పుజారాపై పేలిన జోకులు | Twitter reactions on Pujara batting | Sakshi
Sakshi News home page

పుజారాపై పేలిన జోకులు

Jan 24 2018 5:06 PM | Updated on Jan 24 2018 5:52 PM

Twitter reactions on Pujara batting - Sakshi

జొహన్నెస్‌బర్గ్‌ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిటెస్టులో టీమిండియా నయావాల్‌ చతేశ్వర పుజారా బ్యాటింగ్‌పై సోషల్‌ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి. పిచ్‌ పేస్‌కు అనుకూలిస్తుండటంతో భారత్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్నారు. ఓపెనర్లు లోకేశ్‌ రాహుల్‌(0), మురళి విజయ్‌(8)లు త్వరగా అవుటవ్వడంతో కెప్టెన్‌ కోహ్లి, పుజారాలు బాధ్యాతాయుతంగా ఆడుతున్నారు.

ఈ తరుణంలో పుజారా పరుగుల ఖాతా తెరవడానికి ఏకంగా 54 బంతులు తీసుకొని అసలు సిసలైన టెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అని మరోసారి నిరూపించుకున్నాడు. అంతకు ముందు వెస్టిండీస్‌పై  2016లో ఇలా 35 బంతులు తీసుకున్నాడు. అయితే తొలి పరుగు చేయడానికి 90 నిమిషాలు నిరీక్షించడంతో మైదానంలో నవ్వులు విరబూసాయి. ఈ బ్యాటింగ్‌ తీరుపై నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. తమ ఫొటోషాప్‌ నైపుణ్యానికి పదును పెట్టి మరి ట్రోల్‌ చేస్తున్నారు. 76 బంతుల తర్వాత ఫిలాండర్‌ బౌలింగ్‌లో వరుసగా పుజారా రెండు ఫోర్లు బాదాడు.  ఏది ఏమైనా పుజారా మాత్రం అసలు సిసలు టెస్టు బ్యాటింగ్‌ అంటే ఏంటో తెలియజేస్తున్నాడు.

పుజరాపై నెటిజన్ల కామెంట్స్‌
‘పుజరా మ్యాచ్‌ డ్రా చేద్దామని ఆడుతున్నాడు’.

‘ఆధార్‌ లేకుండా బ్యాంకు అకౌంట్‌ కోసం వెళ్లే వ్యక్తిలా పుజారా బ్యాటింగ్‌ ఉంది. అతను అకౌంట్‌ తెరవలేడు’.

‘పుజారా సంయమనాన్ని ప్రాక్టీస్‌ చేస్తున్నాడు’.

‘ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాలు పూజారా బ్యాటింగ్‌ చూస్తున్నారు’.

‘పిల్లలు : మ్యాచ్‌ గెలుపుపై బెట్టింగ్‌
అడల్ట్స్‌ : పరుగులపై బెట్టింగ్‌
లెజెండ్‌: పుజారా తొలి పరుగుపై బెట్టింగ్‌’

 

‘పుజారా బ్యాటింగ్‌ తాబేలు పరుగులా ఉంది’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement