్బోర్న్లో ఓపెనింగ్‌కు దిగబోతూ ప్రస్తుతం కీలకమైన ఘట్టం ముందున్నాడు. రంజీల్లోనూ ఇన్నింగ్స్ ప్రారంభించని అతడు ఇప్పుడు ఏకంగా టీమిండియా ఓపెనర్‌గా దిగుతున్నాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ప్రధాన పేసర్ స్టార్క్ పదునైన బంతులను దీటుగా ఎదుర్కొన్న తీరే బహుశా విహారికి ఈ అవకాశం దక్కేలా చేసింది. టెక్నిక్, దృక్పథం రెండూ ఉన్న అతడు మంచి ఇన్నింగ్స్‌తో ఈ సవాల్‌ను అధిగమించగలిగితే జట్టు మేనేజ్మెంట్ నెత్తిన పాలుపోసినవాడవుతాడు. తద్వారా, టెస్టు జట్టులో కీలక సభ్యుడిగానూ ఎదుగుతాడు. అటు నిత్యం ఊగిసలాటలో ఉండే ఆరో స్థానం కంటే, ఓపెనర్‌గా నిలదొక్కుకుంటే వ్యక్తిగతంగానూ అతడి కెరీర్‌కు మేలు చేకూరుతుంది. దీనిని అందిపుచ్చుకుని విహారి విజయవంతమవ్వాలని ఆశిద్దాం. ఆసీస్... వ్యూహాత్మకంగా బ్యాటింగ్‌లో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆతిథ్య జట్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ హ్యాండ్స్‌కోంబ్‌ను తప్పించి మిషెల్ మార్ష్ ఆడిస్తోంది. పిచ్ పేసర్లకు అనుకూలించవచ్చన్న అంచనానే దీనికి కారణమై ఉండొచ్చు. మిషెల్ బ్యాటింగ్‌లోనూ నమ్మదగినవాడే. ధాటిగా పరుగులు రాబట్టే ఓపెనర్ అరోన్ ఫించ్, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖాజా, షాన్ మార్‡్షలను త్వరగా వెనక్కుపంపాలి. పేసర్లు స్టార్క్, హాజల్‌వుడ్, కమిన్స్‌ల పదునైన బంతులను కాచుకోవడం భారత ఓపెనర్లకు కఠిన పరీక్ష. పిచ్ ఎలా ఉన్నా, వికెట్లు తీస్తున్న నాథన్ లయన్... రెండు జట్ల మధ్య తేడా తానేనని చాటుకున్నాడు. ఇతడి లయను దెబ్బతీస్తే కోహ్లి సేన పని సులువవుతుంది. ►2 ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఇప్పటివరకు ఆరు టెస్టుల్లో నెగ్గగా... అందులో రెండు (1977, 1981) మెల్‌బోర్న్‌లోనే వచ్చాయి. ఓవరాల్‌గా భారత్ మెల్బోర్న్లో 12 టెస్టులు ఆడి రెండింటిలో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని ఎనిమిదింటిలో ఓడిపోయింది. పిచ్, వాతావరణం గతేడాది యాషెస్ టెస్టు నిస్సారమైన ‘డ్రా’గా ముగియడంతో మెల్బోర్న్ పిచ్‌ను ఐసీసీ నాసిరకం అని తేల్చింది. తర్వాత షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లూ ఇదే విధంగా సాగాయి. ఇప్పుడు మాత్రం పచ్చికతో పిచ్ జీవం ఉన్నట్లు కనిపిస్తోంది. నాలుగు రోజులు చక్కటి ఎండ కాయనుంది. ఈ ప్రభావం పిచ్‌పైనా పడే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్‌కే మొగ్గుచూపొచ్చు. తుది జట్లు భారత్: మయాంక్ అగర్వాల్, విహారి, పుజారా, కోహ్లి (కెప్టెన్), రహానే, రోహిత్, పంత్, జడేజా, షమీ, ఇషాంత్, బుమ్రా. ఆస్ట్రేలియా: ఫించ్, హారిస్, ఖాజా, షాన్ మార్ష్, హెడ్, మిషెల్ మార్ష్, పైన్ (కెప్టెన్), స్టార్క్, కమిన్స్, లయన్, హాజల్‌వుడ్. ఉదయం గం. 5.00 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–3లో ప్రత్యక్ష ప్రసారం బ్యాట్స్‌మెన్... బాధ్యతగా ఆడండి అద్భుతంగా రాణిస్తున్న మా బౌలర్లకు సమష్టి ప్రదర్శనతో బ్యాట్స్‌మెన్ అండగా నిలవాలి. మేం మెరుగైన స్కోరు చేయకుంటే బౌలర్లు ఏమీ చేయలేరు. నాథన్ లయన్‌ను ఎదుర్కొనేందుకు మా వద్ద ప్రణాళికలున్నాయి. మైదానంలో జరిగిన దానికి (పైన్‌తో వాగ్వాదం) బయట ఏమనుకుంటున్నారో నాకు అనవసరం. నేను ఇలాంటి వాడిని అని బ్యానర్ కట్టుకుని తిరుగుతూ బయటి ప్రపంచానికి చెప్పాల్సిన పనిలేదు. మిగతా వారు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం నా పని కూడా కాదు. ఎందుకంటే... ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. – భారత కెప్టెన్ విరాట్ కోహ్లి -
17 బంతుల్లో ముగించేశారు
నాటింగ్‌హామ్: లాంఛనం ముగిసింది... పెద్దగా ఇబ్బంది పడకుండానే పని పూర్తయింది... నాలుగో రోజు 34 బంతుల పాటు విసిగించిన ఇంగ్లండ్ ఆఖరి జోడీని... బుధవారం 17 బంతుల్లోనే భారత్ విడదీసింది. మూడో టెస్టును 203 పరుగుల భారీ తేడాతో వశం చేసుకుంది. ఈ విజయంతో 1–2తో నిలిచి సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకుంది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రాణించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి (97, 103)కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. నాలుగో టెస్టు ఈ నెల 30 నుంచి సౌతాంప్టన్‌లో జరుగనుంది. ఐదో రోజు వర్ష సూచనల నేపథ్యంలో టీమిండియా విజయానికి వరుణుడు అడ్డుపడతాడేమోనని కొంత ఆందోళన రేగినా అదేమీ ప్రతిబంధకం కాలే దు. ఆల్‌రౌండర్ పాండ్యా వేసిన తొలి ఓవర్‌ను ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ జేమ్స్ అండర్సన్ (11) మెయిడెన్ ఆడాడు. తర్వాత షమీ ఓవర్‌ను ఆదిల్ రషీద్ (33 నాటౌట్) ఎదుర్కొన్నాడు. అశ్విన్ వేసిన మూడో ఓవర్ ఐదో బంతికి అండర్సన్... స్లిప్‌లో రహానేకు క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు 317 పరుగుల వద్ద తెరపడింది. క్రితం రోజు స్కోరుకు ఆతిథ్య జట్టు 6 పరుగులు మాత్రమే జత చేయగలిగింది. అంతా కలిపి 10 నిమిషాల్లో తేలిపోయింది. కేరళ వరద బాధితులకు అంకితం వరుసగా రెండు టెస్టులు ఓడేసరికి జనం మాపై నమ్మకం కోల్పోయారు. కానీ మాపై మేం నమ్మకం పెట్టుకున్నాం. 2–0 నుంచి 1–2గా మారిన ఈ గణాంకాలు దాని ఫలితమే. ఈ విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితం చేస్తున్నాం. వారికిది నిజంగా కష్టకాలమే. భారత జట్టుగా మేం వారికి ఇస్తున్న చిన్న ఊరట ఇది. –కోహ్లి ►2 ఈ గెలుపుతో భారత్‌కు అత్యధిక టెస్టు విజయాలు అందించిన కెప్టెన్స్ జాబితాలో కోహ్లి (22 విజయాలు) రెండో స్థానానికి చేరాడు. గంగూలీ (21 టెస్టు విజయాలు) రికార్డును అతను అధిగమించాడు. ధోని (27 విజయాలు) టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. సన్నాహాల్లో సచినంతటోడు క్రికెట్ పట్ల దృక్పథంలో విరాట్ కోహ్లిని మించినవారు లేరు. ఆటపై అవగాహన, సన్నాహాలు, ప్రణాళికలు, వర్తమానంలో ఆలోచించడంలో అతడు సచిన్ టెండూల్కర్‌కు సరితూగుతాడు. ప్రస్తుత పేస్ బౌలింగ్ దళం భారత క్రికెట్ చరిత్రలోనే ఉత్తమమైనది. ఈ జట్టు ప్రపంచ పర్యాటక జట్లలోనే అత్యుత్తమం. –భారత కోచ్ రవిశాస్త్రి -
ప్రత్యర్థిని ఓ ఆటాడేసిన భారత్!
అదే జోరు... అదే ఆధిపత్యం... మూడో టెస్టు మూడో రోజు కూడా భారత్ ప్రత్యర్థిని ఒక ఆటాడుకుంది. కోహ్లి చక్కటి సెంచరీకి తోడు పుజారా సహనం, చివర్లో పాండ్యా దూకుడు కలగలిపి టీమిండియా సోమవారం ఆటను శాసించింది. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లోనూ భారీ స్కోరు సాధించి ప్రత్యర్థికి సవాల్ విసిరింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని 521 పరుగుల అసాధారణ లక్ష్యాన్ని ఇంగ్లండ్‌కు నిర్దేశించింది. ఇక మిగిలిన రెండు రోజుల్లో మన బౌలర్లు ఎంత వేగంగా బ్యాట్స్‌మెన్‌ను పడగొడతారనేది చూడాలి. గెలుపు సంగతేమో కానీ కనీసం ‘డ్రా’ కోసమైనా ఇంగ్లండ్ రెండు పూర్తి రోజులు నిలబడటం కూడా దాదాపు అసాధ్యంగా కనిపిస్తున్న స్థితిలో వాతావరణం ప్రతికూలంగా మారితే తప్ప కోహ్లి సేన గెలుపు లాంఛనమే కావచ్చు! నాటింగ్‌హామ్: ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 2–1కి తగ్గించేందుకు భారత్ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. 521 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. గెలుపు కోసం ఇంగ్లండ్ మరో 498 పరుగులు చేయాల్సి ఉంది! అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. విరాట్ కోహ్లి (103; 10 ఫోర్లు) టెస్టుల్లో 23వ సెంచరీతో చెలరేగగా... పుజారా (72; 9 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (52 బంతుల్లో 52 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. కీలక భాగస్వామ్యాలు: ఓవర్‌నైట్ స్కోరు 124/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ తొలి సెషన్లో చాలా జాగ్రత్తగా ఆడింది. ఇంగ్లండ్ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కోహ్లి, పుజారా వేగంగా ఆడే ప్రయత్నం చేయలేదు. 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అండర్సన్ బౌలింగ్‌లో పుజారా క్యాచ్‌ను స్లిప్‌లో బట్లర్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. తొలి సెషన్లో భారత్ 29 ఓవర్లు ఆడి 70 పరుగులు చేయగలిగింది. లంచ్ తర్వాత వీరిద్దరి భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. ఈ దశలో పుజారాను ఔట్ చేసి స్టోక్స్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. కోహ్లికి లైఫ్!: పుజారా వెనుదిరిగాక వచ్చిన రహానే కూడా కోహ్లికి చక్కటి సహకారం అందించాడు. టీ విరామానికి భారత్ స్కోరు 270 పరుగులకు చేరగా, మూడో సెషన్లో కూడా భారత్ తమ ఆటను కొనసాగించింది. తొలి ఇన్నింగ్స్‌లో దురదృష్టవశాత్తూ సెంచరీ కోల్పోయిన భారత కెప్టెన్‌కు రెండో ఇన్నింగ్స్‌లో అదృష్టం అండగా నిలిచింది. 93 పరుగుల వద్ద అండర్సన్ బౌలింగ్‌లో గల్లీలో నేరుగా చేతుల్లోకి వచ్చిన సునాయాస క్యాచ్‌ను జెన్నింగ్స్ వదిలేయగా... తర్వాతి బంతి మొదటి స్లిప్‌లో కుక్కు కాస్త ముందుగా పడింది. అయితే ఉత్కంఠకు తెర దించుతూ వోక్స్ వేసిన తర్వాతి ఓవర్ నాలుగో బంతిని కోహ్లి బౌండరీగా మలచి శతకం పూర్తి చేసుకున్నాడు. వోక్స్ తర్వాతి ఓవర్లోనే ఎల్బీగా దొరికిపోవడంతో విరాట్ ఆట ముగిసింది. పాండ్యా అర్ధ సెంచరీ పూర్తయిన కొద్ది సేపటికే భారత్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. -
పాండ్యా ‘పాంచ్’ పటాకా.. పట్టు బిగించిన భారత్!
ట్రెంట్‌బ్రిడ్జ్‌లో అందివచ్చిన అవకాశాన్ని భారత్ అద్భుతంగా ఒడిసి పట్టుకుంది. ముందుగా హార్దిక్ పాండ్యా అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకే కుప్పకూల్చి 168 పరుగుల భారీ ఆధిక్యం అందుకున్న టీమిండియా... ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ దూకుడుగా ఆడి ఓవరాల్ ఆధిక్యాన్ని 292 పరుగులకు పెంచుకుంది. ఫలితంగా రెండో రోజే టీమిండియా మ్యాచ్‌ను తమ చేతుల్లోకి తెచ్చేసుకోగా... పేలవ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ పరాజయానికి బాటలు పరచుకుంది. నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టుపై భారత్ పట్టు బిగించింది. రెండో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (44, 6 ఫోర్లు), కేఎల్ రాహుల్ (36, 7 ఫోర్లు) వేగంగా ఆడి వెనుదిరగ్గా... ప్రస్తుతం పుజారా (33 బ్యాటింగ్), కోహ్లి (8 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 38.2 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. బట్లర్ (39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఒక దశలో 54/0తో ఉన్న ఇంగ్లండ్ ఒక్క సెషన్లోనే 115 పరుగులు చేసి 10 వికెట్లు కోల్పోవడం విశేషం. హార్దిక్ పాండ్యా (5/28) కేవలం 29 బంతుల వ్యవధిలో 5 వికెట్లు తీసి సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. 7.5 ఓవర్లలో... వర్షం కారణంగా రెండో రోజు ఆట అర గంట ఆలస్యంగా మొదలైంది. ఓవర్‌నైట్ స్కోరు 307/6తో ఆట కొనసాగించిన భారత్ 47 బంతుల్లో మరో 22 పరుగులు జోడించి ఆలౌటైంది. రిషభ్ పంత్ (24)ను ముందుగా ఔట్ చేసిన బ్రాడ్... తన తర్వాతి ఓవర్లో అశ్విన్ (14)ను కూడా అదే తరహాలో క్లీన్‌బౌల్డ్ చేశాడు. మరుసటి ఓవర్లో అండర్సన్... షమీ (3), బుమ్రా (0)లను వరుస బంతుల్లో పెవిలియన్ పంపించి టీమిండియా ఇన్నింగ్స్‌కు తెర దించాడు. టపటపా... ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించింది. కుక్ (29), జెన్నింగ్స్ (20) తొలి వికెట్‌కు 12 ఓవర్లలోనే 54 పరుగులు జోడించారు. అయితే లంచ్ విరామం తర్వాత ఆట భారత్ వైపు తిరిగింది. ఓపెనర్లు ఇద్దరూ వరుస బంతుల్లో వెనుదిరిగారు. కుక్‌ను ఇషాంత్ ఔట్ చేయగా, తర్వాతి ఓవర్ తొలి బంతికే జెన్నింగ్స్‌ను బుమ్రా పెవిలియన్ పంపించాడు. కొద్ది సేపటికే పోప్ (10) కూడా వెనుదిరిగాడు. ఈ మూడు క్యాచ్‌లను పంత్ పట్టడం విశేషం. జట్టును ఆదుకోవాల్సిన బాధ్యత తీసుకున్న రూట్ (16) కూడా వివాదాస్పద రీతిలో ఔట్ కావాల్సి వచ్చింది. పాండ్యా బౌలింగ్‌లో రూట్ స్లిప్‌లోకి ఆడగా బంతి నేలను తాకే క్షణాన రాహుల్ అందుకున్నాడు. అంపైర్ ఔట్‌గా ప్రకటించినా... రూట్ వెనుదిరిగేందుకు నిరాకరించాడు. దాంతో థర్డ్ అంపైర్ పదే పదే రీప్లేలు చూసిన అనంతరం రూట్‌ను ఔట్‌గా ఖరారు చేశాడు. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయిన ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో బట్లర్ కొంత దూకుడుగా ఆడి ఇంగ్లండ్‌ను ఫాలోఆన్ నుంచి తప్పించాడు. షమీ ఓవర్లో అతను వరుసగా 4, 6, 4 సహా మొత్తం 16 పరుగులు రాబట్టాడు. తొలి టెస్టు ఆడుతున్న రిషభ్ పంత్ ఐదు క్యాచ్‌లు అందుకోవడం విశేషం. పాండ్యా ‘పాంచ్’ పటాకా... ‘ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలో పడేసే వాడి వేడి కనిపించవు. నిలకడ, బంతిపై నియంత్రణ కూడా లేవు. క్లిష్ట సమయాల్లో వికెట్ తీసే విషయంలో కెప్టెన్ అతడిపై నమ్మకం ఉంచడం కష్టం’... విండీస్ దిగ్గజం బౌలర్ మైకేల్ హోల్డింగ్ ఈ వ్యాఖ్య చేసి మూడు రోజులు కూడా కాలేదు. ఇంతలోనే పాండ్యా ఒక్కసారిగా బంతితో హీరోగా మారిపోయాడు. తన సహచర సీనియర్ పేసర్లకు సాధ్యం కాని విధంగా, అటు వైపు అండర్సన్ కూడా ఆశ్చర్యపోయేలా బంతిని స్వింగ్ చేసి పడేశాడు. ఆఫ్ స్టంప్ లైన్ ఏమాత్రం తప్పకుండా కట్టుదిట్టమైన బంతులతో అతను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టి పడేశాడు. ఆడక తప్పని పరిస్థితి కల్పించి వికెట్లు పడగొట్టాడు. కెరీర్లో గత 15 ఇన్నింగ్స్‌లలో ఒకే సారి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీయగలిగిన పాండ్యా ఇప్పుడు మొదటిసారి ఐదు వికెట్లతో సత్తా చాటాడు. తాను వేసిన 6 ఓవర్ల స్పెల్‌లో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లతో మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశాడు. తొలి బంతికే రూట్‌ను ఔట్ చేయడంతో ఇంగ్లండ్ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత ఒకే ఓవర్లో బెయిర్‌స్టో (15), వోక్స్ (8)లను అతను పెవిలియన్ పంపించాడు. తన తర్వాతి ఓవర్లోనే రషీద్ (5)తో పాటు బ్రాడ్ (0)ను వికెట్ల ముందు దొరికించుకొని ‘పాంచ్’ పూర్తి చేశాడు. అతని వికెట్లలో రెండు కీపర్ క్యాచ్‌లు, రెండు స్లిప్‌లు, ఒక ఎల్బీ కావడం చూస్తే ఆ బౌలింగ్ ఎంత పదునుగా ఉందో అర్థమవుతుంది. -
మా మీద నమ్మకం ఉంచండి...
వరుసగా రెండు టెస్టుల్లో ఎదురైన పరాజయాలను పట్టించుకోకుండా తమకు అండగా నిలవాలని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిమానులను కోరుతున్నాడు. ‘కొన్నిసార్లు మనం గెలుస్తాం. కొన్నిసార్లు నేర్చుకుంటాం. అంతమాత్రాన మీరు మాపై నమ్మకం కోల్పోవద్దు. ఇదే సమయంలో మిమ్మల్ని నిరాశపర్చమని మా తరఫున హామీ ఇస్తున్నా’ అని కోహ్లి తన అధికార ఫేస్బుక్ పేజీలో సందేశం ఉంచాడు. దీనికి ప్రాక్టీస్ సెషన్లో శ్రమిస్తున్న భారత జట్టు ఫొటోను జతచేశాడు. -
మూడో టెస్టుకూ దూరం
లండన్: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ భారత్‌తో జరుగనున్న మూడో టెస్టుకూ దూరమయ్యాడు. గతేడాది సెప్టెంబర్‌లో నైట్‌క్లబ్ వెలుపల తప్పతాగి ఒక వ్యక్తిని చితక బాదిన కేసును బ్రిస్టల్ క్రౌన్ కోర్టు విచారణ జరుపుతోంది. అయితే ఈ క్రిమినల్ విచారణ అనం తరం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. దీంతో భారత్‌తో మిగతా సిరీస్‌కూ అతను దూరమ య్యే అవకాశముందని స్థానిక మీడియా పేర్కొంది. విచారణ సందర్భంగా ఆత్మరక్షణ కోసమే దాడి చేశానన్న క్రికెటర్ వ్యాఖ్యలు సత్యదూరమని న్యాయమూర్తి కొట్టిపారేసినట్లు తెలిసింది. తొలి టెస్టులో రాణించిన స్టోక్స్ నాలుగు కీలక వికెట్లు తీశాడు. అయితే రెండో టెస్టులో అతని స్థానంలో వచ్చిన వోక్స్ ఏకంగా మ్యాచ్‌నే గెలిపించే ప్రదర్శన ఇచ్చాడు. దీంతో స్టోక్స్ లేని లోటేమీ కనబడలేదు. మూడో టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టులో ఏ మార్పు చేయలేదు. గత మ్యాచ్ ఆడిన జట్టే బరిలోకి దిగుతుంది. మూడో టెస్టు ఈ నెల 18 నుంచి మొదలవుతుంది. -
బ్యాట్స్‌మెన్‌పైనే భారం
భారత సీమర్లు బాధ్యతగా బౌలింగ్ చేశారు. రెండో టెస్టులో జట్టు పుంజుకునేందుకు తమ వంతు కృషి చేశారు. లార్డ్స్‌లో మూడో రోజు పరిస్థితులు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కే అనుకూలంగా ఉన్నాయి. ఇలాంటి స్థితిలోనూ భారత బౌలర్లు స్వింగ్‌తో ఫలితాలను రాబట్టారు. సొంతగడ్డపై ఇంగ్లిష్ బౌలర్లంత కాకపోయినా తమ సామర్థ్యం మేరకు పిచ్‌పై తమ ప్రతాపాన్ని చూపెట్టారు. ఇషాంత్ శర్మ అద్భుతమైన డెలివరీతో అనుభవజ్ఞుడైన కుక్ వికెట్ పడగొడితే... మొహహ్మద్ షమీ అసాధారణ బంతితో రూట్ ఆట ముగించాడు. హార్దిక్ పాండ్యా కూడా ఓ చేయివేశాడు. బౌన్సర్ల జోలికి వెళ్లకుండా వైవిధ్యమైన బంతులతో ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌ను బాగా ఇబ్బంది పెట్టాడు. పిచ్ నుంచి సహకారం లభించినప్పటికీ పాండ్యా తన సామర్థ్యాన్నే నమ్ముకున్నాడు. తొలి టెస్టులో బ్యాటింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకున్న భారత్ ఈ మ్యాచ్‌లో కళ్లు తెరిచింది. ఫామ్‌లో లేని ధావన్‌ను పక్కనబెట్టి టెస్టు స్పెషలిస్ట్ పుజారాను దించింది. అలాగే స్పిన్నర్ కుల్దీప్కు అవకాశమిచ్చింది. ఈ మణికట్టు బౌలర్ వన్డేల్లో ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌ను వణికించినట్లే ఈ టెస్టులోనూ రాణిస్తాడేమో చూడాలి. అండర్సన్‌ను ఎంత ప్రశంసించినా తక్కువే. స్వదేశీ పరిస్థితుల్ని సద్వినియోగం చేసుకున్న తీరు అమోఘం. అతడు సంధించిన కొన్ని ఔట్ స్వింగర్లు వేగంగా వచ్చే లెగ్బ్రేక్లను తలపించాయి. ఇవి కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వ కుండా దెబ్బతీస్తాయి. అతనికి వోక్స్ చక్కగా తోడ్పాటునిచ్చాడు. మరో ఎండ్ నుంచి వోక్స్ కూడా భారత బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించే బంతుల్నే సంధించాడు. ఇతని దూకుడుతో స్టోక్స్ లేని లోటే కనపడలేదు. కరన్ తక్కువేం తినలేదు. అతనూ బాగా బౌలింగ్ చేశాడు. అక్కడి వాతావరణ పరిస్థితులు భారత బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో చురుగ్గా స్పందించకుండా చేశాయి. చూస్తుంటే భారత్‌కు ఈ మ్యాచ్ క్లిష్టమైన సవాల్ విసురుతోంది. అయితే భారత బ్యాట్స్‌మెన్ భారీ స్కోరు సాధించి మొదటి టెస్టులాగే ఆతిథ్య జట్టుకు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే పరిస్థితుల్లో మార్పురావొచ్చు. -
మొగ్గు మనవైపే..!
అరుదైన సందర్భం... అద్భుత అవకాశం... కావాల్సినంత సమయం... ఆత్మరక్షణలో ప్రత్యర్థి... ఊరిస్తున్న విజయం! మూడో టెస్టు ఇప్పుడు పూర్తిగా భారత్ చేతుల్లో! తొలి ఇన్నింగ్స్లోలాగా బౌలర్లు చెలరేగితే చాలు... గెలుపు మన ఖాతాలో పడిపోతుంది! సిరీస్‌కు మంచి ముగింపునిచ్చినట్లు అవుతుంది. జొహన్నెస్‌బర్గ్: మ్యాచ్‌లో ఇరు జట్లూ సమఉజ్జీగా నిలిచిన వేళ... అత్యంత కఠిన పరిస్థితుల్లో, అదీ రెండో ఇన్నింగ్స్‌లో, ఆపై విదేశీ గడ్డపై భారత్ బ్యాట్స్‌మెన్ అసాధారణంగా ఆడారు. మిడిలార్డర్లో అజింక్య రహానే (68 బంతుల్లో 48; 6 ఫోర్లు), కెప్టెన్ కోహ్లి (79 బంతుల్లో 41; 6 ఫోర్లు)లకు తోడు లోయరార్డర్లో భువనేశ్వర్ (76 బంతుల్లో 33; 2 ఫోర్లు), షమీ (28 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్‌లు) బ్యాట్ ఝళిపించడంతో మూడో రోజు టీమిండియా 247 పరుగులకు ఆలౌటైంది. ప్రొటీస్‌కు 241 పరుగుల లక్ష్యం విధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలాండర్ (3/61), మోర్కెల్ (3/47), రబడ (3/69) రాణించారు. బంతి అసహజంగా బౌన్స్ అవుతున్న వాండరర్స్ పిచ్‌పై కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలో దిగిన సఫారీ జట్టు... పిచ్ పరిస్థితిరీత్యా ఆట నిలిపివేసే సమయానికి వికెట్ నష్టపోయి 17 పరుగులు చేసింది. ఓపెనర్ డీన్ ఎల్గర్ (11 బ్యాటింగ్), ఆమ్లా (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జట్టు చేతిలో 9 వికెట్లుండగా... మరో 224 పరుగులు చేయాల్సి ఉంది. రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో... ప్రత్యర్థి అసాధారణ పోరాటం చేస్తే తప్ప ప్రస్తుతానికి జొహన్నెస్‌బర్గ్ టెస్టులో మన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయ్ ఓర్పు... కోహ్లి నేర్పు... ఓవర్‌నైట్ స్కోరు 49/1తో శుక్రవారం ఉదయం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియాను తొలి సెషన్లో కెప్టెన్ కోహ్లి, ఓపెనర్ మురళీ విజయ్ (127 బంతుల్లో 25) నిలబెట్టారు. ముఖ్యంగా విజయ్ బంతి పాతబడేలా అత్యంత ఓర్పు చూపాడు. అవతలివైపు కోహ్లి చక్కటి డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ (16), డిపెండబుల్ పుజారా (1) త్వరగానే వెనుదిరగడంతో 57/3తో కష్టాల్లో పడిన జట్టును వీరిద్దరూ 43 పరుగులు భాగస్వామ్యంతో ఆదుకున్నారు. అయితే... లంచ్‌కు ముందు ఓవర్లో రబడ యార్కర్‌కు విజయ్ బౌల్డయ్యాడు. రహానే, భువీ మెరుపులు... లంచ్ తర్వాత కెప్టెన్‌తో కలిసిన రహానే అచ్చమైన టెస్టు షాట్లు ఆడుతూ తన విలువేంటో చూపాడు. అవతలి వైపు కోహ్లి పట్టుదలగా కనిపించాడు. అయిదో వికెట్‌కు 34 పరుగులు జతయ్యాక... అతడిని రబడ అద్భుత బంతితో అవుట్ చేశాడు. వెంటనే హార్దిక్ పాండ్యా (4) మరోసారి పేలవ షాట్‌కు వెనుదిరిగాడు. అప్పటికి స్కోరు 148/6. ఆధిక్యం 141 మాత్రమే. ఈ సమయంలో భువీ తోడుగా రహానే ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరు ప్రొటీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. డీప్ పాయింట్లో ఎల్గర్ క్యాచ్ వదిలేయడంతో రహానే బతికిపోయాడు. ఈ ఇద్దరూ బంతిని ఖాళీల్లోకి కొడుతూ ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోయారు. భువీ అయితే తడబాటు అనేదే లేకుండా టాపార్డర్ బ్యాట్స్‌మన్‌ను తలపించాడు. తొలి ఇన్నింగ్స్లోలానే కీలకమైన పరుగులు జోడించాడు. టీ వరకు వీరు మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. షమీ దూకుడు... విరామం అనంతరం జట్టు స్కోరు 200 దాటించాక మోర్కెల్ ఓవర్లో లెగ్‌సైడ్ ఆడబోయిన రహానే... కీపర్ డికాక్ పట్టిన ఫుల్ లెంగ్త్ డైవ్ క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. దీంతో 53 పరుగుల ఏడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇన్నింగ్స్‌కు తెరపడేందుకు మరెంతో సేపు పట్టదనుకుంటుండగా షమీ మెరుపులు మెరిపించాడు. దూకుడుగా కనిపించిన అతడు రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టాడు. ఈ టెస్టులో తొలి సిక్స్ షమీదే కావడం విశేషం. అయితే స్క్వేర్‌లెగ్ మీద డివిలియర్స్‌ను ఉంచి ఇన్‌గిడి షమీని బుట్టలో పడేశాడు. భువీ... మోర్కెల్ షార్ట్ పిచ్ బంతికి కీపర్‌కు క్యాచ్ ఇవ్వగా, బుమ్రా (0)ను ఫిలాండర్ అవుట్ చేయడంతో ఇన్నింగ్స్ ముగిసింది. ఇషాంత్ (7) నాటౌట్‌గా మిగిలాడు. ఈసారి ప్రొటీస్ బౌలర్లు 29 అదనపు పరుగులు ఇచ్చారు. భారత ఇన్నింగ్స్‌లో ఇది నాలుగో అత్యధిక స్కోరు కావడం విశేషం. వికెట్ పడింది... ఆట ముందే ఆగింది... పిచ్ పరిస్థితి దృష్ట్యా నాలుగో ఇన్నింగ్స్‌లో కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టుకు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి పంపిన ఓపెనర్ మార్క్రమ్ (4) మరెంతో సేపు నిలవలేదు. రెండో ఓవర్లో షమీ బౌలింగ్‌లో పార్థివ్‌కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం 6 ఓవర్లపైగా ఆట సాగింది. ఈ నేపథ్యంలో అరగంట పైగా ఆట ఉండి... అంతా మరో వికెట్ గురించి ఆలోచిస్తుండగా 8వ ఓవర్లో ఛేంజ్ బౌలర్‌గా బుమ్రా వచ్చాడు. అతడు వేసిన తొలి మూడు బంతులు అనూహ్యంగా పైకి లేచాయి. మూడో బంతి ఏకంగా ఎల్గర్ హెల్మెట్‌ను బలంగా తాకింది. దీంతో అతడు ఐస్ పెట్టుకోవాల్సి వచ్చింది. పరిస్థితిని గమనించి మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ మైదానంలోకి వచ్చి అంపైర్లతో చర్చించాడు. అనంతరం ఆటను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వామ్మో పిచ్ పచ్చికతో కళకళలాడే వాండరర్స్ పిచ్ అంటే పేసర్లు పండుగ చేసుకుంటారు. దీనికి తగ్గట్లే తొలి రెండు రోజులు ఒకటి రెండు బంతులు భారీగా బౌన్స్ అయినా సహజమని భావించారు. కానీ... శుక్రవారం పిచ్ మరీ ప్రమాదకరంగా కనిపించింది. గుడ్ లెంగ్త్, షార్ట్ లెంగ్త్ ప్రదేశాల్లో నెర్రెలు బారి అసహజ బౌన్స్‌తో తొలి సెషన్ నుంచే బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపింది. రబడ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 31వ ఓవర్లో కోహ్లి కుడి చేతిని, 35వ ఓవర్లో విజయ్ ఎడమ చేతిని బంతులు గట్టిగా తాకాయి. దీనిపై కోహ్లి, అంపైర్లు ఒకసారి చర్చించారు కూడా. మళ్లీ ఇలాగే జరగడంతో ఇరు జట్ల కెప్టెన్లు, అంపైర్లు సుదీర్ఘంగా సంభాషించుకున్నారు. తర్వాత కూడా రహానే మోచేయి, గ్లోవ్స్‌కు తగిలింది. చివరకు ఎల్గర్ హెల్మెట్ గ్రిల్స్‌ను బంతి తాకిన పరిస్థితి చూసి తీవ్రత తెలిసింది. విండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మైకేల్ హోల్డింగ్ అయితే... బ్యాట్స్‌మెన్ తీవ్రంగా గాయపడే ఇలాంటి పిచ్‌కు 2 మార్కులు కూడా ఇవ్వనని ప్రకటించాడు. మరోవైపు రెండు జట్ల ఆటగాళ్లకు తక్షణ వైద్యం అందించేందుకు తరచూ ఫిజియోలు రావడంతో... వాండరర్స్‌లో వారికి పని దొరికిందనే వెటకారం వ్యాఖ్యలు వచ్చాయి. శుక్రవారం ఆటను తొందరగానే ముగించడంతో మ్యాచ్ కొనసాగుతుందా లేదా అనే సస్పెన్స్ కొంచెం సేపు కొనసాగింది. అయితే రిఫరీ, అంపైర్లు, రెండు జట్ల కెప్టెన్ల మధ్య చర్చల అనంతరం శనివారం యధావిధిగా ఆటను కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికార ప్రకటన విడుదలైంది. వికెట్ స్పోర్టివ్‌గా ఉంది... ఇది రెండు జట్లకూ అవకాశాలున్న చాలెంజింగ్ పిచ్. బౌన్స్ ప్రమాదకరంగా ఏమీ లేదు. ఈ తరహాలో రూపొందించాలని మేమైతే కోరలేదు. ఆట సాగాలనే అనుకున్నాం. ఎల్గర్‌కు తగిలిన బంతి బ్యాక్ ఆఫ్ లెంగ్త్‌లో పడింది. అందుకని అదనపు బౌన్స్ కంటే కొంచెం ఎక్కువగా స్పందించింది. మా టెయిలెండర్లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి బౌలర్లు బౌన్సర్లు వేశారు కదా? కొత్త బంతితో ఆడటం సవాలే కానీ ప్రమాదకరం కాదు. – భారత వైస్ కెప్టెన్ రహానే